Mahabubnagar District Police

Mahabubnagar District Police Mahabubnagar District Police

భరోసా కేంద్రం – ఒకే చోట అన్ని సేవలు” పోస్టర్‌ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్బాధితులకు రక్షణ, వైద్యం, న్యాయ...
02/09/2026

భరోసా కేంద్రం – ఒకే చోట అన్ని సేవలు” పోస్టర్‌ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

బాధితులకు రక్షణ, వైద్యం, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌తో పాటు పునరావాసం

మహిళలు, బాలికలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట సమగ్ర సేవలు అందించడమే భరోసా కేంద్రం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలకు అందిస్తున్న సేవలను వివరిస్తూ రూపొందించిన “భరోసా కేంద్రం – ఒకే చోట అన్ని సేవలు” పోస్టర్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మహిళలు, బాలికల భద్రత, రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను, భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. బాధితులకు తక్షణ రక్షణ కల్పించడంతో పాటు, వారి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భరోసా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు.
భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్, పోలీస్ సహాయం, వైద్య సహాయం, న్యాయ సలహాలు, పునరావాసం, విద్యా–ఉపాధి సంబంధిత సహాయం వంటి సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వివరించారు. ముఖ్యంగా బాధిత మహిళలు, బాలికలకు మానసిక ధైర్యం కల్పించి, వారు తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించేలా అవసరమైన సహాయ సహకారాలను అందించడం భరోసా కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు.
“బాధిత మహిళలు, బాలికలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా ముందుకు రావాలి. వారికి అండగా పోలీస్ శాఖ, భరోసా కేంద్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. బాధితులకు రక్షణ, న్యాయం, భద్రతతో పాటు భవిష్యత్తుపై నమ్మకం కల్పించడమే మా లక్ష్యం” అని ఎస్పీ తెలిపారు.
అలాగే మహిళలు, బాలికలపై వేధింపులు, హింస, లైంగిక దాడులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులను లేదా భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. బాధితుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని సమన్వయంతో అందిస్తామని తెలిపారు.
భరోసా కేంద్రం అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పోస్టర్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మహిళ, ప్రతి బాలికకు భద్రత, గౌరవం, న్యాయం అందేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణయ్య, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ నర్సింలు, భరోసా ఇన్‌చార్జి సబ్‌ఇన్‌స్పెక్టర్ అరుణ, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ జాగృక్త దివాస్ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమండిజిటల్ పేమెంట్స్‌లో అప్రమత్తతే సైబర్ మోసాల ...
02/09/2026

సైబర్ జాగృక్త దివాస్ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

డిజిటల్ పేమెంట్స్‌లో అప్రమత్తతే సైబర్ మోసాల నివారణకు ప్రధాన రక్షణ

ఆన్‌లైన్ షాపింగ్, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

వినాయక మండపాలలో సైబర్ అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలి.

విద్యార్థులకు సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు – జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌరవ శ్రీ సి.వి.ఆనంద్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ తెలిపారు.

సైబర్ జాగృక్త దివాస్ సందర్భంగా బుధవారం జడ్చర్ల పట్టణంలోని డాక్టర్ BRR డిగ్రీ కళాశాలలో సుమారు 400 మంది విద్యార్థులకు నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డిజిటల్ పేమెంట్స్ & డిజిటల్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై విద్యార్థులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

డిజిటల్ పేమెంట్స్ & డిజిటల్ సెక్యూరిటీ:
డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం/సీవీవీ, బ్యాంక్ ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించరాదని తెలిపారు. తెలియని వ్యక్తులు పంపించే లింకులు, క్యూఆర్ కోడ్‌లు, అనుమానాస్పద యాప్‌లను ఉపయోగించరాదని, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన సందేశాలు, నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేసే సమయంలో నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ ఆఫర్లు, తక్కువ ధరల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తెలియని వెబ్‌సైట్లు లేదా వ్యక్తులకు ముందస్తుగా డబ్బులు చెల్లించే ముందు వాటి విశ్వసనీయతను పరిశీలించాలని సూచించారు.

ఆన్‌లైన్ పెట్టుబడులు, ట్రేడింగ్, అధిక లాభాల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులు, సోషల్ మీడియా గ్రూపులు, అనుమానాస్పద యాప్‌లు, లింకులను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థ విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించాలని తెలిపారు.

విద్యార్థులు సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో తమ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్, పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ సమాచారం, వ్యక్తిగత ఫొటోలు, లొకేషన్ వంటి సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని ఎస్పీ సూచించారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్‌లు, లింకులను అంగీకరించకుండా జాగ్రత్త వహించాలని, బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకుని టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించాలని తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ కాకుండా ప్రైవసీ సెట్టింగులను సక్రమంగా నిర్వహించుకోవాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే National Cyber Crime Reporting Portal (NCRP)లో ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. మోసం జరిగిన వెంటనే స్పందిస్తే నగదు రికవరీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.

సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తాము అప్రమత్తంగా ఉండటంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం, సైబర్ మోసం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడం ద్వారా సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు.

అనంతరం TGCSB వారు విడుదల చేసిన సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రత్యేక వినాయక పోస్టర్లను జిల్లా ఎస్పీ గారు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాబోయే వినాయక చవితి సందర్భంగా జిల్లాలోని ప్రతి వినాయక మండపం వద్ద ఈ పోస్టర్లను ఏర్పాటు చేసి ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

వినాయక మండపాలకు దర్శనం కోసం వచ్చే భక్తులు, ప్రజలు ఈ పోస్టర్లను చూసి ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన పొందే అవకాశం ఉంటుందని, తద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు సైబర్ భద్రతపై సందేశాన్ని చేరవేయవచ్చని ఎస్పీ గారు తెలిపారు. ప్రతి వినాయక మండపం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే వేదికగా మారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని ప్రతి ఒక్కరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేయడం పోలీసు శాఖ బాధ్యత అని, ప్రజల సహకారంతోనే సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ గిరికుమార్, జడ్చర్ల ఇన్‌స్పెక్టర్ కమలాకర్, కళాశాల ప్రిన్సిపల్ సుకన్య, వైస్ ప్రిన్సిపాల్స్ నర్మదా, శ్రీనివాసులు, సైబర్ క్రైమ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రావణ్ కుమార్, D4C సిబ్బంది మరియు సైబర్ వారియర్స్ పాల్గొన్నారు.

02/09/2026

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్–AHTU ప్రత్యేక నిఘావిద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు, రద్దీ ప్రాంతాల్లో నిరంత...
01/09/2026

మహిళలు, బాలికల భద్రతకు షీ టీమ్స్–AHTU ప్రత్యేక నిఘా

విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్

మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు తెలిపారు.

ఆగస్టు నెలలో షీ టీమ్స్‌కు 20 ఫిర్యాదులు అందగా, 18 మందికి కౌన్సెలింగ్, 17 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకోవడం, 3 epetty కేసులు నమోదు చేశారు. 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 70 హాట్‌స్పాట్ ప్రాంతాల్లో నిఘా కొనసాగించారు.

విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో సివిల్ దుస్తుల్లో నిఘా నిర్వహిస్తూ, ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్, POCSO, సైబర్ నేరాలు, బాల్యవివాహాలు, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, సెల్ఫ్ డిఫెన్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

మహిళలు, బాలికలను ఎవరైనా వేధించినా, అవహేళనగా మాట్లాడినా లేదా వెంబడించినా వెంటనే షీ టీమ్ నంబర్ 8712659365 లేదా డయల్-100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థపై AHTU నిఘా

ఆగస్టు నెలలో AHTU బృందం మరియు సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో 18 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, బాలల అక్రమ దత్తత, మహిళలు–బాలికలపై నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

మైనర్ పిల్లలను పనిలో పెట్టుకోవడం, పిల్లలను అమ్మడం–కొనడం లేదా అక్రమంగా దత్తతకు మధ్యవర్తిత్వం చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. పిల్లలను దత్తత తీసుకునే వారు ప్రభుత్వం నిర్దేశించిన CARA విధానం ద్వారా మాత్రమే దత్తత ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

ఈ అంశాలకు సంబంధించి సమాచారం లేదా ఫిర్యాదుల కోసం డయల్-100, AHTU నంబర్ 8712680066 లేదా చైల్డ్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని, సమాచారదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

01/09/2026

నూతనంగా ఏర్పాటైన జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారునూతన కమిటీ సభ్యులక...
31/08/2026

నూతనంగా ఏర్పాటైన జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు

నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపైన జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు

సోమవారం నూతనంగా ఏర్పాటైన మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన సభ్యులు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారిని జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన కమిటీ ఏర్పాటైన విషయాన్ని తెలియజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యారసాని సురేష్, హెడ్ కానిస్టేబుల్, వైస్ ప్రెసిడెంట్లు వై.అశోక్ కుమార్, ఆర్ఐ, కె.వెంకటేష్, ఎస్‌ఐ–హన్వాడ, సెక్రటరీ ఎం.అప్పయ్య, మహబూబ్‌నగర్ వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్, జాయింట్ సెక్రటరీ జి.పవన్ కుమార్ గౌడ్, పీసీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.యాదగిరయ్య గౌడ్, ఏఆర్ఎస్‌ఐ, ట్రెజరర్ బి.శేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పోతురాజు యాదయ్య, ఏఆర్‌హెచ్‌సీ, ఏ.రవికుమార్, హెడ్ కానిస్టేబుల్, జె.రాఘవేందర్, పీసీ, ఎల్.రాజేశ్వర్ రెడ్డి, పీసీ, ఎస్.పద్మమ్మ, డబ్ల్యూపీసీ, టి.సురేష్, ఏఆర్‌పీసీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్యారసాని సురేష్ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది మరియు అధికారులకు అసోసియేషన్ ఒక అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జిల్లా ఎస్పీ గారికి తెలిపారు. అసోసియేషన్ సభ్యులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ పోలీసు శాఖ అభివృద్ధికి, సిబ్బంది సంక్షేమానికి తమ వంతు సహకారం అందిస్తారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అసోసియేషన్ సిబ్బంది సంక్షేమం, సమస్యల పరిష్కారం, శాఖలో సమన్వయం పెంపొందించే దిశగా నిర్మాణాత్మకంగా పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధులు, పరస్పర సహకారం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, సిబ్బంది సమస్యలను సరైన విధానంలో అధికారుల దృష్టికి తీసుకురావడంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషించాలని తెలిపారు.

అలాగే పోలీసు అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం, పరస్పర గౌరవం, టీమ్ స్పిరిట్ మరింత బలోపేతం కావాలని, పోలీసు శాఖ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ గారు సూచించారు. నూతన కమిటీకి తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బి రత్నం, DCRB DSP రమణా రెడ్డి కూడా పాల్గొన్నారు.

సుదీర్ఘ పోలీసు సేవలకు ఘన సన్మానం – నలుగురు అధికారులకు పదవీ విరమణ వీడ్కోలుజిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానికి, ఐపీఎస్.మహబూబ్‌న...
31/08/2026

సుదీర్ఘ పోలీసు సేవలకు ఘన సన్మానం – నలుగురు అధికారులకు పదవీ విరమణ వీడ్కోలు

జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానికి, ఐపీఎస్.

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం నలుగురు పోలీసు అధికారులు పదవీ విరమణ పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పదవీ విరమణ పొందిన వారిలో శ్యామ్ సుందర్, ఎస్‌ఐ, డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్ 42 సంవత్సరాలు, యాసిన్, ఎస్‌ఐ, సీసీఎస్ 37 సంవత్సరాలు, మద్దలేటి, ఏఆర్‌ఎస్‌ఐ, డీఏఆర్ మహబూబ్‌నగర్ 37 సంవత్సరాలు, శ్రీనివాసులు, హెచ్‌సీ–1288, నవాబుపేట పోలీస్ స్టేషన్ 35 సంవత్సరాల పాటు పోలీసు శాఖలో సేవలందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ, పోలీసు శాఖలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి ప్రజలకు సేవలందించిన పదవీ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పోలీసు శాఖకు అంకితభావంతో సేవలందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితానికి ముగింపు మాత్రమేనని, కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన జీవితాన్ని గడపడానికి ఇది ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభమని ఎస్పీ గారు అన్నారు. ఇంతకాలం పోలీసు శాఖకు అందించిన సేవలను ఎప్పటికీ మరువలేమని, వారి అనుభవాలు, సేవలు పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. వారి భవిష్యత్ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బి రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, AO రుక్మిణి భాయ్, SP CC రామ్ రెడ్డి, ఆర్‌ఐలు కృష్ణయ్య, అశోక్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సీనయ్య, ఆఫీస్ సూపరింటెండెంట్ లు మధు, బాలరాజు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మరియు పదవీ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలుముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదు – జిల్లా ...
31/08/2026

జిల్లా వ్యాప్తంగా 30-పోలీస్ యాక్ట్ అమలు

ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించరాదు – జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్

మహబూబ్‌నగర్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని 01 సెప్టెంబర్ 2026 నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ సెక్షన్–30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

సెక్షన్–30 అమలులో ఉన్న కాలంలో సంబంధిత పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు, సమావేశాలు లేదా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ సూచించారు.

నిబంధనలను ఉల్లంఘించి ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అదేవిధంగా సోషల్ మీడియా వేదికల ద్వారా తప్పుడు ప్రచారం, వదంతులు, మత విద్వేషాలు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు, వీడియోలు, సందేశాలను ప్రచారం లేదా ప్రసారం చేసే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని, సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా ఇతర బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలనుకునే వారు సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని జిల్లా ఎస్పీ సూచించారు.

జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజా ప్రశాంతత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన మల్టీజోన్-II ఐజీ శ్రీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్వార్షిక తనిఖీల్లో భాగం...
31/08/2026

భూత్పూర్ సర్కిల్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించిన మల్టీజోన్-II ఐజీ శ్రీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్

వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం మల్టీజోన్-II ఐజీ శ్రీ షానవాజ్ ఖాసిం, ఐపీఎస్ గారు భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.

తనిఖీలో భాగంగా సర్కిల్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ముఖ్యమైన రికార్డులు, రిజిస్టర్లు, కేసు డైరీలు, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కోర్టు కేసులు, వారెంట్లు, సీసీటీఎన్‌ఎస్‌/ఆన్‌లైన్ రికార్డులు మరియు ఇతర పోలీసు సంబంధిత రికార్డుల నిర్వహణను ఐజీ గారు పరిశీలించారు.

అలాగే సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తు నాణ్యత, నేరస్థులపై నిఘా, రౌడీషీటర్ల పర్యవేక్షణ, వారెంట్ల అమలు, బీట్ పెట్రోలింగ్, రాత్రి గస్తీ, మహిళలు మరియు బాలల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై ఐజీ గారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తన పరిధిలోని పోలీస్ స్టేషన్లను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, సిబ్బందికి సరైన మార్గనిర్దేశం చేయడం, కేసుల దర్యాప్తును పర్యవేక్షించడం, పెండింగ్ కేసులను తగ్గించడం, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం, ప్రజలతో సమన్వయంతో పనిచేయడం వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఐజీ గారు సూచించారు.

కేసుల దర్యాప్తులో సాక్ష్యాల సేకరణ, కేసుల నాణ్యత, దర్యాప్తు వేగం, కోర్టు ట్రయల్స్‌పై పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు అధికారులు సమర్థవంతంగా పనిచేసేలా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అదేవిధంగా ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడం, ఫిర్యాదులపై సత్వర స్పందన, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించడం, సిబ్బంది క్రమశిక్షణ మరియు సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఐజీ గారు పలు సూచనలు చేశారు.

తనిఖీ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, జిల్లాలోని అందరూ ఇన్స్పెక్టర్లు, భూత్పూర్ సర్కిల్ పరిధిలోని సబ్‌ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Address

Opp Union Bank Main Branch
Mahabubnagar
509001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahabubnagar District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share