Telugu Desam Party: Kurupam

Telugu Desam Party: Kurupam Official Page of TDP Kurupam

04/09/2026

మున్సిపల్, పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఎప్పడూ లేనివిధంగా భారీ మెజారిటీతో గెలుపొందాలి. 2029లోనే కాదు, మరో మూడుసార్లు కూటమిగానే కలసికట్టుగా ఎన్నికలకు వెళ్లి గెలుస్తాం. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకుందాం. నో మిస్ ఫైర్, నో క్లాస్ ఫైర్. ఎన్నికల్లో విజయం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలి.



03/09/2026

విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. స్నేహితులను సంపాదించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆపదలో మనతో నిలబడేది తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే. చదువు అయిపోయాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. అందరి కంటే తల్లి ప్రేమే అత్యంత విలువైనది.


03/09/2026

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని శాపంగా మార్చేసింది వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పోలవరాన్ని పూర్తి చేస్తోంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

ఉత్తరాంధ్ర చరిత్రను తిరగరాసిన మహోజ్వల ఘట్టం

ఎండమావుల్లా మారిన ఉత్తరాంధ్ర నేలకు గోదావరి తల్లి పవిత్ర జలాలను పారించి.. కరవు కోరల నుంచి ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విముక్తి చేసిన ఆధునిక భగీరథుడు సీఎం చంద్రబాబు గారు. - ఎంపీ చింతకాయల విజయ్




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానం చేసి కరవు రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతాం.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


03/09/2026

గిరిజనుల సంపదను దోచుకుని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్ రెడ్డికి.. వికాసం, విజ్ఞానం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీఎం చంద్రబాబు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. "Both are not same"


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl



02/09/2026

గిరిజనుల అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్‌ కనుసన్నల్లో వైసీపీ కుట్రలు : గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మీడియా సమావేశం. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్షప్రసారం.
|| Alluri Seetharamaraj district ||

02/09/2026

తరతరాల సమస్యకు పరిష్కారం..

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనలో మత్స్యకారుల వద్దకు స్వయంగా వెళ్లిన సీఎం చంద్రబాబు గారు.. వారి సంక్షేమం, వేట సమయంలో ఎదురయ్యే భద్రతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గోదావరి తీరంలో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఏటిగట్టు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపి, తమ కుటుంబాలకు అండగా నిలిచిన చంద్రబాబు గారికి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మా సమస్యను మా దగ్గరకు వచ్చి తెలుసుకుని.. పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇదే అంటూ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
#పేదలసేవలో





నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో...
02/09/2026

నరసరావుపేటలో మంత్రి నారా లోకేష్ కు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానుల ఘనస్వాగతం. ఎస్ ఆర్ కే సెంటర్ లో డప్పులు, డీజే లతో హోరెత్తించిన పసుపు సైనికులు, అభిమానులు. ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆధ్వర్యంలో లోకేష్ కు కార్యకర్తల స్వాగతం. మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, భాష్యం రామకృష్ణ, నర్సరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జాన్ సైదా, ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, దర్శి ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి, గుంటూరు మేయర్ కోవెలమూడి నాని, టీడీపీ నాయకులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మన్నవ మోహన కృష్ణ, గోనుగుంట్ల కోటేశ్వరరావు, కనుమూరి బాజి చౌదరి, కనపర్తి శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ తదితర నాయకులు.


Address

Kurupam

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kurupam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kurupam:

Shortcuts

Share