31/05/2026
ప్రెస్ నోట్
“ఘనంగా మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశం”:
నూతన అధ్యక్షుడిగా :కొణతం సుభాష్
కేసముద్రం:31-05-2026
మండల కేంద్రంలో మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం శ్రీనివాస్, జిల్లా గౌరవ సలహాదారులు, అడ్వకేట్ తుంపిళ్ళ శ్రీనివాస్, మరియు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కమటం శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు.
సమావేశంలో వక్తలు మాట్లాడుతూ యువత సమాజ ప్రగతికి చోదక శక్తులని, సంఘం బలోపేతానికి మరియు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపు యువత విద్యా, ఆర్థిక, రాజకీయ రంగాలలో రాణించేందుకు ఈ అసోసియేషన్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన కార్యవర్గ ఎన్నిక:
ఈ ఆవిర్భావ సమావేశంలో మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కేసముద్రం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
* అధ్యక్షుడు: కొణతం సుభాష్
* ప్రధాన కార్యదర్శి: తోట సందీప్
* ఉపాధ్యక్షులు. కముటం రాహుల్ ,బండి వెంకటేష్
* సంయుక్త కార్యదర్శి కముటం వంశీ
* ప్రచార కార్యదర్శులు తుంపిల్ల రమేష్, కముటం రాకేష్
* కార్యవర్గ సభ్యులు లక్కాకుల వంశీ.
*కమిటీ గౌరవ సలహాదారు గా తుంపిళ్ళ శ్రీనివాస్(న్యాయవాది).
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల ప్రధాన కార్యదర్శి కముటం స్వామి (LIC), కోశాధికారి సింగంశెట్టి ఏకాంతం, కేసముద్రం టౌన్ ప్రెసిడెంట్ మరియు మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ ఆగే రాము, గ్రామ మున్నూరు కాపు అధ్యక్షులు శ్రీ కమటం శ్రీరంగం, లక్కాకుల నరసయ్య, మున్నూరు కాపు పరపతి సంఘం అధ్యక్షులు శ్రీ మాసాడి శ్రీనివాస్, పరపతి సంఘం కోశాధికారి కముటం శ్రీధర్, మరియు మున్నూరుకాపు సాంకేతిక విభాగం అధ్యక్షుడు పిన్ని రాము (న్యాయవాది) , బొల్లు సోమేష్ , లక్ష్మణ్, బండి రంజిత్, కొణతం రాంచందర్, మాసాడి అశోక్, తోట మోహన్, మార్తా సతీష్ తదితరులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ, యువత సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు, మున్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ కేసముద్రం యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..