06/09/2026
కృష్ణా జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీసు చర్యలు - చెడు నడత కలిగిన షీట్ హోల్డర్స్ కు కౌన్సిలింగ్.
జిల్లాలో నేరాల నివారణకు, చెడు నడత కలిగిన వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి, మరియు సమాజంలో శాంతి భద్రతలను మెరుగుపర్చడానికి కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
ఈ చర్యలలో భాగంగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నివసించే రౌడీలు, డీసీలు, కేడి, మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్‌ను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సిలింగ్‌లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలనే సందేశం అందజేశారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు.
మరలా మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా, భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు. అలాగే, జిల్లా పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తికి తమ బాధ్యతలను వివరించి, నేర నిరోధానికి అవసరమైన చర్యలను వివరిస్తూ వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
Andhra Pradesh Police