Kurnool Municipal Corporation

Kurnool Municipal Corporation Official account of Kurnool Municipal Corporation, Andhra Pradesh.

01/09/2026
01/09/2026

Ministry of Housing and Urban Affairs
Office of Manohar Lal
Swachh Bharat Mission - Urban
Swachha Andhra Corporation
Andhra Pradesh CM
Deputy CMO, Andhra Pradesh
Dr. Ponguru Narayana
Pattabhi Ram Kommareddy
Municipal Administration & Urban Development , AP

అర్హులందరికీ ఒకటో తేదీనే పింఛన్లు• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసునగరంలో అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు,...
01/09/2026

అర్హులందరికీ ఒకటో తేదీనే పింఛన్లు

• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

నగరంలో అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తదితరులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతంలా ప్రభుత్వం పింఛన్ అందజేస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన గౌలిగేలి ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో ప్రతి నెలా ఒకటో తేదీన సుమారు 95 శాతం, రెండో తేదీన సుమారు 98 శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని తెలిపారు. లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో పింఛన్ అందుకోలేకపోయిన వారికి తదుపరి నెలలో రెండు నెలల పింఛన్ మొత్తాన్ని కలిపి అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఒకటో తేదీనే 94.87 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిందని, అందుబాటులో లేక పింఛన్ అందుకోలేకపోయిన లబ్ధిదారులకు రెండో తేదీన పంపిణీ చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో డీపీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధికి రహదారులే రథచక్రాలు• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు• 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్నగర అభ...
01/09/2026

నగరాభివృద్ధికి రహదారులే రథచక్రాలు

• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు
• 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్

నగర అభివృద్ధిలో రహదారులు కీలక పాత్ర పోషిస్తున్నాయని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కొండారెడ్డి బురుజు వద్ద చేపడుతున్న బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రాకపోకలు అందించడంతో పాటు నగరంలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేలా రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కొండారెడ్డి బురుజు నుంచి కోట్ల విజయభాస్కరరెడ్డి కూడలి, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా వై.జంక్షన్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రూ.2.23 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డు రీ-సర్ఫేసింగ్ పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

వీటితో పాటు 14 కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట అవసరమైన చోట్ల రూ.30 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో రోడ్ మార్కింగ్స్, సెంటర్ లైన్స్, ఎడ్జ్ లైన్స్, లేన్ లైన్స్, జీబ్రా క్రాసింగ్స్, రంబుల్ స్ట్రిప్స్ వంటి సూచికలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటి ద్వారా వాహనదారులు, పాదచారులకు స్పష్టమైన మార్గదర్శకత్వం కల్పించడంతో పాటు రహదారి భద్రతను పెంచుతున్నామని చెప్పారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకుంటామని, మెరుగైన రహదారులు, క్రమబద్ధమైన రవాణా వ్యవస్థతో నగరాన్ని మరింత సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

31/08/2026

Ministry of Housing and Urban Affairs
Office of Manohar Lal
Swachh Bharat Mission - Urban
Swachha Andhra Corporation
Andhra Pradesh CM
Deputy CMO, Andhra Pradesh
Dr. Ponguru Narayana
Pattabhi Ram Kommareddy
Municipal Administration & Urban Development , AP

సుందరీకరణకు తూట్లు.. ప్రకటనదారులకు షాక్• రాజ్‌ విహార్‌లో పోస్టర్లు అతికించిన వారిపై కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆగ్రహం  • పోస...
31/08/2026

సుందరీకరణకు తూట్లు.. ప్రకటనదారులకు షాక్

• రాజ్‌ విహార్‌లో పోస్టర్లు అతికించిన వారిపై కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆగ్రహం
• పోస్టర్లు తొలగించి, బాధ్యులను గుర్తించి జరిమానా విధించాలని ఆదేశం
• పోస్టర్ల సంస్కృతికి చెక్‌ పెట్టకపోతే కొరడా ఝుళిపిస్తామని హెచ్చరిక

నగర సుందరీకరణ పనులను పాడు చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు అతికించడంపై నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజ్‌ విహార్‌ ప్రాంతంలో పర్యటించిన ఆయన సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో పోస్టర్లు అతికించడాన్ని గమనించి, వాటిని వెంటనే తొలగింపజేశారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన కూడళ్లు, డివైడర్లు, గోడలు, స్తంభాలు తదితర ప్రాంతాలను లక్షలాది రూపాయల ప్రజాధనంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అయితే కొందరు ప్రకటనదారులు, సంస్థలు నిబంధనలను ఉల్లంఘించి పోస్టర్లు అతికించడం ద్వారా నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్‌ విహార్‌ ప్రాంతంలో పోస్టర్లు అతికించిన వారిని గుర్తించి, వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. నగర సుందరీకరణ పనులను పాడు చేసే విధంగా ఎక్కడైనా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే వాటిని వెంటనే తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రకటనల కోసం అనుమతించిన ప్రాంతాలను మాత్రమే వినియోగించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా పోస్టర్లు అతికించడం, బ్యానర్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు స్వస్తి పలకాలని కమిషనర్‌ సూచించారు. నగర సుందరీకరణను కాపాడేందుకు ప్రజలు, వ్యాపార సంస్థలు, ప్రకటనదారులు నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు.

నగరంలో “పోస్టర్ల సంస్కృతికి చెక్‌” పెట్టేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించిన కమిషనర్‌.. నిబంధనలు ఉల్లంఘించి నగర సౌందర్యానికి భంగం కలిగించే వారిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Ministry of Housing and Urban Affairs
Office of Manohar Lal
Swachh Bharat Mission - Urban
Swachha Andhra Corporation
Andhra Pradesh CM
Deputy CMO, Andhra Pradesh
Dr. Ponguru Narayana
Pattabhi Ram Kommareddy
Municipal Administration & Urban Development , AP

నగరానికి న్యూ లుక్ తీసుకొద్దాం• కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ, పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు  • ప్రధాన కూడళ్లలో టర్...
31/08/2026

నగరానికి న్యూ లుక్ తీసుకొద్దాం

• కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ, పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు
• ప్రధాన కూడళ్లలో టర్ఫ్‌ గడ్డి, వాటర్‌ ఫౌంటెన్ల అభివృద్ధి
• డివైడర్లు, నడకబాటలకు సరికొత్త రూపు
• నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగరంలోని కూడళ్లను అభివృద్ధి చేసి, సుందరీకరణ, పచ్చదనం పెంపు పనులను చేపట్టి నగరానికి న్యూ లుక్‌ తీసుకొద్దామని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు సూచించారు. సోమవారం ఆయన కోట్ల విజయభాస్కరరెడ్డి, కిడ్స్‌ వరల్డ్‌, రాజ్‌ విహార్‌, మౌర్య ఇన్‌ తదితర కూడళ్లు, డివైడర్లను కమిషనర్‌, ఇంజనీరింగ్‌, హార్టికల్చర్‌ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు.

ఆయా కూడళ్లలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పచ్చదనం పెంపునకు ఉన్న అవకాశాలను కమిషనర్‌ పరిశీలించారు. నగరంలోని 9 ప్రధాన కూడళ్లన అభివృద్ధి చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కూడళ్లలో టర్ఫ్‌ గడ్డి ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పటికే ఉన్న వాటర్‌ ఫౌంటెన్లను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ప్రధాన రహదారుల వెంట ఉన్న డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేయడం, అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేపట్టడం, నడకబాటలను అభివృద్ధి చేయడం వంటి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. రహదారుల వెంట పచ్చదనం మరింత పెరిగేలా మొక్కలు నాటడంతో పాటు, ఇప్పటికే ఉన్న మొక్కలను సంరక్షించాలని హార్టికల్చర్‌ అధికారులను ఆదేశించారు.

నగరానికి ప్రధాన ప్రవేశ మార్గాలుగా, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రాంతాలుగా కూడళ్లు ఉంటాయని కమిషనర్‌ పేర్కొన్నారు. అందువల్ల ప్రతి కూడలిని ప్రత్యేకంగా తీర్చిదిద్దేలా డిజైన్‌ రూపొందించాలన్నారు. గోడలపై ఆహ్లాదకరమైన చిత్రాలు, పచ్చదనం, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌ వంటి అంశాలను సమన్వయం చేసి నగరానికి సరికొత్త రూపాన్ని తీసుకురావాలని తెలిపారు.

కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులు నాణ్యతతో చేపట్టడంతో పాటు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చగా, సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్‌ కోరారు.

కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, హార్టికల్చర్‌ ఏడి ప్రతాప్‌ రెడ్డి, డీఈఈ కృష్ణలత, తదితరులు పాల్గొన్నారు.

రాజు.. ‘వెరీ గుడ్’• వినూత్న ఆలోచనతో చెత్త సేకరణ  • పారిశుద్ధ్య కార్మికుడుని అభినందించిన కమిషనర్ చల్లా ఓబులేసు  • స్వచ్ఛా...
31/08/2026

రాజు.. ‘వెరీ గుడ్’

• వినూత్న ఆలోచనతో చెత్త సేకరణ
• పారిశుద్ధ్య కార్మికుడుని అభినందించిన కమిషనర్ చల్లా ఓబులేసు
• స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో బెస్ట్‌ వర్కర్‌గా ఎంపికకు ప్రతిపాదనలు

నగరంలోని 5వ సానిటేషన్ డివిజన్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు రాజు వినూత్న ఆలోచనతో చెత్త సేకరణను సులభతరం చేసుకోవడంపై నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అభినందించారు. సోమవారం రివర్‌వ్యూ కాలనీలో చెత్త సేకరిస్తున్న రాజును గమనించిన కమిషనర్‌.. “వెరీ గుడ్‌ రాజు” అంటూ ప్రశంసించారు.

రివర్‌వ్యూ కాలనీ, కె.ఈ. మాదన్న నగర్‌, ఆనంద్‌ టాకీస్‌ లైన్‌ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరించే రాజు.. చెత్త సేకరణలో సమయాన్ని ఆదా చేయడంతో పాటు, ఎక్కువ మొత్తంలో చెత్తను ఒకేసారి తరలించేందుకు తన ద్విచక్ర వాహనానికి ప్రత్యేకంగా ట్రాలీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ట్రాలీలో నాలుగు డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకుని, తడి, పొడి తదితర వ్యర్థాలను సేకరిస్తున్నారు. దీంతో చెత్త సేకరణ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా కొనసాగుతోంది.

విధుల్లో భాగంగా సొంత ఆలోచనతో వినూత్నంగా ట్రాలీని రూపొందించుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలకు మరింత సమర్థవంతంగా సహకరిస్తున్న రాజు పనితీరును కమిషనర్‌ చల్లా ఓబులేసు అభినందించారు. ఇతర పారిశుద్ధ్య కార్మికులకు కూడా రాజు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజును బెస్ట్‌ వర్కర్‌గా ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని కమిషనర్‌ తెలిపారు.

కార్యక్రమంలో సానిటరీ ఇంస్పెక్టర్‌ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Ministry of Housing and Urban Affairs
Office of Manohar Lal
Swachh Bharat Mission - Urban
Swachha Andhra Corporation
Andhra Pradesh CM
Deputy CMO, Andhra Pradesh
Dr. Ponguru Narayana
Pattabhi Ram Kommareddy
Municipal Administration & Urban Development , AP

30/08/2026

Ministry of Housing and Urban Affairs
Office of Manohar Lal
Swachh Bharat Mission - Urban
Swachha Andhra Corporation
Andhra Pradesh CM
Deputy CMO, Andhra Pradesh
Dr. Ponguru Narayana
Pattabhi Ram Kommareddy
Municipal Administration & Urban Development , AP

వినాయక ఘాట్‌కు సరికొత్త శోభ• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసునగరంలోని వినాయక ఘాట్ వద్ద చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి, స...
30/08/2026

వినాయక ఘాట్‌కు సరికొత్త శోభ

• నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

నగరంలోని వినాయక ఘాట్ వద్ద చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి, స్వచ్ఛత పనులతో ఘాట్‌కు సరికొత్త శోభ సంతరించుకుందని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. ఆదివారం వినాయక ఘాట్‌ను కమిషనర్ సందర్శించి, ఇటీవల పూర్తి చేసిన సీసీ బండ్, మెట్లు, డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వినాయక ఘాట్ నిమజ్జన సమయంలోనే కాకుండా నిత్యం పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. గత మూడు నెలల్లో జేసీబీలతో చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు పలుమార్లు ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. ఘాట్ పరిసరాల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు ముగ్గురు సిబ్బందికి ప్రత్యేకంగా విధులు కేటాయించామని, వారు ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు కేసీ కెనాల్‌లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. కేసీ కెనాల్‌లో చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు చెత్త సేకరణ ట్రాలీలను అందుబాటులో ఉంచామన్నారు. ఇటీవల కేసీ కెనాల్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్క మొక్కలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ చర్యల ఫలితంగా ప్రస్తుతం వినాయక ఘాట్ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తోందన్నారు.

అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఘాట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా సీసీ రహదారి, మెట్లు, బండ్, రాతి నిర్మాణాలు, డ్రెయిన్, ఫెన్సింగ్ వంటి పనులను చేపట్టామన్నారు. దీంతో ఘాట్ నూతన శోభను సంతరించుకుందన్నారు. త్వరలోనే ఘాట్‌కు రంగులు వేసి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఫరూక్, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.

Address

Kurnool
518001

Alerts

Be the first to know and let us send you an email when Kurnool Municipal Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Kurnool Municipal Corporation:

Shortcuts

Share