ITDP Kuppam

ITDP Kuppam Its a Political Page.

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం ప్రకటిస్తున్నారు.
06/09/2026

ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడంతో నిరుద్యోగులు హర్షం ప్రకటిస్తున్నారు.




నాయకత్వం చంద్రన్నది… నడిపించే శక్తి కార్యకర్తలది… విజయం తెలుగుదేశం పార్టీదే– PKM-UDA చైర్మన్ డాక్టర్ సురేష్ బాబురామకుప్ప...
05/09/2026

నాయకత్వం చంద్రన్నది… నడిపించే శక్తి కార్యకర్తలది… విజయం తెలుగుదేశం పార్టీదే

– PKM-UDA చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు

రామకుప్పం: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రామకుప్పం మండలంలోని బైప్పరెడ్డ్లపల్లె, చెల్డిగానిపల్లి, కొంగనపల్లి గ్రామ పంచాయతీల టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు PKM-UDA చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రతి ఇంటికీ చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో పాటు, గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపారు.

అదేవిధంగా, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రతిపక్ష ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా పార్టీ శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని కోరారు.

ఈ సమావేశంలో రామకుప్పం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు. సమాజానికి విద్య, వివేక, విజ్ఞానం అందించే గ...
05/09/2026

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు. సమాజానికి విద్య, వివేక, విజ్ఞానం అందించే గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.


ఇంటింటికీ తెలుగుదేశం 2026 కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు 40 రోజులలో కోటి ఇళ్లను సందర్శించారు. ...
04/09/2026

ఇంటింటికీ తెలుగుదేశం 2026 కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు 40 రోజులలో కోటి ఇళ్లను సందర్శించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. గ్రామంలో సమస్యలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి నివేదించారు.









04/09/2026

మన రాష్ట్రానికి ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి అనేక రకాల పరిశ్రమలతో పాటు 22 క్లస్టర్లు, డ్రోన్, స్పేస్ సిటీలు వస్తున్నాయి కాబట్టి, యువతగా మీరు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఫిజిక్స్, స్పేస్, మెటీరియల్ సైన్సెస్ వంటి ఆధునిక సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలి.


కుప్పం గడ్డపై టీడీపీ జైత్రయాత్ర కొనసాగాలిస్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: PK...
04/09/2026

కుప్పం గడ్డపై టీడీపీ జైత్రయాత్ర కొనసాగాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: PKM-UDA చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు

కుప్పం: మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని గోరివిమాకులపల్లి, బందర్లపల్లి గ్రామ పంచాయతీల తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా PKM-UDA చైర్మన్ డాక్టర్ బి.ఆర్. సురేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రస్థానాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ జెండాను రెపరెపలాడిస్తూ, పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా సమష్టిగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని, గ్రామస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని డాక్టర్ సురేష్ బాబు సూచించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ గారు, రాష్ట్ర గ్రంథాలయ బోర్డు మెంబర్ మునిస్వామి గారు, టీడీపీ రామకుప్పం మండల అధ్యక్షులు వెంకటరమణ గారు, టీడీపీ రామకుప్పం మండలం మాజీ అధ్యక్షులు ఆనంద్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఎంపీపీ సులోచన గుర్రప్ప గారు, పట్టర్ నారాయణ గారు, అలాగే కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మై...
04/09/2026

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది. “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



Address

Kuppam

Alerts

Be the first to know and let us send you an email when ITDP Kuppam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ITDP Kuppam:

Shortcuts

Share