05/05/2026
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే మన లక్ష్యం!
నెల్లూరులో మాజీ మంత్రి మరియు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో "రాయలసీమ ఎత్తిపోతల పథకం - భవిష్యత్ కార్యాచరణ" పై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, ప్రాజెక్టు ప్రాముఖ్యతపై చర్చించారు. నెల్లూరు జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడటానికి, నిలిచిపోయిన ఈ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆఫ్కాఫ్ చైర్మన్ శ్రీ కొండూరు అనిల్ బాబు గారు,పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.