24/08/2026
స్థానిక సంస్థల ఎన్నికలలో online నామినేషన్ పద్ధతిని తీసుకురావాలి - Forum for Reserved Constituencies in Rayalaseema. (FRCR)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని తీసుకురావాలని కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ అభ్యర్థన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇందులో నామినేషన్ సమయంలో వెబ్ సర్వర్లను జాగ్రత్తగా మెయింటేన్ చేయాలని, సర్వర్లు పనిచేయకపోతే నామినేషన్ పద్ధతికి ఆటంకం ఏర్పడుతుందని వెల్లడించడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ విధానం ద్వారా నామినేషన్ వేసే అభ్యర్థులకు భరోసా వస్తుందని. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థులు భయపడరు. ముఖ్యంగా యువత రాజకీయాలలో పాల్గొనడానికి ముందుకు వస్తారు. ఫ్యాక్షన్ నేపద్యం ఉన్న కర్నూలు జిల్లా ప్రాంతంలో ఎన్నికల విధానం సులభతరం చేయడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది.
FRCR కన్వీనర్ పుసులూరి చిరంజీవి గారి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ న్యూరల్ ఖమర్ గారికి అభ్యర్థన పత్రాన్ని సమర్పించిన కార్యక్రమంలో నాయకులు రెడ్డిపోగు విజయభాస్కర్ గారు, లాజరస్ గారు తదితరులు పాల్గొన్నారు.
Forum for Reserved Constituencies in Rayalaseema అనే సంస్థ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక SC రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాన్ని కోరుతూ డి లిమిటేషన్ కమిషన్ ముందు SC, ST ల వాదనను వినిపించడానికి ఏర్పాటు చేసిన సంస్థ.
జై భీమ్.
ఇట్లు
పుసులూరి చిరంజీవి.
FRCR కన్వీనర్
9398011942