16/07/2026
*తాడేపల్లి ముస్లిం స్మశాన వాటిక 'జన్నతుల్ బఖీ' లో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో ఆధునిక సౌకర్యాలు*
*అభివృద్ధి చేసిన పనులకు ప్రారంభించిన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మాజీ మండలి ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్*
తాడేపల్లి, జూలై 16 : తాడేపల్లి మండలం పోలకంపాడులోని ముస్లిం స్మశాన వాటిక "జన్నతుల్ బఖీ"లో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తన సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో, వాటిని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, శాసన మండలి మాజీ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వ్యవహారాల నేత మహ్మద్ అహ్మద్ షరీఫ్ ప్రారంభించారు.
ముస్లిం సోదరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్మశాన వాటికలో ప్రహరీ గోడ, ఆకర్షణీయమైన ముఖద్వారం, ఆరు మినార్లు, వజూ ఖానా, గ్రీనరీ, కార్యాలయ గది, స్టోర్ రూమ్, వాచ్‌మన్ గది,ఐ మాక్స్ లైటింగ్, అంతర్గత మౌలిక సదుపాయాలు, విశ్రాంతి కోసం సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడంతో పాటు, 80 ట్రక్కుల మట్టితో లెవెలింగ్ పనులు చేపట్టి అంతిమ సంస్కారాలకు వచ్చే కుటుంబ సభ్యులకు గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పించారు.
ఈ సందర్భంగా ముస్లిం కుటుంబాలు, మత పెద్దలు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ, ప్రతి మనిషి జీవితంలోని చివరి ఘట్టమైన అంతిమ సంస్కారాలు గౌరవప్రదంగా, సంప్రదాయబద్ధంగా జరిగేలా అవసరమైన సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో మంత్రి నారా లోకేష్ ఈ పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ముస్లిం సమాజం అవసరాలను గుర్తించి అన్ని హంగులతో స్మశాన వాటికను అభివృద్ధి చేయించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శాసన మండలి మాజీ ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవిస్తూ అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. సొంత నిధులతో ముస్లిం స్మశాన వాటికను అభివృద్ధి చేయించడం ఆయన సేవాభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంగళగిరి ప్రజలు అలాంటి సమర్థ నాయకుడిని ఎన్నుకోవడం అదృష్టమని, చివరి మజిలీ కూడా గౌరవప్రదంగా జరిగేలా లోకేష్ చొరవ తీసుకోవడం ప్రశంసనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, ప్రధాన కార్యదర్శి దార దాసు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా, ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షుబ్లీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండీ ఇబ్రహీం, స్టేట్ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ అక్రమ్, స్టేట్ హజ్ కమిటీ సభ్యులు షేక్ జబిన్,పఠాన్ ఖాసీం ఖాన్,షేక్ రియాజ్, అబ్దుల్ మజీద్, ఎండీ నిజాముద్దీన్,పఠాన్ జానీ ఖాన్, ఫిరోజ్,షేక్ హన్నన్,అబ్దుల్లా ఖాన్,షేక్ సుభాని, నాగుల్ మీరా, చాంద్ బాషా, మస్తాన్ వలి, దుబాయ్ మస్తాన్, జామియా మస్జీద్, నూరాని మస్జీద్, మామూర్ మస్జీద్, పోలకంపాడు మక్కా మస్జీద్ కమిటీల సభ్యులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.