Bhadradri Kothagudem District Police

Bhadradri Kothagudem District Police For any crime related complaints, you may visit concerned PS

భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్.ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై...
29/08/2026

భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్.
ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు.

28/08/2026
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం శుభాష్‌నగర్ కాలనీలో పోలీసులు కార్డాన్ & సెర్చ్ నిర్వహించారు.మాదకద్...
26/08/2026

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం శుభాష్‌నగర్ కాలనీలో పోలీసులు కార్డాన్ & సెర్చ్ నిర్వహించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిరంతరం కృషి : డీఎస్పీ అరుణ్ కుమార్.

జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, పండుగ నిర్వాహకులతో...
25/08/2026

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు మిలాద్-ఉన్-నబీ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, పండుగ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. పండుగ కార్యక్రమాలు, ఊరేగింపు ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించి, శాంతియుత వాతావరణంలో పండుగను నిర్వహించేలా భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కొరకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత సెమీ రెసిడెన్షియల్...
25/08/2026

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు ఉద్యోగాల కొరకు ప్రయత్నించే అభ్యర్థులకు ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్, 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ యువత సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్*

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలోని సివిల్, ఏఆర్, టీజీఎస్పీ విభాగాలతో పాటు ఎస్పీఎఫ్ (SPF), జైళ్ల శాఖ (Prisons) మరియు ఫైర్ (Fire) విభాగాల్లో సుమారు 7,437 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల సాధనలో తోడ్పడేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉచిత సెమీ రెసిడెన్షియల్ కోచింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వెల్లడించారు.

జిల్లాలోని పేద, గ్రామీణ, గిరిజన మరియు మారుమూల ప్రాంతాలకు చెందిన యువతి, యువకులకు నాణ్యమైన శిక్షణ అందించి పోలీసు ఉద్యోగాలకు సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కోచింగ్‌లో భాగంగా అనుభవజ్ఞులైన అధ్యాపకులచే రాత పరీక్షలకు సంబంధించిన శిక్షణతో పాటు, పోలీసు అధికారుల పర్యవేక్షణలో ఫిజికల్ ట్రైనింగ్ ఉచితంగా అందించబడుతుందని తెలిపారు. అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించబడుతుందని చెప్పారు.

పోలీసు శాఖలో చేరాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు 26-08-2026 నుండి 31-08-2026 వరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వబడిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి, విద్యార్హతలకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను జతచేసి సమర్పించాలని సూచించారు.
మహిళా అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.
కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, అర్హులైన మరియు ప్రతిభావంతులైన అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు 06-09-2026 (ఆదివారం) నాడు కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, భద్రాచలం మరియు మణుగూరు పట్టణాలలో ప్రత్యేక స్క్రీనింగ్ టెస్ట్ (అర్హత పరీక్ష) నిర్వహించబడుతుందని తెలిపారు.
స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు కోచింగ్ ప్రారంభ తేదీ, శిక్షణా కేంద్రం మరియు ఇతర పూర్తి వివరాలను అధికారికంగా మీడియా ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. సమాచారం కొరకు ఎస్బి ll ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మొబైల్ నెంబర్ 8712682013 సంప్రదించవలసినదిగా తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పోలీసు ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకున్న యువతి, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రమశిక్షణతో కృషి చేసి తెలంగాణ పోలీసు శాఖలో ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. జిల్లా పోలీసు శాఖ అందిస్తున్న ఈ ఉచిత కోచింగ్‌ను ప్రతి అభ్యర్థి వినియోగించుకోవాలని కోరుతున్నాను” అని ఆకాంక్షించారు.

హేమచంద్రపురం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి యోగా తరగతులు నిర...
25/08/2026

హేమచంద్రపురం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి యోగా తరగతులు నిర్వహించారు.
పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందని, విధుల్లో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం అవసరమని డిఎస్పి తెలిపారు.

బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.UI, గ్రేవ్, ప్రాపర్టీ కేసుల దర్యాప్తును వేగవంతం...
24/08/2026

బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

UI, గ్రేవ్, ప్రాపర్టీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు సూచనలు.

బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్న...
24/08/2026

బూర్గంపహాడ్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు అరెస్ట్.
నిందితుల నుంచి చిరుతపులి చర్మం–01, గోర్లు–17 స్వాధీనం

జిల్లా పర్యటనకు విచ్చేసిన నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (NCST) గౌరవ సభ్యులు జాతోత్‌ హుస్సేన్‌ గారికి సింగరే...
24/08/2026

జిల్లా పర్యటనకు విచ్చేసిన నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (NCST) గౌరవ సభ్యులు జాతోత్‌ హుస్సేన్‌ గారికి సింగరేణి గెస్ట్‌ హౌస్‌లో జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు ఐపీఎస్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ పూల మొక్కను అందించి సాదరంగా ఆహ్వానించారు.

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీ...
21/08/2026

అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ.

Address

Kothagudem

Telephone

+918744242097

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhadradri Kothagudem District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhadradri Kothagudem District Police:

Shortcuts

Share