Jupally Krishna Rao

Jupally Krishna Rao Minister for Excise and Prohibition,
Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.

21/08/2026

కొల్లాపూర్ నియోజకవర్గ్ అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను స్వయంగా పరిశీలిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకునేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల దరఖాస్తులు రాసేందుకు తన తరఫున ఏడు మండాల్లోని రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు పోలీసు స్టేషన్లలో ప్రత్యేకంగా కుర్చీ, టేబుల్ వేయించి కాంగ్రెస్ నాయకులను కూర్చొబెడతామని తెలిపారు. ఎప్పటికప్పుడు వివరాలను తనకు పంపించాలని సూచించారు.

పెంట్లవెల్లిలో పర్యటించి స్వయంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన మంత్రి జూపల్లి..పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంత...
21/08/2026

పెంట్లవెల్లిలో పర్యటించి స్వయంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసిన మంత్రి జూపల్లి..

పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్ల స్థితిగతులను స్వయంగా పరిశీలించి, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు.

పెంట్లవెల్లి మండలం రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని ...
21/08/2026

పెంట్లవెల్లి మండలం రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని రెవెన్యూ వినతులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్లు అపరిష్కృతంగా ఉండడం పట్ల అధికారులను ప్రశ్నించారు.

అనంతరం కార్యాలయంలో కలియతిరిగిన మంత్రి గారు... టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే స్వయంగా నీళ్లు పోసి శుభ్రం చేశారు.

మంత్రి గారి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తుతం నివసిస్తున్న ఇళ...
21/08/2026

పెంట్లవెల్లి మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్ల స్థితిగతులను స్వయంగా పరిశీలించి, ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా, ఇప్పటికే గోడలు నిర్మించుకుని స్లాబ్ వేసుకునే స్థితిలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఇల్లు నిర్మాణంలో బేస్ లెవెల్ వరకు పూర్తి చేసుకుని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మిగతా నిర్మాణాన్ని కొనసాగించలేకపోతున్న అర్హులైన లబ్ధిదారులకు రూ.4 లక్షలు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నామని వెల్లడించారు. అర్హత, ఇంటి ప్రస్తుత స్థితిగతులు మరియు లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామన్ గౌడ్, హౌసింగ్ డీఈ రాజవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు....
21/08/2026

చిన్నంబావి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు భోజన నాణ్యతలో రాజీపడకూడదని ఉపాధ్యాయులను, అధికారులకు స్పష్టం చేశారు.

మంత్రి గారి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

అమ్మవారి కరుణకటాక్షాలతో కష్టాలు తొలగి, శుభాలు కలగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్...
21/08/2026

అమ్మవారి కరుణకటాక్షాలతో కష్టాలు తొలగి, శుభాలు కలగాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

చిన్నంబావి అభివృద్ధికి రూ.4 కోట్లు: మంత్రి జూపల్లి.చిన్న మారూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల..సంతలో కలియతిరిగిన మం...
20/08/2026

చిన్నంబావి అభివృద్ధికి రూ.4 కోట్లు: మంత్రి జూపల్లి.

చిన్న మారూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి విడుదల..

సంతలో కలియతిరిగిన మంత్రి జూపల్లి.. 10 మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటుకు హామీ.

చిన్నంబావి మండల అభివృద్ధికి రూ.4 కోట్ల నిధులు విడుదల చేస్తామని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం చిన్నంబావి మండలంలో పర్యటించిన మంత్రి.. చిన్న మారూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేశారు.

ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందుబాటులోకి రావడంతో రైతులకు సాగునీటి ప్రయోజనం కలుగుతుందని మంత్రి తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అనంతరం చిన్నంబావి మండల కేంద్రంలోని సంతలో మంత్రి కలియతిరిగారు. కూరగాయల వ్యాపారులను పలకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంతకు వచ్చే వ్యాపారులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై ఆరా తీశారు.

సంతలో ప్రజలు, వ్యాపారుల సౌకర్యార్థం 10 మొబైల్‌ టాయిలెట్లను త్వరితగతిన ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

చిన్నంబావి సర్కిల్‌ పరిధిలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ.4 కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు, మండల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని జూపల్లి కృష్ణారావు తెలిపారు.

20/08/2026

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని, నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను మంత్రి బైక్ పై తిరుగుతూ పరిశీలించారు.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష...
20/08/2026

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డీ-8 కెనాల్‌ పరిధిలోని కాల్వలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బైక్‌పై తిరుగుతూ స్వయంగా పరిశీలించారు. తూడుకుర్తి దగ్గర ప్రధాన కాల్వ నుండి సాకర్‌పల్లి, ఏదుట్ల‌, గోపాలపేట, రేమ‌ద్దుల, సింగాయిపల్లి, తురకపల్లి, గోపులపురం కాల్వలను పరిశీలించి నీటి ప్రవాహం, కాల్వల పరిస్థితిని ప‌ర్య‌వేక్షించారు.

కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు విడుదల చేస్తున్న నీరు, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆరా తీశారు. ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు చేరుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టుకోవాలని మంత్రి సూచించారు. నీటిని ఏమాత్రం వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ అధిక విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదల, నీటి ప్రవాహం, ఆయకట్టు పరిస్థితిపై సాగునీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. నీరు వృథా కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయకట్టు చివరి భూములకు సైతం సక్రమంగా నీరు అందేలా చూడాలని సూచించారు.

మంత్రి వెంట వనపర్తి జిల్లా గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ , కోడేరు మాజీ ఎంపీపీ రామ్మోహన్ రావు, సాగునీటిపారుదల‌ శాఖ అధికారులు, తదిత‌రులు ఉన్నారు.

Address

Lingampally

Website

Alerts

Be the first to know and let us send you an email when Jupally Krishna Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jupally Krishna Rao:

Shortcuts

Share