Nelakondapally khammam

Nelakondapally khammam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nelakondapally khammam, Nelakondapally, Khammam.

07/10/2023
*ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*  హైదరాబాద్ నుంచి ఒడిశా కు నడిచి వెళ్తున్న నిండు గర్భవతి.. భర్త, మరో వ్యక్తి..500 కీలోమీటర్ల...
21/04/2020

*ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్..*

హైదరాబాద్ నుంచి ఒడిశా కు నడిచి వెళ్తున్న నిండు గర్భవతి.. భర్త, మరో వ్యక్తి..

500 కీలోమీటర్ల దూరం నడిసేందుకు సాహసం.

మార్చి 15న హైదరాబాద్ నుంచి బయలుదేరిన దంపతులు..

కూసుమంచి లో గుర్తించిన పోలీసులు..

అన్నం ట్రస్టుకు తరలింపు...

న్యూఢిల్లీ : మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్...
15/04/2020

న్యూఢిల్లీ : మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 20వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నట్టు తెలిపారు. ఏప్రిల్‌ 20 వరకు దేశంలో పరిస్థితులను నిశితంగా పరిశీలన చేస్తామని చెప్పారు. కరోనా హాట్‌స్పాట్‌లు కానీ ప్రాంతాలతో షరతులతో కూడిన సడలింపు ఉంటుందన్నారు. కరోనా కేసులు తగ్గితేనే సడలింపు ఉంటుందని స్పష్టం చేశారు. హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి గైడ్‌లైన్స్‌ రేపు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌ను బాధ్యతగా పాటించాలని కోరారు. కరోనాపై పోరాటంలో భారత్‌ ముందుకు వెళ్తుందన్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు.

మంగళవారం మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేటితో తొలిదశ లాక్‌డౌన్‌ గడువు పూర్తయింది. ప్రజలు సైనికుల్లా వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. దేశ ప్రజల త్యాగం వల్లే భారత్‌లో కరోనా నియంత్రణలో ఉంది. ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ దేశాన్ని కాపాడుతున్నారు. కొందరికి ఆకలి కష్టాలు ఉండొచ్చు, కొందరికి ప్రయాణాల కష్టాలు ఉండొచ్చు.. కానీ దేశం కోసం అన్ని సహిస్తున్నారు. మీకు దేశం వందనం చేస్తుంది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. కరోనాపై పోరులో మన రాజ్యాంగంలోని ప్రబలమైన సామూహిక శక్తిని ప్రదర్శించడం ద్వారా ఆయనకు నిజమైన నివాళి అర్పించాం. వాస్తవానికి దేశంలో ఇప్పుడు పండుగలు ఎక్కువగా జరుగుతాయి. అనేక రాష్ట్రాలల్లో పండగలతో కొత్త ఏడాది ప్రారంభమైంది. పండగలు ఉన్నా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ తమను తాము నియంత్రించుకుంటున్నారు. మీరు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేడు దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఓ పోరాటం జరుగుతుంది. చాలా దేశాల కంటే ముందే భారత్‌లో ఏయిర్‌పోర్ట్‌లలో విదేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్‌ చేయడం ప్రారంభించాం.దేశంలో ఒక్క కేసు నమోదు కాక ముందే కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం.

దేశంలో 500కేసులు ఉన్నప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకంటించాం. వేగంగా నిర్ణయాలు తీసుకుని ఈ మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నం చేశాం. ఏదేశంతోనూ పోల్చడానికి వీలులేని విపరీతమైన పరిస్థితి ఉన్నప్పటికీ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలతో పోలిస్తే... మన దేశ పరిస్థితి బాగుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి విషయంలో ఒకప్పుడు మనదేశంతో సమానంగా ఉన్న దేశాల్లో... ఇప్పుడు కరోనా కేసులు మనకంటే 25రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మనం కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే.. ఈరోజు భారత్‌ పరిస్థితి దారుణంగా ఉండేది. భౌతిక దూరం, లాక్‌డౌన్‌ మంచి ఫలితాలు ఇచ్చాయి. ప్రభుత్వాలనుంచి, ప్రజల నుంచి కూడా లాక్‌ డౌన్‌ పొడిగించాలనే సలహాలు వచ్చాయి. ఈ మేరకు లాక్‌డౌన్ మే 3వరకు పొడిగిస్తున్నాం. మీ అందరిని ఒక్కటే అడుగుతున్నా... మీరందరూ దీనిని బాధ్యతగా పాటించాలి. కరోనాను కొత్త ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క కొత్త కేసు వ్యాపించిన ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. కరోనాతో ఒక్కరు చనిపోయినా అది ప్రమాదకరం. ప్రజలు మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను పాటించాలి. అలా చేయకపోతే.. కరోనా మనకు మరింత నష్టం చేస్తుంది.

వచ్చే వారంలో కరోనాపై పోరాటం కోసం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. ఏప్రిల్ 20 వరకు దేశంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ల సంఖ్య తగ్గితే ఏప్రిల్ 20 తరువాత కొన్ని చోట్ల మినహాయింపు ఇస్తాం. ఒకవేళ కరోనా కేసులు పెరిగితే అన్ని మినహాయింపులు తీసేస్తాం. కాబట్టి మనమందరం కరోనా కట్టడికి జాగ్రత్తతో ఉండాలి. పేద ప్రజల కోసమే ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని చోట్ల సడలింపులు చేస్తాం. లాక్‌డౌన్‌ వల్ల వ్యవసాయ రంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. దేశంలో కరోనా కోసం ప్రత్యేకంగా లక్ష బెడ్‌లు ఏర్పాటు చేశాం. కరోనా కోసం 600 ప్రత్యేక హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేశాం. మీ ఇళ్లలో ఉన్న వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడే వారుంటే ...వారి పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోండి. మీ రోగ నిరోధక శక్తి పెంచుకోడానికి... ఆయుష్‌ సంస్థ ఇచ్చే నిబంధనలు పాటించండి. ఆరోగ్య సేతు మోబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోండి... ఇతరులతో కూడా డౌన్‌లోడ్ చేయించండి. పేద ప్రజలకు ఆహారం అందేలా చూడండి. మీ దగ్గర పనిచేసే వారిపై ప్రేమ చూపండి... ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించకండి. పోలీసులు, నర్సులు, పారిశుద్య కార్మికులను గౌరవించండి. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

15/04/2020

*టుడే న్యూస్ అప్డేట్స్...*

*ఆంధ్రప్రదేశ్‌...*

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది.

రెండో విడతలో ఉచితంగా 5 కేజీల బియ్యం, కేజీ శనగలు.

14వేల రేషన్ షాపులకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు.

కూపన్లపై ఉన్న తేదీల్లో మాత్రమే రేషన్‌కు రావాలని సూచన.

ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 483కి చేరింది.

ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 9 మంది మృతి చెందారు.

ఏపీలో కరోనా నుంచి కోలుకుని 16 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 458 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

*తెలంగాణ...*

తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 644కి చేరింది.

తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 18 మంది మృతి చెందారు.

తెలంగాణలో మొత్తం 110 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ప్రస్తుతం తెలంగాణలో 516 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

*జాతీయం...*

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.

లాక్‌డౌన్‌ మే 3 వరకు పొడిగింపు.

ఏప్రిల్‌ 20 వరకు కఠినమైన లాక్‌డౌన్‌.

ఏప్రిల్ 20 తర్వాత షరతులతో సడలింపు.

సడలింపుపై నేడు కొత్త నిబంధనలు.

దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,363కు చేరింది.

ఇప్పటివరకు దేశంలో కరోనాతో 339 మంది మృతి చెందారు.

ఇప్పటి వరకు కరోనా నుంచి 1036 మంది కోలుకున్నారు.

*అంతర్జాతీయం..*

ప్రపంచవ్యాప్తంగా 19.97 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.26లక్షల మంది మృతి చెందారు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 4.78 లక్షల మంది కోలుకున్నారు...

లాక్ డౌన్ సందర్భంగా ఖమ్మం :నేలకొండపల్లి - మండలం  పైనంపల్లి గ్రామం  ఆంధ్రా సరిహద్దు లను  మరియు   నేలకొండపల్లి సెంటర్లో  ప...
14/04/2020

లాక్ డౌన్ సందర్భంగా ఖమ్మం :నేలకొండపల్లి - మండలం పైనంపల్లి గ్రామం ఆంధ్రా సరిహద్దు లను మరియు నేలకొండపల్లి సెంటర్లో పరిశీలించిన
*ఏసిపి సోమా వెంకటరెడ్డి,*
కూసుమంచి *సిఐ మురళి,* ఖమ్మం రూరల్
*సీఐ సత్యనారాయణ రెడ్డి*
నేలకొండపల్లి
*ఎస్సై గౌతమ్.* మరియు నేలకొండపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లాక్డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు.
Pic:Anjani (AnjaniStudio'S(Nelakondapalli)

ఖంమ్మం జిల్లా..... నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పెద్దపాక జనార్దన్ (40)పిడుగపడి మృతి.
30/05/2019

ఖంమ్మం జిల్లా..... నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో పెద్దపాక జనార్దన్ (40)పిడుగపడి మృతి.

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు ✌️✌️ అనే నినాదంతో, ప్రజల్లోకి ఒక వెలుగు వెలిగిన రామన్న ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు...
28/05/2019

సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్ళు ✌️✌️ అనే నినాదంతో, ప్రజల్లోకి ఒక వెలుగు వెలిగిన రామన్న ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,గొప్ప నటుడు ,కాంగ్రెసేతర పాలనకు శ్రీకారం చుట్టి,మహిళ అభివృద్ధికి తోర్పాటు చేసి,తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన తెలుగు వాడు మన స్వర్గీయ అన్న గారి 96 వ జయంతి సందర్భంగా...💐💐💐

27/05/2019

బ్రేకింగ్ న్యూస్...
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో TRS పార్టీ తరపున MLA అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పోటీ

ఉత్తమ్ పద్మావతి (కాంగ్రెస్) v/s కవిత (తెరాస) ఢీ అంటే ఢీ

Address

Nelakondapally
Khammam
507160

Website

Alerts

Be the first to know and let us send you an email when Nelakondapally khammam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share