Aam Aadmi Party Telangana

Aam Aadmi Party Telangana Address: #1-2-1/6, 1st Floor, Opp. AAM AADMI PARTY TELANGANA STATE OFFICE
#1-2-1/6, 1st Floor, Opp.

GHMC Office, Liberty Circle, Basheerbagh, Hyderabad
Email: [email protected]
Phone: 9492278787
Instagram: aaptelangana
Twitter: AAPTELANGANA
WhatsApp: https://chat.whatsapp.com/H7DEsGI3TJq7fYHoSO2waZ GHMC Office
Near Liberty Circle, Basheerbagh
Hyderabad, Telangana – 500029
Email: [email protected]
Phone No.: 9492278787
WhatsApp: https://chat.whatsapp.com/LBAVkLsdSTGHWe9FI5PatZ

04/09/2026

దండుపాలెం బ్యాచ్ రేవంత్ రెడ్డి. 1,000 రోజుల సంబరాలు ఎందుకు? ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మిస్ Hemaa Sudarshan Jilloju గారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తయిందని సంబరాలు చేసుకోవడం కంటే, 420 హామీలు, 6 గ్యారెంటీల అమలుపై ప్రజలకు లెక్క చెప్పాలని ఆప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు గారు డిమాండ్ చేస్తోంది. ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రాజెక్టు, హైడ్రా, భూసేకరణ, బుల్లెట్ ట్రైన్, రీజినల్ రింగ్ రోడ్ వంటి భారీ ప్రాజెక్టుల పేరుతో భూములు, ప్రజల ఆస్తుల విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వివరాలు వెల్లడించాలి. ప్రజలకు ఉద్యోగాలు, రైతు భరోసా, మహిళలకు హామీలు, విద్య, వైద్యం, ఇళ్ల విషయంలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి. మరోవైపు మూసీ ప్రాజెక్టులో భూముల సేకరణపై న్యాయపరమైన వివాదాలు కూడా కొనసాగుతున్నాయి. 1,000 రోజుల సంబరాలు ప్రజల కోసం చేసిన పాలనకు గుర్తుగా ఉండాలే తప్ప, అధికార ప్రచారానికి వేదిక కాకూడదు.
ప్రతి హామీకి అమలు స్థితి
ప్రతి భూసేకరణకు పూర్తి వివరాలు
ప్రతి భారీ ప్రాజెక్టుకు ఖర్చు–ప్రయోజనాల లెక్కలు
ప్రజల ఆస్తులకు పూర్తి రక్షణ
ప్రభుత్వం వెంటనే “1,000 రోజుల పాలనపై ప్రజా శ్వేతపత్రం” విడుదల చేయాలని ఆప్ తెలంగాణ అధ్యక్షురాలు మిస్ హేమా గారు డిమాండ్ చేస్తోంది.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి శ్రీమతి లక్ష్మి రామంచలే గారు కూడా రాఖీ పూర్ణిమ జరుపుకున్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ...
01/09/2026

ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి శ్రీమతి లక్ష్మి రామంచలే గారు కూడా రాఖీ పూర్ణిమ జరుపుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి శ్రీమతి లక్ష్మి రామంచలే గారు రక్షాబంధన్ వేడుకల కోసం ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు ప్రయాణించి నాయకులు & వాలంటీర్లకు రాఖీ కట్టారు.

31/08/2026

హైదరాబాద్ ధర్నా చౌక్‌లో తెలంగాణ భూ రక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ Hemaa Sudarshan Jilloju గారు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆప్ తెలంగాణ కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు గారు మాట్లాడుతూ, భూములకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, భూ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆప్ రైతుల తరఫున పోరాటం చేస్తుందని తెలిపారు. ధర్నా చౌక్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు నిర్వహించే హక్కు ఉందని గతంలోనూ అధికారికంగా స్పష్టం చేయబడింది.

26/08/2026

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలి. రోడ్ల దుస్థితిపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమాధానం చెప్పాలి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ Hemaa Sudarshan Jilloju గారు.
ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి చెందడం, పలువురు గాయపడటం అత్యంత విషాదకరమని ఆప్ తెలంగాణ కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం కేవలం సానుభూతి ప్రకటనలు చేయడం కాకుండా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడంలో తన బాధ్యతను నిరూపించుకోవాలి అని ఆప్ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా గారు డిమాండ్ చేశారు. రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాల అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలను అరికట్టడంలో రవాణా శాఖ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తోందో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. అనుభవం లేని లేదా సరైన శిక్షణ లేని డ్రైవర్లను నియమించడం, అతివేగంగా వాహనాలు నడపడం, డ్రైవర్ల పని గంటలను నియంత్రించకపోవడం వంటి అంశాలపై కఠినమైన పర్యవేక్షణ ఉండాలి. ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో రవాణా శాఖ విఫలమైతే, ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలి అని ఆమె డిమాండ్ చేస్తోంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేస్తున్నారు?ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రోడ్లు దెబ్బతిన్న చోట మరమ్మతులు చేయకుండా, అవసరమైన చోట కొత్త రహదారులు నిర్మించకుండా R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏం చేస్తున్నారు? అని మిస్ హేమా గారు ప్రశ్నించారు. ప్రజలు ప్రతిరోజూ ప్రమాదకరమైన రహదారులపై ప్రయాణిస్తుంటే, కేవలం కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం సరిపోదని, ప్రస్తుతం ప్రజలు ఉపయోగిస్తున్న రహదారుల నాణ్యత, నిర్వహణ, భద్రతపై మంత్రి ప్రత్యక్షంగా బాధ్యత వహించాలి అని అన్నారు. ప్రభుత్వం రోడ్ల ఆధునీకరణకు భారీ నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని ఆమె అన్నారు. ఆప్ డిమాండ్లు:
సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం, వాహనం ఫిట్‌నెస్ తదితర అంశాలను పూర్తిగా విచారించాలి.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి.
అనుభవం, సరైన శిక్షణ కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి.
డ్రైవర్లకు రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు, డ్రైవింగ్ సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి.
అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి.
గాయపడిన వారందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి.
అత్యవసరంగా అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారులు నిర్మించి, రహదారి భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలి.
రోడ్ల నాణ్యత, నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.
ప్రజల ప్రాణాలకు విలువ లేని పాలన మాకు అవసరం లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాదు—ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ బాధ్యత. ప్రజల ప్రాణాలను రక్షించడంలో రవాణా శాఖ విఫలమైందని భావిస్తున్నందున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని, అలాగే రహదారుల నిర్వహణ, మరమ్మతులు మరియు భద్రతపై R&B మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

21/08/2026

తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడాలి. ప్రత్యేక పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ Hemaa Sudarshan Jilloju రు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, బెంచీలు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మధ్యాహ్న భోజనం, ఆట స్థలాలు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, సురక్షితమైన భవనాలు వంటి కనీస సౌకర్యాలు కూడా అనేక చోట్ల లేకపోవడం ఆందోళనకరమని ఆప్ తెలంగాణ కన్వీనర్ మిస్ హేమా సుదర్శన్ జిల్లోజు గారు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, విద్యార్థుల డ్రాపౌట్‌పై ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేయాలని ఆప్ రాష్ట్ర కన్వీనర్ మిస్ హేమా గారు డిమాండ్ చేశారు. ఇటీవల నల్గొండలో 10వ తరగతి విద్యార్థులు ప్రిన్సిపాల్ హత్య కేసులో నిందితులుగా ఉండటం విద్యార్థుల కౌన్సెలింగ్, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, డ్రగ్స్/గంజాయి నియంత్రణ, పాఠశాల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని మిస్ హేమా గారు పేర్కొన్నారు. ఆప్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక సర్వే నిర్వహించనుంది అని ఆమె తెలిపారు. మౌలిక వసతులు, ఉపాధ్యాయుల ఖాళీలు, విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజనం, భద్రత, డ్రగ్స్ నియంత్రణ, పాఠశాల భవనాల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తామని ఆమె తెలిపారు. సర్వే అనంతరం విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణ విద్యా వ్యవస్థపై సమగ్ర చర్చ చేపడతామని ఆమె వెల్లడించారు. ఆప్ ప్రధాన డిమాండ్లు:
1. ప్రత్యేక పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి.
2. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి.
3. ప్రతి పాఠశాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలి.
4. మధ్యాహ్న భోజనం నాణ్యతను మెరుగుపరచాలి.
5. విద్యార్థులకు కౌన్సెలింగ్, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
6. పాఠశాలల భద్రత, భవనాల పరిస్థితిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి.
7. మూసివేతకు గురవుతున్న ప్రభుత్వ పాఠశాలలను రక్షించి బలోపేతం చేయాలి.
8. జీవో 97 వెంటనే రద్దు చేయాలి. పాలిటెక్నికల్ విద్యార్థులకు ఆప్ మద్దతుగా ఉంటుంది.
తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుంది. ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర భవిష్యత్తును నిర్లక్ష్యం చేసినట్టే. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆప్ ప్రజా ఉద్యమాన్ని చేపట్టి, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తుంది” అని ఆమె హెచ్చరించారు.

 అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలుఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులై...
16/08/2026


అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులైన శ్రీ Arvind Kejriwal గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

 అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలుఐఐటి పట్టభద్రుడై, ఆదాయపు పన్ను శాఖలో సహాయ కమిషనర్‌గా పనిచేశారు, కానీ సంప్...
16/08/2026


అరవింద్ కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు
ఐఐటి పట్టభద్రుడై, ఆదాయపు పన్ను శాఖలో సహాయ కమిషనర్‌గా పనిచేశారు, కానీ సంప్రదాయ వృత్తికి దూరంగా ఉండాలని ఎంచుకున్నారు. ఆయన రాజకీయాలు విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రజా సంక్షేమాన్ని పరిపాలనకు కేంద్రంగా నిలుపుతాయి. ఆయన దార్శనికతను ఒక శక్తివంతమైన ఆలోచనలో సంగ్రహించవచ్చు: "భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు అత్యుత్తమ నాణ్యమైన విద్య అందాలి." ఎందుకంటే ప్రతి బిడ్డకు ప్రపంచ స్థాయి విద్య అందినప్పుడు, మనం కేవలం వ్యక్తిగత జీవితాలను మాత్రమే మార్చము. మనం మరింత బలమైన భారతదేశానికి పునాది వేస్తాము. జన్మదిన శుభాకాంక్షలు, శ్రీ Arvind Kejriwal గారూ - భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ప్రతీక.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జెండా ఎగురవేత:ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ   Dr SKR ANsariగారిచే ...
15/08/2026

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల జెండా ఎగురవేత:
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ Dr SKR ANsariగారిచే నల్గొండ జిల్లా
ఆప్ తెలంగాణ జాయింట్ సెక్రటరీ శ్రీ Syed Hyder గారిచే నిర్మల్
జిల్లా కన్వీనర్ అడ్వ. ఇందారపు రాజమల్లయ్య గారిచే సూర్యాపేట
కన్వీనర్ శ్రీమతి ఉమా రాణి గారిచే సంగారెడ్డి
ఇన్‌ఛార్జ్ శ్రీమతి లక్ష్మి రామంచలే గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి మరియు ఆప్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అయిన న్యాయవాది శ్రీ Priyanka Kakkar ...
15/08/2026

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి మరియు ఆప్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అయిన న్యాయవాది శ్రీ Priyanka Kakkar గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేక్ కటింగ్ వేడుకలు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్  గా...
15/08/2026

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ మిస్ గారి ప్రసంగం!

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కుమారి Hemaa Sudarshan Jilloju గారు హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Address

Kodada

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Aam Aadmi Party Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Aam Aadmi Party Telangana:

Shortcuts

Share