SP Mahabubabad

SP Mahabubabad This is the Official Page of the Superintendent of Police Mahabubabad District, Telangana, India.

In Emergency Dial ☎100
To Report Cyber Crimes Dial ☎1930
OR Visit
www.cybercrime.gov.in
Block the IMEI of a lost/stolen Mobile Phone at www.ceir.gov.in

విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత కూడా ముఖ్యమేతొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్...
05/09/2026

విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రత కూడా ముఖ్యమే

తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

⭐ తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ, స్టేషన్ రికార్డులు, CCTNS, సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించారు.
⭐ గంజాయి అక్రమ రవాణా, గుడుంబా, అక్రమ మద్యం నియంత్రణకు నిరంతర తనిఖీలు, నిఘా చేపట్టాలని ఆదేశించారు.
⭐ రోడ్డు ప్రమాదాల నివారణకు Drunk and Drive తనిఖీలు, రాత్రి పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని సూచించారు.
⭐ వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
⭐ బందోబస్తు విధుల్లో సిబ్బంది రక్షణ పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి.. గణేష్ ఉత్సవాలకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా...
02/09/2026

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలి.. గణేష్ ఉత్సవాలకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలి: జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

⭐ CCTNS, e-Sakshya, e-Summons వివరాలను సకాలంలో అప్‌డేట్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.

⭐ పెండింగ్ కేసులు, POCSO, NDPS, మిస్సింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

⭐ Dial-112 కాల్స్‌కు సత్వర స్పందన అందించాలని తెలిపారు.

⭐ గణేష్ ఉత్సవాలకు ముందస్తు ప్రణాళికతో శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సుదీర్ఘ సేవలకు ఘన సన్మానం.. పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు⭐ పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించిన పదవీ విరమణ పొందిన ఎస...
01/09/2026

సుదీర్ఘ సేవలకు ఘన సన్మానం.. పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు

⭐ పోలీస్ శాఖలో అంకితభావంతో సేవలందించిన పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ సి. సాంబయ్య, ఏఆర్‌ఎస్‌ఐ జె. వెంకటేశ్వర్లును జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేశారు.
వారి క్రమశిక్షణ, విధినిబద్ధత సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ పేర్కొన్నారు.
అనంతరం పోలీస్ వాహనంలో వారిని ఆత్మీయంగా ఇంటి వరకు సాగనంపారు.

నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్* గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై విస్తృత అవగా...
24/08/2026

నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

* గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.
* ఫిర్యాదుదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించి, ప్రో-యాక్టివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
* బ్లూ కోట్స్, వీఓపీల గ్రామ సందర్శనలు, సీసీటీఎన్‌ఎస్, స్టేషన్ రైటర్ల విధులను సమీక్షించారు.
* గంజాయి, గుడుంబా, అక్రమ రవాణాపై కఠిన చర్యలు, రాత్రి వేళల్లో నైట్ పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని తెలిపారు.
* ఫేక్ లోన్ యాప్స్, OTP మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసి, మోసం జరిగితే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

24/08/2026

.డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్⭐ గూడూరులో ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ జెండా ఊపి 2K రన...
22/08/2026

.డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: జిల్లా ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్

⭐ గూడూరులో ఎస్పీ డా. శబరీష్ పి., ఐపీఎస్ జెండా ఊపి 2K రన్‌ను ప్రారంభించారు.

⭐ 1,000 మందికి పైగా విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.

⭐ డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.

⭐ గంజాయి సమాచారానికి రూ.5,000 వరకు నగదు బహుమతి, వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. యాంటీ-డ్రగ్ హెల్ప్‌లైన్ 87126 56999కు సమాచారం ఇవ్వాలని కోరారు.

“మనమందరం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం” – జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్★ బయ్యారం మండలం సంతులాల్‌పాడు గ్రామపం...
21/08/2026

“మనమందరం కలిసి మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడదాం” – జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

★ బయ్యారం మండలం సంతులాల్‌పాడు గ్రామపంచాయతీలో ‘మన ఊరు – మన బాధ్యత’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పాల్గొన్నారు.

★ సుమారు 800 మంది గ్రామస్థులకు రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం, సీసీ కెమెరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించారు.

★ గ్రామంలో 26 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయని సర్పంచ్ తెలిపారు.

★ గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలంతా బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

★ రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

జాతీయ లోక్ అదాలత్‌పై సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా జడ్జి కె. మురళీమోహన్, ఎస్పీ డా. శబరీష్1. జాతీయ లోక్ అదాలత్ ద్వారా...
21/08/2026

జాతీయ లోక్ అదాలత్‌పై సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా జడ్జి కె. మురళీమోహన్, ఎస్పీ డా. శబరీష్

1. జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించాలని జిల్లా జడ్జి కె. మురళీమోహన్ సూచించారు.

2. ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్‌తో కలిసి సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌పై సమన్వయ సమావేశం నిర్వహించారు.

3. ఎక్సైజ్, సైబర్ క్రైమ్, పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పరిష్కారంపై సమావేశంలో సమీక్షించారు.

4. కేసుల సత్వర పరిష్కారానికి పోలీసు, న్యాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జడ్జి సూచించారు.

5. లోక్ అదాలత్‌లో అత్యధిక కేసుల పరిష్కారానికి పోలీసుశాఖ పూర్తి సహకారం అందిస్తుందని ఎస్పీ డా. శబరీష్ తెలిపారు.

20/08/2026

మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ స్పందించారు. ఈ ఘటనపై డీఎస్పీ స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించినట్లు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత పోలీసు అధికారిని విధులకు దూరంగా ఉంచినట్లు ఎస్పీ వెల్లడించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తతే విద్యార్థుల భద్రతకు కవచం-జిల్లా ఎస్పీ డా. పి. శబరిష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ చైతన్య టెక్నో స్...
18/08/2026

సైబర్ నేరాలపై అప్రమత్తతే విద్యార్థుల భద్రతకు కవచం

-జిల్లా ఎస్పీ డా. పి. శబరిష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బ్రాంచ్–1లో షీ టీం, సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

- సైబర్ మోసాలు, సోషల్ మీడియా వినియోగం, పాస్‌వర్డ్ భద్రత, అనుమానాస్పద లింకులపై అవగాహన కల్పించారు.

- మహిళలు, బాలికల భద్రత, వేధింపుల నివారణపై సూచనలు చేశారు.

- సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Address

Mahabubbad
506101

Alerts

Be the first to know and let us send you an email when SP Mahabubabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share