30/04/2022
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఈరోజు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ
శ్రీ శరత్ చంద్ర పవార్ IPS గారు సమావేశమయ్యారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
రోడ్డు మీద నిరంతరం తమ విధులలో నిమగ్నమై ప్రజలకు సేవలందిస్తున్న క్రమంలో ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్.ఐ గాలిబ్ గారికి బ్రీత్ అనలైజర్ మరియు సిబ్బందికి చలువ కళ్లద్దాలు, ORS ప్యాకెట్లు అందచేశారు.
Telangana State Police