28/11/2025
*ఎన్నో దశాబ్దాల కల సాకారం చేసిన కూటమి ప్రభుత్వం.*
*సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్, రెవెన్యూ శాఖ మాత్యులు అనగానీ సత్యప్రసాద్ గార్ల పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.*
**2022 సం,, ఫిబ్రవరి 22 నుంచి మూడు రోజులు మడకశిర ప్రాంత రైతులతో కలిసి ర్యాలీలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.*
*
*ఈ ప్రాంతం నుంచి ఎన్నికై రెవెన్యూ మంత్రిగా పనిచేసిన మడకశిర డివిజన్ మంజూరు చేయలేక పోయారు.*
*వైసిపి ప్రభుత్వంలో మూడు రోజులు ప్రజలు ధర్నాలు నిరసన ర్యాలీలు చేసిన కనికరించని జగన్మోహన్ రెడ్డి.*
మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు*నారా చంద్రబాబు నాయుడు గారు*నారాలోకేష్ * డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ *మరియు మన నియోజకవర్గ డాష్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి *ఎమ్మెస్ రాజుగారు* మరియు ప్రజల కోసం ఈ నియోజకవర్గ కోసం ప్రతి క్షణం ఆలోచిస్తూ తెలుగుదేశం పార్టీని ముందుకు నడుపుతూ కృషి చేస్తున్న మన *గుండుమల తిప్పేస్వామి పోరాటం ఈరోజు నెరవేరింది.
మడకశిర పట్టణం.
మడకశిర పట్టణం జ్యోతిరావు బాపూలే సర్కిల్ నందు నిన్నటి రోజున మడకశిర ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు కోసం జీవో విడుదల అయిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు యువ నాయకులు లోకేష్ బాబు, రెవిన్యూ శాఖ మాత్యులు అనగానీ సత్యప్రసాద్ గార్ల చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు మాట్లాడుతూ గతంలో 2022 సం,, ఫిబ్రవరి 22 నుంచి మూడు రోజులు మౌన, దీక్ష నిరసన ర్యాలీ ,రిలే నిరాహార దీక్ష, వంటి కార్యక్రమం అఖిలపక్షం నాయకులతో ప్రజలతో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి మడకశిర ప్రాంత వాసులపై చిన్న చూపు చూశారు ర్యాలీలు నిర్వహించిన కనికరించలేకపోయారు, రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి అమరాపురం, ఆగళి, గుడిబండ, రోళ్ళ, మడకశిర మండల నుంచి పెనుగొండ సుదూర ప్రాంతమైనందున రెవెన్యూ సమస్యలపై ప్రజలు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న ఈ ప్రాంత వాసి ప్రజల కష్టాలను చూసిన కనికరించకుండా రెవిన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన ఆర్డీవో కార్యాలయాన్ని తీసుకోరాలేదు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకసార్లు చంద్రబాబు గారి దృష్టికి తీసుకొని వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి అధికారంలోకి వచ్చిన వెంటనే మడకశిరలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలలలో మడకశిర ప్రాంతం గుండుమల గ్రామానికి వచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెస్ రాజుగార్ల చొరవతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లడంతో వారు సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతానికి ఆర్డిఓ కార్యాలయం అవసరమని గుర్తించి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు, అందులో భాగంగా మంత్రులతోను యువ నాయకులు నారా లోకేష్ బాబు గారితోను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడల్లా మడకశిర ప్రాంత అభివృద్ధి ప్రదాత అయినటువంటి నా సోదరులు ఎమ్మెస్ రాజుగారు కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి మడకశిర ప్రాంతానికి ఆర్డిఓకార్యాలయం అవసరమని వారికి తెలియజేశారు. నిన్నటి రోజున మడకశిర ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు కోసం జీవో విడుదల చేసిన సందర్భంగా మడకశిర ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న నెరవేరని కల సహకారమైందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మడకశిర నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, త్వరలోనే సుందరంగా ఆర్డీవో భవనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి మంత్రులను పిలిపించి నియోజకవర్గ ప్రజలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి అంగరంగ వైభవంగా ఆర్డిఓ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, రాష్ట్ర మైనారిటీ డైరెక్టర్ భక్తర్ సాబ్, జిల్లా లీగల్ సెల్ రాధాకృష్ణ, మున్సిపల్ చైర్మన్ నరసింహారాజు, కన్వీనర్లు, నాగరాజు, నాగరాజు, వైస్ చైర్మన్ వెంకట లక్ష్మమ్మ, హనుమంతు,కౌన్సిలర్లు ఉమాశంకర్ బలరాం క్లస్టర్ ఇంచార్జ్ రవికుమార్, ప్రధాన కార్యదర్శి తిమ్మరాజు, అన్ని అనుబంధ కమిటీ నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.