04/06/2026
"లక్షల కుటుంబాల అభివృద్ధికి ఆధారం... ఎంఎస్ఎంఈలు!"
భారీ పరిశ్రమలు దేశానికి ప్రతిష్టను తీసుకువస్తే, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తూ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదిగా నిలుస్తున్నాయి.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నట్లుగా, భారత పరిశ్రమల అభివృద్ధిలో ఎంఎస్ఎంఈల పాత్ర అత్యంత కీలకమైనది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే కాకుండా, దేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న రంగంగా నిలిచాయి.
ఒక చిన్న ఆలోచనను విజయవంతమైన వ్యాపారంగా, ఒక వ్యాపారాన్ని పెద్ద పరిశ్రమగా తీర్చిదిద్దే శక్తి ఎంఎస్ఎంఈలకు ఉంది. స్థానిక వనరులను వినియోగిస్తూ, యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఈ రంగం కీలకంగా మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, కొత్త అవకాశాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది.
ఎంఎస్ఎంఈల బలోపేతం... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలమైన అడుగు.