Mukka Sai Vikas Reddy

Directions

Mukka Sai Vikas Reddy State Leader, Telugu Desam Party

25/10/2026

దశాబ్దాల రోడ్డు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిన ముక్కా రూపానంద రెడ్డి గారు, అరవ శ్రీధర్ గారు

రైల్వే కోడూరు పట్టణంలోని కామిశెట్టినగర్‌లో ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న రోడ్ల సమస్యకు రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, లూడా (KUDA) చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి ప్రత్యేక చొరవతో, ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారి సహకారంతో రూ.75 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించారు.

ఏళ్ల నాటి రోడ్ల సమస్యలు తొలగిపోవడంతో.. నేడు మెరుగైన రహదారులతో స్థానిక ప్రజలకు ఎంతో ఊరట లభించింది. ప్రజల ఇబ్బందులను గుర్తించి, సమస్య పరిష్కారానికి చొరవ చూపిన నాయకులకు స్థానిక ప్రజలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

25/10/2026

కేవలం రూ.5కే కడుపునిండా నాణ్యమైన భోజనం.. పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్! l

“కోడూరు పట్టణానికి రోజువారీ పనుల కోసం, కూలి చేసుకునేందుకు వచ్చే మాలాంటి వారికి అన్న క్యాంటీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే వారికి కూడా కేవలం రూ.5కే కడుపునిండా భోజనం లభించడం ఎంతో ఊరటనిస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూపానంద రెడ్డి గారి చొరవతో కోడూరు పట్టణంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పేదల ఆకలి తీర్చుతూ, సామాన్యులకు అండగా నిలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ముక్కా రూపానంద రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.”

25/10/2026

లక్ష్మీనగర్‌లో మారిన రూపురేఖలు.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు!

కోడూరు పట్టణంలోని లక్ష్మీనగర్ (తులసి స్కూల్) ప్రాంతంలో ఒకప్పుడు రోడ్లు లేక, వర్షం పడితే మురుగునీరు, దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముక్కా రూపానంద రెడ్డి గారు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి చొరవతో నేడు ఈ ప్రాంతంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాయి.

ప్రజల సమస్యలను పరిష్కరించి, ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

25/10/2026

కొత్త కోడూరు ప్రజల చిరకాల స్వప్నం సాకారం.. రోడ్డు సౌకర్యంతో తీరిన ఏళ్ల నాటి కష్టాలు!

“మాది కొత్త కోడూరు ప్రాంతం. ఎన్నో ఏళ్లుగా సరైన రోడ్లు లేక గుంతలమయమైన మార్గాలతో తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. వర్షం వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రావడం కూడా కష్టంగా ఉండేది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఇంచార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీ అరవ శ్రీధర్ గారి చొరవతో మా ప్రాంతానికి రోడ్డు సౌకర్యం కల్పించారు. మా ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించిన నాయకులకు గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు!”

ఓబులవారిపల్లి–1 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారురైల్వే కోడూరు టీడీపీ...
21/10/2026

ఓబులవారిపల్లి–1 ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు

రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారి తనయుడు, యువనేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు ఓబులవారిపల్లి–1 ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం లో శ్రీమతి ముక్కా వరలక్ష్మి గారు మరియు తనయుడు ముక్కా సాయి విశాల్ రెడ్డి గారు, ఓబులవారిపల్లె మండల ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

జై ఎన్డీఏ కూటమి

విజయం స్ఫూర్తినిస్తూ, అభివృద్ధికి నాంది పలికే పర్వదినం విజయదశమి.ఈ విజయదశమి మనందరిలో నూతన ఉత్సాహాన్ని నింపాలని, ప్రజల ఆకా...
20/10/2026

విజయం స్ఫూర్తినిస్తూ, అభివృద్ధికి నాంది పలికే పర్వదినం విజయదశమి.

ఈ విజయదశమి మనందరిలో నూతన ఉత్సాహాన్ని నింపాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరికీ మెరుగైన భవిష్యత్తు అందాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు.

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముక్కా శిరీష గారు రైల్వే కోడూరు మండలం కే బుడుగుంట పల్లి  గ్రామ ...
18/10/2026

శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముక్కా శిరీష గారు

రైల్వే కోడూరు మండలం కే బుడుగుంట పల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శుభ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన *యువనేత ముక్కాసాయి వికాస్ రెడ్డి గారి సతీమణి ముక్కా శిరీష గారు,* ఈ సందర్భంగా స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు, అనంతరం ఆలయ కమిటీ వారు గ్రామ ప్రజలు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

17/10/2026

మాట ఇచ్చిన వారంలోనే.. రోడ్డు పనులకు శ్రీకారం! ప్రజల కష్టాన్ని తన బాధ్యతగా భావించిన నాయకుడు ముక్కా రూపానంద రెడ్డి గారు!

📍నారాయణ నెల్లూరు గ్రామం, పెనగలూరు మండలం

“దశాబ్దాలుగా మా గ్రామానికి రోడ్డు లేదు.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం” అంటూ నారాయణ నెల్లూరు గ్రామానికి చెందిన అవ్వ తన సమస్యను వివరించగానే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి గారు.. బిల్లు వచ్చినా, రాకపోయినా నా సొంత నిధులతో రోడ్డు వేయిస్తా అని హామీ ఇచ్చారు.

అన్న మాట ప్రకారం వారం తిరగకముందే రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

ప్రజల సమస్యే తన సమస్యగా.. ఇచ్చిన మాటే తన బాధ్యతగా భావించే నాయకత్వానికి నిదర్శనం ముక్కా రూపానంద రెడ్డి గారు!

రైల్వే కోడూరు మండలం అమ్మవారిశాలలో కొలువై ఉన్న శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌...
16/10/2026

రైల్వే కోడూరు మండలం అమ్మవారిశాలలో కొలువై ఉన్న శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, KUDA చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకులు శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Address

Kadapa
Kodur
516101

Website

Alerts

Be the first to know and let us send you an email when Mukka Sai Vikas Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category