Kurnool Police

Kurnool Police Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kurnool Police, Law enforcement agency, konda reddy fort, Kurnool.

పత్రికా ప్రకటన (06.09.2026)కర్నూలు జిల్లా...* కర్నూలు జిల్లాలో గణేష్ ఉత్సవాలు  ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి.... క...
06/09/2026

పత్రికా ప్రకటన (06.09.2026)

కర్నూలు జిల్లా...

* కర్నూలు జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలి....

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.

* రోడ్లను ఆక్రమించేలా లేదా ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా గణేష్ మండపాలు ఏర్పాటు చేయకూడదు.

* వినాయక మంటపాల ఏర్పాటుకు అనుమతులు పూర్తిగా ఉచితం...https://ganeshutsav.net లో దరఖాస్తు చేసుకోండి.

* ప్రతి మండపం వద్ద తాత్కాలిక సిసి టివి కెమెరాలు అమర్చుకునే విధంగా గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులు చూడాలి.

* అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టంతో ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.

* సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు.

సెప్టెంబర్ 14 వ తేదీ నుండి వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక మంటపాల ఏర్పాటుకు https://ganeshutsav.net ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందని, అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పూర్తిగా ఉచితమని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు ఆదివారం తెలిపారు.

జిల్లాలో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని కర్నూలు ఎస్పీ గారు జిల్లా ప్రజలకు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు సూచించారు.

జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ సబ్ డివిజన్ లలో శాంతియుత సమావేశాలు ఏర్పాటు చేసుకొని గణేష్ మండపాలు, ఊరేగింపులు, నిమజ్జన కార్యక్రమాలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.

గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అనుమతులను సులభంగా ఒకే వేదిక ద్వారా పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణేష్ ఉత్సవ్ సింగిల్ విండో క్లియరెన్స్ విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

*ఆన్‌లైన్‌లోనే అనుమతులు*...

ప్రజలు https://ganeshutsav.net అనే వెబ్సైట్ నందు గణేష్ మంటపం ఏర్పాటు చేయదలచిన కమిటి సభ్యుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేసి దరఖాస్తును, ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చేసుకునే విధానం ...

గణేష్ ఉత్సవాల నిర్వహణకు మొదటగా దరఖాస్తు చేయదలచిన వారు https://ganeshutsav.net వెబ్ సైట్ ఓపెన్ చేసి న్యూ అఫ్లికేషన్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.

తరువాత దరఖాస్తు దారుని మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయవలయును.

తరువాత సదరు మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయవలయును.

ఆ తరువాత దరఖాస్తు దారుని పేరు, అడ్రస్ మరియు కమిటి సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేయు ప్రదేశం, ఏ పోలీసు స్టేషన్ పరిధి లోకి వస్తుంది, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయవలయును.

అప్లికేషన్ ఐడి నెం. (యూనిక్ ఐడి ) జనరేట్ చేయబడి, సదరు దరఖాస్తు పోలీస్ శాఖ యొక్క అనుమతి కోసం వారి లాగిన్స్ కు వెళుతుంది.

అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి, అనుమతించిన తరువాత ఆ వివరాలు వెబ్ సైట్ నందు వచ్చును. దీనికోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

అనుమతికి సంభందించిన క్యూ ఆర్ కోడ్ మరియు నిర్వాహకులు పాటించవలసిన నియమ నిబంధనలను తెలిపే ఒక బుక్ లెట్ డౌన్ లోడ్ అగును.

నిర్వాహకులు నిరభ్యంతర పత్రం (NOC) మరియు నియమ నిబంధనలు కూడిన పత్రాలను ప్రింట్ తీసి గణేష్ మంటపంలో ఉంచవలెను.

గస్తీ పోలీసులు క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి తనిఖీ చేస్తారు.

అనుమతి పొందిన ప్రతి మండపానికి క్యూ ఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలి.

నిర్వాహకులు ఆ క్యూ ఆర్ కోడ్‌ను మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి.

విద్యుత్ వైరింగ్‌ను సురక్షితంగా ఏర్పాటు చేయించాలి.

షార్ట్ సర్క్యూట్‌లు, అగ్ని ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మండపం వద్ద తగినంత ఇసుక, నీరు, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.

రాత్రి వేళల్లో మండపాల వద్ద కనీసం కొంతమంది బాధ్యత వహించేలా ఏర్పాటు చేసుకోవాలి.

అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మండపాల వద్ద, నిమజ్జన ఊరేగింపుల్లో అధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదు.

మద్యం సేవించి అధిక సౌండ్ సిస్టం తో డ్యాన్స్ లు చేయడం వల్ల గుండెపోటు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.

ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి.

పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, పోలీస్ స్టేషన్లు ,ప్రభుత్వ కార్యాలయాలు తదితర సున్నిత ప్రాంతాల వద్ద నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.

ఇతరుల మనోభావాలకు ఇబ్బందికలిగించకూడదు

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి.

పోలీసుల అనుమతి లేకుండా ఊరేగింపులు నిర్వహించరాదు.

సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు...

సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, నిర్ధారణ లేని వార్తలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దని, వాటిని ఫార్వర్డ్ చేయవద్దని ఎస్పీ గారు సూచించారు.

ఏదైనా అనుమానం లేదా సమస్యలు ఉంటే స్ధానిక పోలీసులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు.


జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు,యువత, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు

ఎక్కడైనా సమస్యలుంటే అత్యవసర పరిస్థితుల్లో డయల్–112 లేదా డయల్–100 కు లేదా స్థానిక పోలీసులను గాని సంప్రదించాలని సూచించారు.

కర్నూలు జిల్లా మత సామరస్యానికి ప్రతీక గా గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.




మహిళా కానిస్టేబుల్ కి ఆరు పతకాలు.గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో కర్...
06/09/2026

మహిళా కానిస్టేబుల్ కి ఆరు పతకాలు.

గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో కర్నూలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్‌ ఎన్‌.సౌభాగ్యమ్మ సత్తా చాటారు.

వెయిట్ లిఫ్టింగ్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించారు. ఆమెను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ గారు ,కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారు, పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.




పత్రికా ప్రకటన (06.09.2026)కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూ...
06/09/2026

పత్రికా ప్రకటన (06.09.2026)

కర్నూలు జిల్లా...

* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.

* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.




06/09/2026

కందనాతి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య గారి పర్యవేక్షణలో ఎమ్మిగనూరు రూరల్ సీఐ ఎస్. చిరంజీవి, ఎస్సైలు కే. శ్రీనివాసులు, ఎం. తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో కందనాతి గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

🔹 హత్య కేసుల్లోని నిందితుల ఇళ్లలో తనిఖీలు
🔹 లైసెన్స్/పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
🔹 నేరాలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని హెచ్చరిక
🔹 గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ పికెట్ తనిఖీ

ప్రజలు శాంతియుతంగా జీవించాలని, నేరాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని పోలీసులు సూచించారు.




ప్రజల భద్రతే లక్ష్యం.. విజిబుల్ పోలీసింగ్ కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాత్రివేళల్లో విస...
05/09/2026

ప్రజల భద్రతే లక్ష్యం.. విజిబుల్ పోలీసింగ్

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రాత్రివేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్.

అనుమానాస్పద వాహనాలు, వ్యక్తుల తనిఖీలు..

డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు.

అనుమానాస్పద ఘటనలు గమనిస్తే డయల్–112/100కు సమాచారం ఇవ్వండి.





పత్రికా ప్రకటన ( 05.09.2026)కర్నూలు జిల్లా...* రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం .* గత 8 నెలల్లో 28,531 ట్రాఫిక్ ఉల్లంఘన...
05/09/2026

పత్రికా ప్రకటన ( 05.09.2026)

కర్నూలు జిల్లా...

* రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యం .

* గత 8 నెలల్లో 28,531 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు.

* ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

* రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత – నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించండి.

* రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసుల అవగాహన కార్యక్రమాలు .

కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారు, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం రోడ్డు భద్రతపై కర్నూలు పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

2026 జనవరి 1 నుంచి ఆగష్టు 31 వరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

గత 8 నెలల్లో నమోదైన కేసుల వివరాలు :

* ఓవర్ స్పీడ్ – 5,839

* హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ – 4,094

* సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ – 1,463

* డ్రంకెన్ డ్రైవింగ్ – 5,972

* ఓపెన్ డ్రింకింగ్ – 10,670

* మైనర్ డ్రైవింగ్ - 79

* ట్రిపుల్ డ్రైవింగ్ - 414

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.




పత్రికా ప్రకటన (04.09.2026)కర్నూలు జిల్లా...* ఓటర్ల జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు...* సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్త...
04/09/2026

పత్రికా ప్రకటన (04.09.2026)

కర్నూలు జిల్లా...

* ఓటర్ల జాబితా సవరణ పేరుతో సైబర్ మోసాలు...

* సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు.

ఓటర్ల జాబితా సవరణ, ఓటరు కార్డులో పేర్లు, వివరాల మార్పుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు శుక్రవారం తెలిపారు.

ఎన్నికల సంఘం ప్రతినిధులుగా పరిచయం చేసుకొని, ఓటరు వివరాలు తప్పుగా ఉన్నాయని, దరఖాస్తు తిరస్కరణకు గురైందని చెప్పి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

అనంతరం వాట్సాప్ ద్వారా నకిలీ లింకులు, అనుమానాస్పద APK ఫైల్స్ పంపించి, తక్కువ మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ బ్యాంకు, కార్డు వివరాలు, OTPలు సేకరించి నగదు కాజేసే అవకాశం ఉందన్నారు.

జిల్లా ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలను ఎస్పీ గారు సూచించారు.

• వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింకులు, APK ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దు, డౌన్‌లోడ్ చేయవద్దు.

• చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాలంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు.

• బ్యాంకు ఖాతా వివరాలు, ATM PIN, CVV, పాస్‌వర్డ్, OTP వంటి రహస్య సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దు.

• ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి అధికారిక ఎన్నికల సంఘం సేవలను మాత్రమే వినియోగించాలి.

• ఓటరు జాబితా సవరణ, పేరు తిరస్కరణ, వివరాల మార్పులు లేదా చేర్పులపై ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత గ్రామ పంచాయతీ లేదా పట్టణ పరిధిలోని బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ను నేరుగా కలిసి సందేహాలను నివృత్తి చేసుకొని, వివరాలను ధృవీకరించుకోవాలని ఎస్పీ గారు సూచించారు.

• అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా సందేశాలు వస్తే స్పందించకుండా సంబంధిత అధికారుల ద్వారా నిజ నిర్ధారణ చేసుకోవాలి.

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, అలాగే cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం, కర్నూలు.





వినాయక ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికల పై పోలీసుల అప్రమత్తత.కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  గారి ఆదేశాల మేరకు ఆదోన...
04/09/2026

వినాయక ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికల పై పోలీసుల అప్రమత్తత.

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు ఆదోని డీఎస్పీ శ్రీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆదోని టూ టౌన్ పోలీసులు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో పరేడ్ నిర్వహించారు.

వినాయక చవితి ఉత్సవాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల పై సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు.





పత్రికా ప్రకటన (03.09.2026)కర్నూలు జిల్లా...కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం... హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజ...
03/09/2026

పత్రికా ప్రకటన (03.09.2026)

కర్నూలు జిల్లా...

కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం...

హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన ....

ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్. కృష్ణమోహన్ గారు.

కర్నూలు యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీ కే. కృష్ణ గారు ఏప్రిల్ 18 , 2026 లో గుండెపోటుతో మృతి చెందారు.

ఆయన భార్య శ్రీమతి కే. సునీత గారికి కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం కల్పిస్తూ కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు శ్రీమతి కే. సునీత గారికి హోంగార్డు నియామక ఉత్తర్వుల పత్రo ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు హోంగార్డ్స్ ఇన్‌చార్జ్ ARSI శ్రీ ఎస్.ఎల్. కాంతారెడ్డి గారు, హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.





వినాయక చవితి సందర్భంగా పోలీసుల ముందస్తు చర్యలు...కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు సి.బెళగల్‌ ఎస్సై ...
02/09/2026

వినాయక చవితి సందర్భంగా పోలీసుల ముందస్తు చర్యలు...

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు సి.బెళగల్‌ ఎస్సై వేణు గోపాల్ రాజు పీస్ కమిటీ సమావేశం నిర్వహించి, శాంతియుతంగా వేడుకలు నిర్వహించేలా నిర్వాహకులకు సూచనలు చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.





Address

Konda Reddy Fort
Kurnool
518001

Telephone

100

Alerts

Be the first to know and let us send you an email when Kurnool Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share