Mancherial Traffic PS

Mancherial Traffic PS MANCHERIAL TRAFFIC POLICE STATION OF RAMAGUNDAM POLICE COMMISSIONERATE

*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి పైన స్వయంగా గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది* *మీ రక్షనే మా బాధ్యత*ఇట...
31/08/2021

*మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి పైన స్వయంగా గుంతలు పూడ్చిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది*

*మీ రక్షనే మా బాధ్యత*

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి పైన ఏర్పడిన గుంతల వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని, ఇట్టి విషయాన్ని R&B అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా, ఆర్అండ్బి అధికారులు కూడా స్పందించి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బ్రిడ్జి పైన ఏర్పడిన గుంతలను పూడ్చివేసినారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి రాజు గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది, R & B అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ వర్షాకాలంలో వాహదారులు ట్రాఫిక్ నియమాలను తప్పక పాటిస్తూ, తమ వాహనాలను నెమ్మదిగా నడపాలని, విధిగా హెల్మెట్ ధరించాలని, వాహనంకు వాహనంకు మధ్య దూరం పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

*ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ మరియు మాస్క్ వాడకంపై అవగాహన మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు*...
19/07/2021

*ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ మరియు మాస్క్ వాడకంపై అవగాహన మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు*

*హెల్మెట్ వాడండి మీ ప్రాణాలని కాపడుకోండి*

రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని I B చౌరస్తాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు...

ద్విచక్ర వాహనాలదారులు బయటకు వస్తే కచ్చితంగా హెల్మెట్ ధరించాలాని, అనుకోని ప్రమాదం ఏర్పడినప్పుడు హెల్మెట్ మీ ప్రాణాలను కాపాడుతుందని వాహన దారులకు అవగాహన కల్పించారు. ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతిఒక్కరు విధిగా మాస్క్ ధరించి కోవిడ్19 వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషిచేయాలని సూచించారు. ఈ రోజు హెల్మెట్ మరియు మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న 60 మంది వాహనదారులకు ib చౌరస్తాలో కౌన్సిలింగ్ నిర్వహించారు.మరల హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే వాహనము జప్తు చేసి, ఫైన్ విధించబడును అని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇట్లు,
బి. రాజు,
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్,
మంచిర్యాల.

*మానవత్వం చాటుకున్న మంచిర్యాల పోలీసులు*తేదీ 30-05-2021 ఉదయం మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజు గారు, ట్రాఫిక్ ఎస్ఐ...
30/05/2021

*మానవత్వం చాటుకున్న మంచిర్యాల పోలీసులు*

తేదీ 30-05-2021 ఉదయం మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజు గారు, ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ మరియు ట్రాఫిక్ సిబ్బంది ఐబి చౌరస్తా వద్ద విధులు నిర్వహించుచుండగా అటుగా నడుచుకుంటూ వస్తున్న వలస కూలీలను గమనించి వారిని వివరాలు అడుగగా వారు రైస్ మిల్లులో పనిచేసే వలస కూలిలమని, నిర్మల్ లో పనులు ముగించుకొని తదుపరి పనుల నిమిత్తం మా కుటుంబాలతో సహ మంథనికి వెళ్తున్నామని, లోక్డౌన్ వాళ్ళ వాహనాలు దొరకక నిర్మల్ నుండి నడుచుకుంటూ వస్తున్నమని తెలుపగా వారి యొక్క దీనస్థితిని గమనించి సుమారు 40 మందికి భోజనం అందించి, వారికి వాహన సదుపాయం కల్పించి వారి గమ్యస్థానం మంథని వరకు పంపించటం జరిగినది. వలసకులీలు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసారు. కరోన కష్ట కాలంలో అందరికి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులను పలువురు కొనియాడారు.

*మానవత్వం చాటుకున్న మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు* వివరాల్లోకి వెళితే ఈ రోజు 13.05.2021నాడు చెన్నూరు మండలం అంగ్రజుపల్లి ను...
13/05/2021

*మానవత్వం చాటుకున్న మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు*

వివరాల్లోకి వెళితే ఈ రోజు 13.05.2021నాడు చెన్నూరు మండలం అంగ్రజుపల్లి నుంచి సింగిరెడ్డి లావణ్య w/౦ సతీష్, అనే 9 నెలల నిండు గర్భిణీ,తల్లితో సహా తన వైద్యం నిమిత్తం మంచిర్యాలకు రాగా, తన చికిత్స పూర్తి చేసుకునే సరికి ఆలస్యం అవగా, తనకు ప్రయాణం నిమిత్తం ఏమి దొరకగా ఇబ్బందులు పడుతు మంచిర్యాలలోని IB చౌరస్తాలో వేచిఉండగా , అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ K. శ్రీనివాస్ , pc 3061వారిని గమనించి, గర్భిణికి తన నిమిత్తం తెచ్చుకున్న అల్పాహారం, జూస్ను అందిచినారు. అనంతరం అక్కడే విధుల్లో ఉన్న బి. శ్రీనివాస్, AsI 106 గారు ఒక ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసి వారిని చెన్నూరు పంపించే ఏర్పాటు చేసి తన గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకొందా అనేది వాకబు చేసినారు. . ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్ఫె బి.రాజు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ IPS గారు, డి సి పి ఉదయ్ కుమార్ రెడ్డి గారు సూచనల మేరకు ACP మంచిర్యాల అఖిల్ మహాజన్ IPS గారు, ట్రాఫిక్ ACP బాలరాజు ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలుపరుస్తు మహిళల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ లోక్డౌన్ వేళా ప్రయాణం అలస్యమయ్యే ఇబ్బందీ పడుతున్న నిండు గర్భిణి కి సహాయం చేసి అందరికి ఆదర్శంగా నిలిచిన మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులను అందరూ ప్రశంసించారు.

ఇట్లు,
బి. రాజు,
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్,
మంచిర్యాల.

*కరోనా వ్యాధి గ్రస్తులలో మనోధైర్యం నింపి అండగా నిలుస్తున్న మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్*కరోనా సోకిన వ్యాధిగ్రస్తులంటే...
06/05/2021

*కరోనా వ్యాధి గ్రస్తులలో మనోధైర్యం నింపి అండగా నిలుస్తున్న మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్*

కరోనా సోకిన వ్యాధిగ్రస్తులంటేనే ఆమడ దూరం నుంచి చూడడానికి కూడా ముందుకు రాని భయానక పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా బారిన పడిన పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజు అండగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే... ట్రాఫిక్ కానిస్టేబుల్ సుధాకర్(పిసి-306) భార్య కరోనా సోకి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ సిఐ రాజు ఆమె చికిత్స పొందుతున్న మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డితో పాటు అతని భార్యను పరామర్శించారు. ఎలాంటి అధైర్యపడొద్దని, అండగా తామున్నామంటూ మనో ధైర్యం నింపారు, చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్ఫె బి.రాజు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలిపారు. కరోనా విషయంలో సిబ్బంది ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా తోటి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్న సమయంలో కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజు ఔదార్యం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.

28/04/2021
మంచిర్యాల జిల్లా ఏర్పడిన తరువాత   పెరుగుతున్న ట్రాఫిక్ ను  నియంత్రించడానికి అనునిత్యం కష్టపడుతున్న  రామగుండము పోలీస్ కమి...
04/04/2021

మంచిర్యాల జిల్లా ఏర్పడిన తరువాత పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించడానికి అనునిత్యం కష్టపడుతున్న రామగుండము పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ విభాగం ముక్యంగా మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ ల సేవలు గుర్తించి లయన్స్ క్లబ్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి కూలింగ్ సన్ గ్లాసెస్ మరియు ట్రాఫిక్ నియంత్రణ పరికరము లైన 30 కోన్స్ ను ఈ రోజు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ట్రాఫిక్ ACP బాలరాజు గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది కి అందించడం జరిగింది.

ట్రాఫిక్ నియంత్రణ లో భాగంగా రోడ్డుపై ఉన్నప్పుడు దుమ్ము, ధూళి మరియు ఎండ తాకిడికి సిబ్బంది కంటి సమస్యలు ఎదుర్కొనకుండా ఉండడానికి సిబ్బందికి అందించామని లయన్స్ క్లబ్ మెంబెర్స్ తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు,ZC రాజమౌళి గారూ, శ్రీ బాలరాజు, ట్రాఫిక్ ACP రామగుండం గారు, ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మరియు SI లు శివకేశవులు, సురేందర్, జాహెరుద్దీన్ మరియు ట్రాఫిక్ ASI, HC, PC మరియు HG లు పాల్గొన్నారు.

ఇట్లు
టి . ప్రవీణ్ కుమార్
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
మంచిర్యాల.

Traffic awareness program in gutdipeta battalion mancherial.  By traffic ACP @ Traffic Inspector
17/02/2021

Traffic awareness program in gutdipeta battalion mancherial. By traffic ACP @ Traffic Inspector

*32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంచిర్యాల  హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించి, మహిళల తో హెల్మ...
04/02/2021

*32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంచిర్యాల హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించి, మహిళల తో హెల్మెట్ తో ర్యాలీ నిర్వహించిన ట్రాఫిక్ ACP బాలరాజు గారు, సీఐ. ప్రవీణ్ కుమార్*

32 వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం మంచిర్యాల పట్టణంలో హెల్మెట్ యొక్క ఉపయోగాల గురించి అవగాహన కల్పించి, అనంతరం హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

*తప్పిపోయిన బాలుడిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ట్రాఫిక్ పోలీస్*.తేదీ 27.1.2021 నాడు ఉదయం 11.30 గం మంచిర్యాల జిల...
27/01/2021

*తప్పిపోయిన బాలుడిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ట్రాఫిక్ పోలీస్*.
తేదీ 27.1.2021 నాడు ఉదయం 11.30 గం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎం.సదన్న, PC 3362, అక్కడే తప్పిపోయి తిరుగుతున్నటువంటి మూడేళ్ల బాలుడి గమనించి బాలుని వివరాలు కనుక్కొని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు.వివరాల్లోకెళ్తే Md. రహీం( ఆటో డ్రైవర్), షాహీన దంపతులు మంచిర్యాల అశోక్ రోడ్ లో నివసిస్తున్నారు. వారికి అష్రాఫ్ అనే మూడేళ్ళ బాలుడు కలడు. ఈరోజు కూరగాయల నిమిత్తం షహీన మంచిర్యాల మార్కెట్ కు రాగా తనతో పాటు తన కుమారుని వెంట తెచ్చుకుంది. కూరగాయలు కొంటున్న సమయంలో బాలుడు తప్పిపోయినాడు అక్కడినుంచి ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి రాగా అది గమనించిన మంచిర్యాల ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరకు తీసుకుని అతని వివరాలు కనుక్కొని తిరిగి క్షేమంగా తన తల్లిదండ్రులు అప్పగించినాడు. బాలుని తల్లిదండ్రులు ట్రాఫిక్ పోలీసులకు ధన్యవాదాలు తెలియచేసారు.
ఇట్లు,
ప్రవీణ్ కుమార్,
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, మంచిర్యాల.

Address

Mancherial
504208

Website

Alerts

Be the first to know and let us send you an email when Mancherial Traffic PS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mancherial Traffic PS:

Share