24/02/2025
మహబూబాబాద్ పట్టణంలో చోరీ, 5 గంటలలోనే ఛేదించిన PS Mahabubabad Town మరియు CCS Mahabubabad పోలీసులు.
నిన్న అనగా తేదీ 23.02.2025 రోజున ఉదయం 10 గంటలకు పట్టణంలోని మార్వాడీ బజారులో.... రాత్రి పూట గాలి కోసం ఇంటి ముందు తలుపులు తీసి మెష్ డోర్ వేసుకొని నిద్రిస్తుండగా గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు మరియు 5,000/- రూపాయల నగదును అపహరించుకుపోయినారని ఫిర్యాదు రాగా, దానిపై మహబూబాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినారు. అట్టి కేసును ఛేదించుటకు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ మరియు CCS పోలీసులు నాలుగు టీంలుగా విడిపోయి మార్వాడీ బజార్ లో ఉన్న CC కెమెరాలను పరిశీలించగా అందులో పాత నేరస్థుడు అయిన కోట్ల ముత్యాల్ రావు మొన్న రాత్రి ఆ బజార్ లో తిరిగినట్టుగా కనబడడంతో నిన్న అతను ఉంటున్న దర్గా తండా కు వెళ్ళి అతన్ని పట్టుకొని విచారించగా చేసిన దొంగతనం ఒప్పుకున్నాడు.
వికలాంగుల కాలనీ, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోట్ల ముత్యాల్ రావు అనునతను దర్గా తండాలో ఉంటూ గత కొంత కాలం నుండి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం మరియు మహాబూబాబాద్ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినాడు. తరువాత 2024 సంవత్సరంలో కూడా మహబూబాబాద్ పట్టణంలో చోరీ కేసులలో మహబూబాబాద్ టౌన్ పోలీసులు అతడ్ని జైలుకు పంపినారు. ఆ తరువాత జైలు నుండి బయటకు వచ్చి డంపింగ్ యార్డ్ లో పని చస్తుండగా వచ్చే డబ్బులు తన జల్సాలకు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో మొన్న రాత్రి మహబూబాబాద్ పట్టణంలో తిరుగుతూ ముత్యాలమ్మ గుడి వద్ద ఒక సైకిల్ కనిపిస్తే దానిని దొంగిలించి, అదే రోజు రాత్రి మార్వాడీ బజారులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని ఇంట్లో 5000/- రూపాయలు దొరికితే వాటిని కూడా దొంగిలించుకొని పోయినాడు.
నిందితుని వివరములు:
కోట్ల ముత్యాల్ రావు తండ్రి: రామస్వామి, వయస్సు: 36 సం.లు, కులం: యానాది, వృత్తి: డంపింగ్ యార్డ్ లో కూలీ, నివాసం: దర్గాతండ, ఈదులపూసపల్లి గ్రామం, మహబూబాబాద్, N/o వికలాంగుల కాలనీ, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
నిందితుని వద్ద నుండి స్వాధీనపర్చుకున్న వస్తువుల వివరములు:
1) సైకిల్
2) బంగారు పుస్తెల తాడు
వీటి మొత్తం విలువ సుమారు రూ. 2,12,000/-
నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవెందర్, CCS SI లు SK తాహెర్ బాబా, B. గోపి, టౌన్ SI లు B. విజయ్ కుమార్, K. శివ మరియు క్రైమ్ సిబ్బంది, CCS సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు అభినందించారు.
Telangana State Police