Telugu Desam Party: Madanapalle

Telugu Desam Party: Madanapalle Official Page of TDP Madanapalle

04/09/2026

2008 నుంచి డీఎస్సీ రాస్తున్నా. అప్పుడు ఒక్క మార్కులో మిస్సయ్యా. అప్పటి నుంచి కష్టపడి ప్రయత్నిస్తున్నా. మెగా డీఎస్సీ-2025లో ఉద్యోగం సాధించా. మేము ఎంతో కష్టంతో ఉద్యోగం సాధిస్తే వైసీపీ వారు విమర్శించడం ఎంతో బాధగా ఉంది.




•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబం...
04/09/2026

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది

•రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు

•అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు

•కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆలయ కమిటీ ఆహ్వానం అందించింది

•ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/PD6U1



03/09/2026

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరాన్ని శాపంగా మార్చేసింది వైసీపీ ఐదేళ్ల విధ్వంస పాలన. సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పోలవరాన్ని పూర్తి చేస్తోంది. ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించింది.




#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను...
03/09/2026

•పాయకరావుపేట క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రవహించిన గోదావరి జలాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర జలాలను శిరస్సుపై చల్లుకుని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు

•తూర్పు కనుమలు దాటి వచ్చిన గోదావరి జలాలను వచ్చే ఏడాది సింహాచలం అప్పన్న చెంతకు, ఆపై అరసవల్లి వరకు, చివరికి వంశధార వరకు తీసుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు

•జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు

•బాబాయిని, సొంత కార్యకర్తలను చంపి ఆ నెపాన్ని ఇతరులపై నెట్టే వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు

•విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పల్నాడు జిల్లాలో పర్యటించి, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మూడు హాస్టల్ భవనాలను ప్రారంభించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/13MXl



02/09/2026

తరతరాల సమస్యకు పరిష్కారం..

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పర్యటనలో మత్స్యకారుల వద్దకు స్వయంగా వెళ్లిన సీఎం చంద్రబాబు గారు.. వారి సంక్షేమం, వేట సమయంలో ఎదురయ్యే భద్రతా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గోదావరి తీరంలో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఏటిగట్టు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపి, తమ కుటుంబాలకు అండగా నిలిచిన చంద్రబాబు గారికి మత్స్యకారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మా సమస్యను మా దగ్గరకు వచ్చి తెలుసుకుని.. పరిష్కారం చూపిన ప్రభుత్వం ఇదే అంటూ మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.
#పేదలసేవలో





ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం...    రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగ...
02/09/2026

ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.

02/09/2026

ఉత్తరాంధ్రకు కొత్త ఊపిరి పోయనున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉక్కు సంకల్పంతో, దాదాపు 1000 కోట్ల వ్యయంతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రతిష్టాత్మకమైన ఈ కాలువ పనులు పూర్తయ్యాయి. 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 9.23 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరును అందించే గోదావరి జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సెప్టెంబర్ 2 న అనకాపల్లిలో అశేష జనవాహినితో స్వాగతం పలకనున్నారు.


#ఉత్తరాంధ్రసుజలస్రవంతి


•పేదరిక నిర్మూలనతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని, అందుకే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తు...
02/09/2026

•పేదరిక నిర్మూలనతోనే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని, అందుకే సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ సుపరిపాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

•పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటికి బుధవారం మధ్యాహ్నం 2:20 గంటలకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి ఉత్తరాంధ్రకు జలాలను విడుదల చేయనున్నారు

•రాష్ట్రవ్యాప్తంగా 5,000 దేవాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు

•వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి "అక్షర ఆంధ్ర" లక్ష్యాన్ని సాధించి, ఏపీని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు

•అన్ని రంగాల్లో మంగళగిరిని నంబర్-1గా నిలపడం లక్ష్యమని, ఇందుకు అధికారుల సహకారం అవసరమని నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/u0C1



Address

Madanapalle
517325

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Madanapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Madanapalle:

Shortcuts

Share