Bhavisyathuku Guarantee

Bhavisyathuku Guarantee సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు

24/04/2025

We are delighted to announce the inauguration of the Thalassemia Care Centre at NTR Memorial Trust on 25th April 2025. This new centre reflects our ongoing dedication to the well-being of children and families living with thalassemia, providing access to compassionate care, advanced treatment, and renewed hope for a brighter future.

24/04/2025

"ఆరోగ్యకరమైన జీవితం కోసం
సరైన ఆహరం - సరైన విటమిన్లు"

మీ ఆరోగ్యం మీ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు, మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయి. మంచి ఆహారం, మంచి జీవితం!

"భవిష్యత్తుకి గ్యారంటీ చైతన్యరథ" యాత్రలో భాగంగా బాపట్ల రూరల్ మండలం వెదుళ్లపల్లిలో అక్రమ ఇసుక తవ్వకాలను తెలుగుదేశం పార్టీ...
22/07/2023

"భవిష్యత్తుకి గ్యారంటీ చైతన్యరథ" యాత్రలో భాగంగా బాపట్ల రూరల్ మండలం వెదుళ్లపల్లిలో అక్రమ ఇసుక తవ్వకాలను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి బినామీలు నిబంధనలు తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టి పెద్దఎత్తున ఇసుక తవ్వకాలతో కోట్లు దండుకుంటున్నారు. అడ్డదిడ్డంగా యంత్రాలతో ఇష్టారాజ్యంగా పరిమితికి మించి తవ్వకాలు చేపడుతూ పెద్ద, పెద్ద గోతులు చేస్తున్నారు. 50 నుంచి 60 అడుగుల మేర ఇసుక తవ్వకాలు జరుపుతూ ప్రమాదకరంగా వదిలేస్తున్నారు.







L

19/07/2023
పత్రికా ప్రకటన 19.07.2023నేరస్తుల్ని వదిలి బాధితులపై కేసులా? దాడి చేసిందెవరో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే ఆగ...
19/07/2023

పత్రికా ప్రకటన
19.07.2023
నేరస్తుల్ని వదిలి బాధితులపై కేసులా? దాడి చేసిందెవరో నరసరావుపేట ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే ఆగడాలు డీజీపీకి కనిపించడం లేదా?

దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యేని వదిలేసి బాధితులపై హత్యా యత్నం కేసులు పెట్టడం దుర్మార్గం. అప్రజాస్వామికం. అభివృద్ధికి మారుపేరైన నరసరావుపేటను అరాచకాలకు అడ్డాగా మార్చారు. పట్టపగలే దాడులు, విధ్వంసాలతో బీభత్సం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసుల రెడ్డిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితులైన డాక్టర్ అరవింద్ బాబు, పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం వైసీపీ దిగజారుడు చర్యలకు నిదర్శనం. డీజీపీ దృష్టిలో బాధితులే నిందితులా? పోలీసు వ్యవస్థను వైసీపీ నేతల జేబు సంస్థగా వాడుకుంటున్నారు. కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారా? రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో వందల మంది రౌడీ మూకను తీసుకుని టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు దిగడం వాస్తవం కాదా? ఎవరి ఇళ్లపై ఎవరు దాడి చేశారో, ఎవరిని ఎవరు హత్య చేయదలిచారో కూడా తెలియని దుస్థితిలో పోలీసులు ఉన్నారా? అధికార పార్టీ నాయకులు ఏం చెబితే అది చేయడం తప్ప.. చట్టాన్ని కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. నాలుగేళ్లుగా దాడులు దౌర్జన్యాలతో రాష్ట్రాన్ని రక్తసిక్తం చేసిన అధికార పార్టీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. తక్షణమే నరసరావుపేట ఘటనలో అసలు నిందితులపై చర్యలు తీసుకోవాలి.

కింజరాపు అచ్చెన్నాయుడు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

12/07/2023

నిరుపేద ఎస్టీలపై వైసీపీ పెత్తందార్ల దౌర్జన్యం ఇది. బాపట్ల జిల్లా, సూర్యలంకలో యానాది కుటుంబాలు నివసిస్తున్న గుడిసెలను రాత్రికి రాత్రి కూల్చేయించాడు వైసీపీ నేత చెంచయ్య. సామాన్లను చెల్లాచెదురు చేయించాడు. ఎస్టీలపై అంత పగ ఎందుకు ఈ ప్రభుత్వానికి?









12/07/2023

నేరేడు పండు-యొక్క ఆరోగ్య ప్రయోజనాలు


కందుకూరి వారి సంస్కారం, గురజాడవారి ప్రబోధం, అల్లూరి విప్లవం, టంగుటూరి నిబ్బరం, అమరజీవి త్యాగం తెలుగుజాతిలో పెంచడమే నా లక...
11/07/2023

కందుకూరి వారి సంస్కారం, గురజాడవారి ప్రబోధం, అల్లూరి విప్లవం, టంగుటూరి నిబ్బరం, అమరజీవి త్యాగం తెలుగుజాతిలో పెంచడమే నా లక్ష్యం అన్న ఎన్టీఆర్... ఈ మహానుభావులందరి సుగుణాలను పుణికిపుచ్చుకుని తెలుగువారికి ఆదర్శనీయ పాలనను అందించారు.

శకపురుషుడు "ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం" సందర్భంగా ఆ మహానుభావుని ఆశయాలను స్మరించుకుంటూ... తెలుగుదేశం శ్రేణులకు శుభోదయం!


10/07/2023


తెలుగుదేశం పార్టీ హామీల పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సాలూరు, రామచంద్రపురం, విజయవాడ (తూర్పు), మదనపల్లె నియోజకవర్గాల్లో తెల...
10/07/2023

తెలుగుదేశం పార్టీ హామీల పై ప్రజలకు అవగాహన కలిగిస్తూ
సాలూరు, రామచంద్రపురం, విజయవాడ (తూర్పు), మదనపల్లె నియోజకవర్గాల్లో తెలుగుదేశం నేతలు నిర్వహించిన " భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర" కార్యక్రమ చిత్రాలు



డ్రెయిన్లను కూడా వదలని వైకాపా బకాసురులు!రాష్ట్రంలో వైసిపి దొంగలు కబ్జాకు కాదేది అనర్హమంటూ యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్...
10/07/2023

డ్రెయిన్లను కూడా వదలని వైకాపా బకాసురులు!
రాష్ట్రంలో వైసిపి దొంగలు కబ్జాకు కాదేది అనర్హమంటూ యథేచ్చగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొండలు, గుట్టలు, శ్మశానాలు, డ్రెయిన్లను సైతం వదలకుండా మింగేస్తున్నారు. ఇది కావలి నియోజకవర్గం ఆములదిన్నె బిట్-2 పరిధిలో రోడ్డు వెంట ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు కాటా శ్రీనివాసరెడ్డి కొండపి డ్రెయిన్ ను పూడ్చేసి వేసిన లే అవుట్. రోడ్డును ఆనుకొని 15ఎకరాల డ్రెయిన్ ను ఆక్రమించడమేగాక 5 తూములను కూడా పూడ్చేశారు. ఫలితంగా రైతుల పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఎవరు ఏమైపోయినా ఫర్వాలేదు, తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నిండాలన్న జగన్ రెడ్డి గారి సిద్ధాంతాన్నే ఆయన సామంతరాజులు ఫాలో అవుతున్నారు. తమకు లైవ్ లో నరకం చూపిస్తున్న జె-గ్యాంగ్ కు చుక్కలు చూపించేందుకు జనం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Address

Mangalagiri

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavisyathuku Guarantee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share