PS Mahabubabad Town

PS Mahabubabad Town Official Page of Mahabubabad Town Police Station of Mahabubabad District, Telangana, India.

In Emergency Dial ☎100
To Report Cyber Crimes Dial ☎1930
OR Visit
www.cybercrime.gov.in
Block the IMEI of a lost/stolen Mobile Phone at www.ceir.gov.in

24/02/2025

మహబూబాబాద్ పట్టణంలో చోరీ, 5 గంటలలోనే ఛేదించిన PS Mahabubabad Town మరియు CCS Mahabubabad పోలీసులు.

నిన్న అనగా తేదీ 23.02.2025 రోజున ఉదయం 10 గంటలకు పట్టణంలోని మార్వాడీ బజారులో.... రాత్రి పూట గాలి కోసం ఇంటి ముందు తలుపులు తీసి మెష్ డోర్ వేసుకొని నిద్రిస్తుండగా గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు మరియు 5,000/- రూపాయల నగదును అపహరించుకుపోయినారని ఫిర్యాదు రాగా, దానిపై మహబూబాబాద్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినారు. అట్టి కేసును ఛేదించుటకు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ మరియు CCS పోలీసులు నాలుగు టీంలుగా విడిపోయి మార్వాడీ బజార్ లో ఉన్న CC కెమెరాలను పరిశీలించగా అందులో పాత నేరస్థుడు అయిన కోట్ల ముత్యాల్ రావు మొన్న రాత్రి ఆ బజార్ లో తిరిగినట్టుగా కనబడడంతో నిన్న అతను ఉంటున్న దర్గా తండా కు వెళ్ళి అతన్ని పట్టుకొని విచారించగా చేసిన దొంగతనం ఒప్పుకున్నాడు.

వికలాంగుల కాలనీ, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన కోట్ల ముత్యాల్ రావు అనునతను దర్గా తండాలో ఉంటూ గత కొంత కాలం నుండి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం మరియు మహాబూబాబాద్ టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చినాడు. తరువాత 2024 సంవత్సరంలో కూడా మహబూబాబాద్ పట్టణంలో చోరీ కేసులలో మహబూబాబాద్ టౌన్ పోలీసులు అతడ్ని జైలుకు పంపినారు. ఆ తరువాత జైలు నుండి బయటకు వచ్చి డంపింగ్ యార్డ్ లో పని చస్తుండగా వచ్చే డబ్బులు తన జల్సాలకు కుటుంబ అవసరాలకు సరిపోకపోవడంతో మొన్న రాత్రి మహబూబాబాద్ పట్టణంలో తిరుగుతూ ముత్యాలమ్మ గుడి వద్ద ఒక సైకిల్ కనిపిస్తే దానిని దొంగిలించి, అదే రోజు రాత్రి మార్వాడీ బజారులో ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించుకొని ఇంట్లో 5000/- రూపాయలు దొరికితే వాటిని కూడా దొంగిలించుకొని పోయినాడు.

నిందితుని వివరములు:

కోట్ల ముత్యాల్ రావు తండ్రి: రామస్వామి, వయస్సు: 36 సం.లు, కులం: యానాది, వృత్తి: డంపింగ్ యార్డ్ లో కూలీ, నివాసం: దర్గాతండ, ఈదులపూసపల్లి గ్రామం, మహబూబాబాద్, N/o వికలాంగుల కాలనీ, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.

నిందితుని వద్ద నుండి స్వాధీనపర్చుకున్న వస్తువుల వివరములు:

1) సైకిల్
2) బంగారు పుస్తెల తాడు

వీటి మొత్తం విలువ సుమారు రూ. 2,12,000/-

నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ పెండ్యాల దేవెందర్, CCS SI లు SK తాహెర్ బాబా, B. గోపి, టౌన్ SI లు B. విజయ్ కుమార్, K. శివ మరియు క్రైమ్ సిబ్బంది, CCS సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు అభినందించారు.

Telangana State Police

24/02/2025

68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆన్టీ సబొటేజ్ చెక్ (రూం సెర్చ్) ఈవెంట్ లో సిల్వర్ మెడల్ సంపాదించిన మహబూబాబాద్ జిల్లా బాంబ్ స్క్వాడ్ కానిస్టేబుల్ అంజయ్య కు DGP జితేందర్ గారు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ శిఖా గోయెల్‌ గారు, స్పోర్ట్స్ IGP M. రమేష్ గారితో పాటూ పలువురు అధికారులు పాల్గొన్నారు



Telangana State Police

24/02/2025

అమాయకులకు వలవేసి వారి బ్యాంకు అకౌంట్లను నేరాల కోసం వాడుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. అపరిచితులు ఎవరైనా మీ అకౌంట్ వాడుకుంటామని, అందుకు కొంత డబ్బు చెల్లిస్తామని ఆఫర్ చేస్తే ఆశపడకండి. సైబర్ మోసాల్లో భాగస్వాములు అవకండి.

24/02/2025
24/02/2025

సైబర్ నేరాలను ఎదుర్కోవడం చాలా సులభం. సరైన అవగాహన ఉంటే సైబర్ నేరాల బారిన పడే అవకాశం అస్సలు ఉండదు. కాబట్టి మీ సన్నిహితులకు ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై అప్రమత్తం చేయండి. అవగాహన కల్పించండి.

24/02/2025

పిల్లల వెబ్‌ యాక్టివిటీని తల్లిదండ్రులు తరచూ పరిశీలించండి. ఆన్‌లైన్‌ గేమ్స్‌ మాటున ఉన్న బెట్టింగ్‌ యాప్స్‌ వలలో వారు పడకుండా జాగ్రత్త వహించండి. బెట్టింగ్‌ యాప్స్ వల్ల జరిగే నష్టాలను వివరించండి. పిల్లల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను కూడా పరిశీలించడం మంచిది.

Address

Mahabubabad
Mahabubbad
506101

Alerts

Be the first to know and let us send you an email when PS Mahabubabad Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share