CPM Bhadradri Kothagudem

CPM Bhadradri Kothagudem communist party of india marxisit kothagudem. peda prajala sankshekam kosam vudyamalu poratalu chey

*మనువాద గులాంగిరీ పై పోరాడిన మహాత్ముడు*                                                                                 ...
11/04/2023

*మనువాద గులాంగిరీ పై పోరాడిన మహాత్ముడు*
*-- ఆర్. రాజేశమ్.*

భారతదేశంలో బ్రిటిష్ వాడి ఆధిపత్యం రెండువందల యేళ్ల పాటు సాగింది. ఈ విశాల భారత దేశంలోని భూమిపుత్రులను బానిసలుగా మార్చి నిరంకుశ వలస పాలనను వారు కొనసాగించారు. ఈ దేశపు ప్రజలను పీడిస్తున్న మరో తరహా బానిసత్వం కుల వ్యవస్థ పేరుతో మొదలయింది. రెండువేల యేళ్ల క్రితం ప్రారంభమై నేటికీ అది కొనసాగుతున్నది. బ్రిటిష్ వాడు రుద్దిన బానిసత్వాన్ని రద్దు చేయడానికి షహీద్ భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ.. అమరులెందరో ఉద్యమిస్తే.. మనువాద గులాంగిరీని రద్దు చేయడానికి ఆధునిక భారత చరిత్రలో తొట్టతొలిగా ఉద్యమించిన మహనీయుడు జ్యోతిబా ఫూలే. ఆ స్వాతంత్ర్య ఉద్యమనేత గాంధీ మహాత్ముడైతే.. ఈ స్వాతంత్ర్య ఉద్యమ నేత ఫూలే సైతం నిస్సందేహంగా మహాత్ముడే!

జ్యోతిరావు గోవిందరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించాడు. నాటి పీష్వా రాజుల దగ్గర జ్యోతిరావు కుటుంబం పూలమాలలు కట్టి అమ్మే వృత్తిని కొనసాగించిన కారణంగా ఫూలే అనే పేరు వచ్చింది. వెనుకబడిన 'మాలి' కులానికి చెందిన ఆయన కుల కట్టుబాట్ల కారణంగా చిన్ననాటి నుంచే అవమానాలను ఎదుర్కొన్నాడు. యుక్త వయస్సులో ఒక బ్రాహ్మణ మిత్రుని పెళ్లికి హాజరైన జ్యోతిరావును పెళ్లికొడుకు బంధువులు కులం పేరుతో అవమానించి పెళ్లి ఊరేగింపు నుంచి గెంటివేశారు. ఆ అవమానంతో రగిలిపోయిన ఫూలే కులాధిపత్యాన్ని నిర్మూలించడానికి అవిశ్రాంత పోరాటం కొనసాగించాలని ప్రతినబూనాడు. శూద్రులు, అతిశూద్రులపై అగ్రవర్ణాల వారు కొనసాగిస్తున్న దురాగతాలను నిరోధించడానికి ఫూలే 1873 సెప్టెంబరు 24న 'సత్య శోధక్ సమాజ్' ను స్థాపించాడు. మెజారిటీగా ఉన్న నిమ్న వర్గాల ప్రజలను కుల దోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను తమ హక్కుల కోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడు.

ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని కృత్రిమ కుల వ్యవస్థను సృష్టించి, దేశంలోని మెజారిటీ వర్గాలను ఆర్థికంగా సామాజికంగా అణచివేసిన స్వార్థపర వర్గాల దోపిడీని జీవితాంతం వ్యతిరేకించి పోరాడిన మహానుభావుడు ఫూలే. ఆయన నడిపిన పోరాటాల స్ఫూర్తిని నేటి తరానికి అందించే ఒక మహత్తర సాధనంగా ఆయన రచన "గులాంగిరీ" నేటికీ నిలిచి ఉన్నది. ఈ దేశపు వెనుకబాటుతనానికి ప్రధాన కారణమైన కుల వ్యవస్థ నికృష్ట స్వభావం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం "గులాంగిరీ". కాలాన్ని ఎదిరించి ఘనీభవించిన ఫూలే మూర్తి.. ఆయన రాసిన గులాంగిరీ పుస్తకంలో మనకు ప్రత్యక్షమౌతుంది. నేటి కాలంలో మనం చేపట్టాల్సిన సామాజిక న్యాయ పోరాటాలను ఎలా కొనసాగించాలో, దగ్గర కూచోబెట్టుకుని మనకు నేర్పుతుంది.

సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యే భాషలో.. ఉద్యమ సహచరుడు దోండిబా మరియు ఫూలేల మధ్యన సంభాషణల రూపంలో గులాంగిరీ పుస్తకం కొనసాగుతుంది. ఈ దోండిబా ఎవరో కాదు.. ఫూలే ను హత్య చేయించడానికి పూణే బ్రాహ్మణులు సుపారి ఇచ్చి కుదుర్చుచున్న కిరాయి హంతకుడు! ఓ అర్థరాత్రి వేళ దోండిబా ఫూలేను చంపడానికి ఆయన ఇంట్లో దూరాడు. అలికిడికి నిద్ర లేచిన ఫూలే దోండిబాను నిలదీసాడు. నిన్ను చంపడానికి బ్రాహ్మణులు డబ్బులు ఇచ్చారని దోండిబా తెలుపగా.. నా చావుతో నీ ఆకలి తీరుతుందనుకుంటే.. అలానే కానియ్యి అని ఫూలే సమాధానమిచ్చాడు. "మీ నిమ్నవర్గాల పిల్లలకు మేము చదువులు చెప్పడమే.. బ్రాహ్మణుల కోపానికి కారణమయిందని తెలుసుకో.." అని ఫూలే తెలపడంతో దోండిబా తన తప్పును గ్రహించి.. హత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. క్రమక్రమంగా ఫూలే ఉద్యమ సహచరుడయ్యాడు.
బ్రాహ్మణుల ఆధిపత్యానికి దారులు వేసిన పురాణాల బండారాన్ని ఫూలే తన గులాంగిరీ పుస్తకంలో అందరికీ అర్ధమయ్యే రీతిలో విశదీకరిస్తాడు. బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుండి జన్మించారనే కథనం పై వ్యాఖ్యానిస్తూ.. మగ వ్యక్తి ముఖం నుండి వారు పుట్టడమే నిజమైతే.. ఎవరి స్తన్యం తాగి పెరిగినట్టు? అని ఫూలే ప్రశ్నిస్తాడు. ఫూలే ప్రయోగించిన తార్కిక వాదనలతో బ్రాహ్మణులు సృష్టించిన కృత్రిమ కథనాలు దూది పింజల్లా తేలిపోతాయి.

దురదృష్టవశాత్తూ ఆ మహాత్ముడికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం నేటికీ దక్కడం లేదు. తెలంగాణాకు ఫూలేకు సంబంధమేమిటి.. తెలంగాణలోని బీసీ గురుకులాల పేరులో నుంచి మహాత్మ జ్యోతిరావు ఫూలే పేరును తొలగించాలని.. ఆ మధ్య ఒక బీసీ నేత డిమాండు చేసారు. ఇక అగ్రవర్ణాల వారైతే.. ఫూలేను చులకన చేస్తూ, ఆయనొక బ్రాహ్మణ వ్యతిరేకి అంటూ కొట్టిపారేస్తున్నారు. ఫూలే జీవితం గురించి తెలిసిన వారెవరైనా.. ఆయన బ్రాహ్మణులనే కాదు, ఏ వర్గం వారినీ ద్వేషించలేదని అర్థం చేసుకుంటారు. ఆ రోజుల్లో.. ఒక బ్రాహ్మణ వితంతువు గర్భవతి కాగా ఆనాటి సమాజం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన వేళ.. ఫూలే దంపతులు ఆమెకు తమ ఇంటిలో ఆశ్రయం కల్పించారు. ఆమెకు కలుగబోయే బిడ్డను తామే పోషిస్తామని భరోసా ఇచ్చి, ఆమెకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తత తీసుకొని తమ బిడ్డగా స్వీకరించి పెంచి పెద్ద చేసారు. ఆ బిడ్డ పేరే యశ్వంతరావు ఫూలే! ఒక శూద్ర మాలి కుటుంబానికి వారసుడయిన ఒక బ్రాహ్మణ బిడ్డ! "నిఖిలలోకమెట్లు నిర్ణయించిన గాని.. తరుగులేని విశ్వనరుడ నేను!" అంటూ మొన్న మొన్న జాషువా కవి అన్న మాటలను.. ఆనాడే తన జీవితాచరణ ద్వారా నిరూపించిన మహాత్ముడు ఫూలే! ఆయన జీవితము, సత్య శోధక సమాజ ఉద్యమము ఆయన రచనలూ.. నేటి కాలంలో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సరైన పరిష్కారాన్ని చూపుతాయి.

(నేడు మహాత్మా ఫూలే 196వ జయంతి)

వ్యాసకర్త కన్వీనర్, సామాజిక న్యాయవేదిక సెల్: 9440443183

Don  ! Ready to shoot!
09/04/2023

Don !
Ready to shoot!

09/04/2023


దేశానికి ప్రమాదకరమ్.... - ప్రభాత్ పట్నాయక్
06/04/2023

దేశానికి ప్రమాదకరమ్....
- ప్రభాత్ పట్నాయక్

*భారత కార్మికోద్యమ ఉపాధ్యాయుడు కామ్రేడ్‌ బి.టి రణదివె* -----------------------------------------------భారత కార్మికోద్యమ ...
06/04/2023

*భారత కార్మికోద్యమ ఉపాధ్యాయుడు కామ్రేడ్‌ బి.టి రణదివె*
-----------------------------------------------
భారత కార్మికోద్యమ నిర్మాతల్లో ఒకరు,భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రజులు కామ్రేడ్‌ బి.టి రణదివె (బాలచంద్ర త్రయంబక రణదివె) 33 వ వర్థంతి (6-4-2023).అసామన్య పోరాట యోధుడైన సీపీఐ(ఎం) అగ్రనేత ఆయన.1904 డిసెంబర్‌ 19న మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించిన బి.టి రణదివె బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.బ్రిటిష్‌ కాలంలోనే బొంబాయిలో కార్మిక సంఘాలు స్థాపించి అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. భారత దేశంలో మొట్టమొదటి అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ (ఎఐటియుసి) జాతీయ నాయకుడిగా,1970లో ఏర్పడిన నాటి నుండి 1991 వరకు సెంటర్‌ ఆఫ్‌ ఇండియన ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
కార్మికుల ప్రయోజనాలే తప్ప సొంత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ నేత బి.టి.ఆర్‌. తన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా కార్మిక పోరాటంలో ఉన్న తీరు కార్మికవర్గానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనం.తన చివరి కాలంలో 85ఏండ్ల వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉండి కూడా పని హక్కు సమస్యపై వ్యాసం రాశారు.1990లో చనిపోవడానికి కొద్ది రోజుల ముందు హాస్పిటల్లో మరణశయ్యపై ఉండి కూడా టైప్‌ రైటర్‌ తెప్పించుకొని తూర్పు యూరప్‌ దేశాల పరిణామాలపై ఒక డాక్యుమెంట్‌ని తయారు చేశారు.ఇది కార్మికోద్యమం పట్ల తన నిబద్ధతకు నిదర్శనం.క్రమశిక్షణ, నిబద్ధతలకు మారుపేరు కామ్రేడ్‌ బి.టి.ఆర్‌.కమిటీల ఆమోదం లేనిదే నిధులు ఖర్చు చేయనిచ్చేవాడు కాదు.తన అవసరాలకు మాత్రమే నిధులు తీసుకునేవాడు అదనంగా ఇచ్చినా తిప్పి పంపించేవాడు. నిరాడంబరంగా ఉండటం ఆయనకు ఉన్న మరో ఉత్తమ లక్షణం. సౌకర్యాలకు అలవాటు పడితే సోమరిగా మారి,విప్లవ బాధ్యతలు నెరవేర్చలేమని ఆయన చెప్పేవారు.సిఐటియు అధ్యక్షునిగా తను పనిచేసిన 20సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే ఆయన విదేశాలకు వెళ్లారు.
బి.టి.ఆర్‌ మహా ధైర్యశాలి.1931లో గాంధీజీ బొంబాయిలో ఒక బహిరంగసభలో ప్రసంగిస్తున్న సమయంలో బిటిఆర్‌ ధైర్యంగా వేదిక ఎక్కి భగత్‌సింగ్‌ ఉరిశిక్ష, మీరట్‌ కుట్ర కేసు విషయంలో గాంధీజీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. ఆటంకాలను సైతం అవకాశాలుగా మార్చుకోగలిగిన నైపుణ్యాలు ఆయనవి. తనను 1940లో అరెస్టు చేసి జైల్లో ఉంచిన సందర్భంగా అక్కడ కూడా ఖైదీల సమస్యలపై పోరాటాలు నిర్వహించారు. రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు.తన జీవితాంతం కార్మికవర్గ ఐక్యత కోసం కృషి చేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నా కార్మికవర్గం ఐక్యంగా ఉండాలని ప్రయత్నించారు. దానికోసం ఎఐటియుసిలోనే ఉండి పని చేశారు.కానీ ఎఐటియుసి ప్రధాన నాయకత్వం ప్రభుత్వానికి మద్దతుగా,కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్మికవర్గానికి ద్రోహం తలపెట్టింది.ఈ నేపథ్యంలో కార్మికవర్గ ప్రయోజనాల కోసం 1970లో సిఐటియు ఆవిర్భవించింది. సిఐటియు జాతీయ అధ్యక్షుడిగా బిటిఆర్‌ అనేక ఐక్య వేదికల ఏర్పాటుకు కృషి చేశారు.1972లో కార్మిక సంఘాల ఐక్య మండలి (యుసిటియు) ఏర్పాటుకు మార్గ దర్శకత్వం వహించారు.ఈ వేదిక బోనస్‌ కోసం,కంపల్సరీ డిపాజిట్‌ స్కీంకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించింది. 1974లో రైల్వే కార్మికులను ఐక్యం చేసి,రైల్వే కార్మికుల పోరాట జాతీయ సమన్వయ కమిటీ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు.1974లో జరిగిన రైల్వే కార్మికుల సమ్మె భారతదేశ కార్మిక ఉద్యమంలో చరిత్ర సృష్టించింది.రైల్వే కార్మికులపై భారత ప్రభుత్వం నిర్బంధానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకం,కార్మిక వర్గం రైల్వే కార్మికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ పోరాటంలో,నిర్బంధ కాలంలో రైల్వే కార్మికులకు పక్షాన ముందుండి పోరాడారు.1979లో మొరార్జీ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక వివాదాల బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులను,ఉద్యోగులను ఐక్యంగా కదిలించి,కార్మిక సంఘాల జాతీయ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.ఈ కమిటీ ఆధ్వర్యంలోనే 1982లో మొట్టమొదటి దేశ వ్యాప్త సమ్మె జరిగింది. కార్మికోద్యమంలో ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఐక్యం చేసి వారికి ఒక వేదికను (సిపిఎస్‌టియు) ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు.కార్మిక వర్గం తన ప్రధాన పోరాటాన్ని వర్గ శత్రువుపై కేంద్రీకరించాలని ఆకాంక్షించారు.అందుకు సంస్కరణవాద సంఘాలను సైతం కలుపుకొని విశాల ఐక్య వేదికగా ట్రేడ్‌ యూనియన్ల సమాఖ్య ఏర్పడాలని కూడా ప్రతిపాదించారు. శత్రువును ఒంటరి చేసేందుకు ఒక పరిశ్రమలో ఒకే సంఘం ఉండాలని సూచించారు బిటిఆర్‌. కార్మిక సంఘాలు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని,అన్ని నిర్ణయాలలో కార్మికులను కూడా భాగస్వామ్యం చేయాలని ఆయన కోరుకున్నారు.దాని కోసం జీవితాంతం కృషి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్వవహరించక పోవడం అనేది దేశంలోని కార్మిక సంఘాలను పీడిస్తున్న జాడ్యం అని,దానిని వదిలించుకోవాలని సిఐటియు వ్యవస్థాపక సమావేశంలోనే ఆయన వివరించారు.కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, రాజకీయ హక్కులు ఉండాలని ఆయన ప్రతిపాదించారు.అవి ఇవ్వకపోవడం వల్ల వారు రెండో తరగతి పౌరులుగా మారి కార్మిక సంఘాలకు దూరమె,ఒంటరి బాట పట్టాల్సి వస్తుందని ఆవేదన చెందారు. నిరుద్యోగ సమస్యపై కార్మికవర్గం పోరాడాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఉపాధి సమస్యపై నిరుద్యోగులను కలుపుకొని కార్మిక వర్గం పోరాడాలని పిలుపునిచ్చారు.శ్రామిక మహిళల సమస్యలపై ప్రత్యేక పోరాటాలు అవసరమని దానికోసం 1979లో చెన్నైలో మొట్టమొదటి శ్రామిక మహిళా సదస్సును నిర్వహించారు.కార్మిక,కర్షక ఐక్యత కోసం బిటిఆర్‌ ఎనలేని కృషి చేశారు. రైతుల గర్భం నుండే కార్మికవర్గం ఆవిర్భవించిందనీ, అటువంటి రైతాంగానికి కార్మిక సంఘాలు రక్షణ ఇవ్వాలనీ కోరుకున్నారు. 1973 కరువు సందర్భంలో రైతులకు,వ్యవసాయ కార్మికులకు ఆర్థికంగా సహాయం చేయడంతో పాటు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు.
వివిధ సందర్భాలలలో భారత కార్మికోద్యమానికి దిశానిర్దేశం చేయడంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించారాయన. దేశంలోని ప్రజలు, కార్మికవర్గం,రైతాంగం అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకోసం నిరంతరం శ్రమించిన ఆదర్శ విప్లవకారుడు కామ్రేడ్‌ బిటీఆర్‌.1990 ఏప్రిల్‌ 6న ఆయన కన్నుమూసే వరకూ అవిశ్రాంత పోరాటమై సాగిన కమ్యూనిస్టు యోధుడు. నేడు బిటిఆర్‌ మన మధ్య లేకపోయినా ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలు ఇంకా అలానే ఉన్నాయి. ఆనాడు ఎన్నో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలు,హక్కులు నేటి పాలకుల విధానాల వల్ల కాలరాయబడు తున్నాయి. ప్రజలపై మరిన్ని భారాలు పెరుగుతున్నాయి.ఒకపక్క కార్పొరేట్ల ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పోగుబడుతుంటే, మరోపక్క ఆకలి,పేదరికం, ఆకలి చావులు,రైతాంగ ఆత్మహత్యలు,నిరుద్యోగం రోజు రోజుకు పెరుగు తున్నాయి.ఈ నేపథ్యంలో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ఐక్య కార్మికోద్యమాన్ని నిర్మించడమే బిటిఆర్‌కి మనం అర్పించే నిజమైన నివాళి.ఆదిశగా కృషిని కొనసాగిద్దాం...
*- బి.మధు*
*సెల్‌:9490098155*

Bjp పాలనపై....  ఢిల్లీలో ఘర్జించిన ఎర్ర సైన్యం.
05/04/2023

Bjp పాలనపై....
ఢిల్లీలో ఘర్జించిన ఎర్ర సైన్యం.

https://youtu.be/7zcuzGaL2Fg
04/04/2023

https://youtu.be/7zcuzGaL2Fg

్మిలను నిలబెట్టి క్లాస్ పీకిన తమ్మినేని|Thammineni Veerabadram VS Sharmila | Press Meet|T10 👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP T...

మోడీ ఇప్పటి వరకు ఎందుకు ప్రెస్మిట్ పెట్టలేదో తెలుసా???ఎవరైనా జర్నలిస్ట్ పుసుక్కున బయట ప్రచారంలో ఉన్న మూడింటిలో మీ నిజమైన...
04/04/2023

మోడీ ఇప్పటి వరకు ఎందుకు ప్రెస్మిట్ పెట్టలేదో తెలుసా???

ఎవరైనా జర్నలిస్ట్ పుసుక్కున బయట ప్రచారంలో ఉన్న మూడింటిలో మీ నిజమైన పుట్టిన రోజు ఏది సర్ అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలో అని భయం.

మీరూ రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్మినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ లేదు కదా సర్ అంటే నిజం బయటపడుతుంది అని భయం.

మీరు చిన్నప్పుడు చెరువు నుండి మొసలిని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పారు కానీ మాజీ ఫారెస్ట్ ఆఫీసర్ మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అది అసత్యం అని చెప్పారు కదా అని అడుగుతారు అని భయం.

మీరు ఈమెయిల్ 1988 లోనే ఉపయోగించారు కదా కానీ మన దేశంలో ఇంటర్నెట్ వచ్చింది 1995 లో మరి మీకు ఎలా సాధ్యం అయ్యింది అని అడుగుతారు అని భయం.

మీరు డిజిటల్ కెమెరా 1988 లోనే ఉపయోగించారు అని చెప్పారు కానీ ఇండియాలో డిజిటల్ కెమెరాలను అమ్మకాలు మొదలుపెట్టింది 1991లో కదా సర్ అని అడుగుతారు అని భయం.

మీరు 10th వ తరగతి ఎక్కడ చదువుకున్నారు??
మీతో పాటు చదువుకున్న మిత్రులు ఉన్నారా అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలని భయం.

మీరు 1978 లో ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు కంప్యూటరైజ్డ్ మర్క్స్ షీట్ చూపిస్తున్నారు బాగానే వుంది కానీ అప్పుడు దేశంలో ఏ యూనివర్సిటీలో కంప్యూటరైజ్డ్ సిస్టం లేదు కదా సర్ మీకు ఎలా సాధ్యం అయ్యింది అలాగే మొదటి సంవత్సరంలో నుండి మూడవ సంవత్సరం వరకు ఒకే పేరుతో డిగ్రీ మర్క్స్ మెమో ఉంటుంది కానీ మీ పేరు ఎందుకు మారింది సర్ అని అడుగుతారు అని భయం.

బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేసి జైల్ కి కూడా పోయారు అని చెప్పారు కదా ఏ జైల్లో ఉన్నారు అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలో భయం. అదానీకి ,మీకు ఉన్న సంబంధం ఏమిటో అని అడిగితే ఏమి చెప్పాలో భయం

ఇలా ఇన్ని భయాలు ఉన్నోడు ఎలా ప్రెస్మిట్ పెడుతారండి మీరు మరీనూ...🤣🤣🤣

ఇళ్ళ స్థలాలు సాధించే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐక్యంగా ఎదుర్కోవాలి.           CPM సీనియర్ నాయకులు కాసాని ఐలయ్యపాల్వంచ ప...
04/04/2023

ఇళ్ళ స్థలాలు సాధించే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐక్యంగా ఎదుర్కోవాలి.
CPM సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య

పాల్వంచ పట్టణం లో ఇండస్ట్రియల్ ఏరియా లో ప్రభుత్వ భూమి ని ఆక్రమించి ఇళ్లు,ఇళ్ళ స్థలాలు లేని పేదలంతా ఐక్యంగా ఉద్యమిస్తున్నారని,ఇళ్ళ స్థలాలు సాధించే వరకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఐక్యంగా ఎదుర్కోవాలని CPM రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య పేదలకు పిలుపునిచ్చారు.

పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభలో కాసాని ఐలయ్య మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు కావాలని,డబుల్ బెడ్ రూం లు కేటాయించాలని వందల సార్లు వినతి పత్రాలు అధికారులకు ఇచ్చినా,ఏ మాత్రం పట్టించుకోలేదని,అనివార్యంగా ఇళ్ల స్థలాలు ఆక్రమణ చేశామని,దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ఇళ్ళ స్థలాలను వెంటనే ఇవ్వాలని కాసాని ఐలయ్య డిమాండ్ చేశారు.వందల,వేల ఎకరాల ప్రభుత్వ భూములను కొద్ది మంది భు బకాసురాలు ఆక్రమించు
కున్నారన్నారు.వీరి ఆక్రమణలో ఉన్న భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని,పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ జె.రమేష్ మాట్లాడుతూ ఇండస్ట్రీ పేరుతో భూములు తీసుకుని,పరిశ్రమ పెట్టకుండా,సబ్ లీజులకి ఇచ్చి పంటలు పండిస్తున్నారని అన్నారు.ఇటువంటి భూములు ఎక్కడేక్కడ ఉన్నాయో వాటన్నింటినీ బహిరంగంగా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.చేసుకోవడానికి పనిలేక,పని దొరికినా అరకొర వేతనం మాత్రమే ఇస్తున్నారని,ఈ అరకొర వేతనాలతో ఇళ్ళ అద్దె ఎలా కడతారని,ఇతర కుటుంబ అవసరాలు ఎలా తీరతాయని ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు.

ఈ సభ లో పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డ రవి కుమార్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల క్రితం నవభా రత్ వెనక భాగం లో ప్రభుత్వ స్థలం ఆక్రమిస్తే,అప్పటి అధికారులు వచ్చి డబుల్ బెడ్ రూం లు కట్టించి,అర్హులైన పేదలకు ఇస్తామని చెప్పిన హామీ నేటి వరకు అమలు చేయకపోగా మొండి గోడలకు లాటరిలు తీసి,లబ్ది దారులను ఎంపిక చేశారన్నారు.ఈ ఎంపిక కూడా అసంబద్ధంగా జరిగిందని,పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్నారు.

ఈ కార్యక్రమం లో పార్టీ పట్టణ కమిటీ సభ్యులు వాణి రహీం క్రాంతి మాధవి తదితరులు పాల్గొన్నారు.

పేదలను ప్రభుత్వ భూములనుంచి ఖాళీ చేయాలని ఆలోచనను విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదు        CPM రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వ...
04/04/2023

పేదలను ప్రభుత్వ భూములనుంచి ఖాళీ చేయాలని ఆలోచనను విరమించుకోకపోతే ప్రతిఘటన తప్పదు
CPM రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు.

పాల్వంచ పట్టణం లో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం తమను పట్టించుకుని,గూడు లేని పేదలకి 60 గజాల స్థలం ఇస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసి,చూసి,ఓపిక నశించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడం జరిగిందని,ఈ ఆక్రమణ నుంచి ఖాళీ చేయించాలని ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని లేని యెడల తీవ్రంగా ప్రతిఘటంచాల్సి వస్తుందని మచ్చ వెంకటేశ్వర్లు హెచ్చరించారు

పార్టీ పట్టణ కమిటీ సభ్యులు నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను ఎద్దేవా చేస్తూ,తామ అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని హామీ ఇచ్చింది ఇచ్చిన హామీ మేరకు డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పాల్వంచ పట్టణంలో ఒక్కటి కూడా పూర్తి కాలేదని విమర్శించారు పూర్తి కాని ఇళ్లకు డ్రా తీసి పేదలను మభ్యపెట్టారని అన్నారు చేతిలో పని లేక సరైన వేతనం లేక అష్ట కష్టాలు పడుతున్న పేదలకు సొంతగూడు ఉంటే కొంత ఉపశమనం లభిస్తుందన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు
ఎ.జె రమేష్ పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డా రవికుమార్ పట్టణ కమిటీ సభ్యులు సత్య వాణి తులసి రామ్ క్రాంతి మాధవి యాకోబు జావేద్ తదితరులు పాల్గొన్నారు

03/04/2023

దోస్తీ బాగుకోసం ఉద్యోగుల భవిష్య నిధి (PF) పైసలతో వ్యాపారం.

Address

Rama Takies Road
Kothagudem
507101

Telephone

+919701406173

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM Bhadradri Kothagudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CPM Bhadradri Kothagudem:

Shortcuts

Share