15/11/2025
హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య గారు 21 సంవత్సరాల విశిష్ట సేవ అనంతరం పదవీ విరమణ
మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ విభాగానికి చెందిన హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య (నంబర్ 592) గారు 21 సంవత్సరాల విశిష్ట సేవ అనంతరం ఈరోజు పదవీ విరమణ (రిటైర్మెంట్) పొందారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ —
“హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య గారు తమ విధులను నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వర్తించారు. పోలీస్ శాఖలో ఆయన సేవలు స్ఫూర్తిదాయకమైనవి. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని జిల్లా పోలీస్ శాఖ తరఫున ఆకాంక్షిస్తున్నాను,” అని తెలిపారు.
పోలీస్ శాఖ తరఫున హోంగార్డ్ ఎస్. లక్ష్మయ్య గారికి సన్మానం నిర్వహించబడింది.
ఆయన సేవలకు గుర్తింపుగా స్మారక చిహ్నం అందజేయబడింది.
ఈ కార్యక్రమంలో హోమ్ గార్డ్ కమాండెంట్ వెంకటేశ్వర్లు గారు, అడిషనల్ ఎస్పీ ఎన్.బి. రత్నం గారు, డి.ఎస్.పి DCRB జి.వి. రమణారెడ్డి డి.ఎస్.పి DTC గిరిబాబు ఆర్‌ఐలు నగేష్, కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐ ఇందిరా, ఇతర హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
Telangana State Police