తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు

  • Home
  • India
  • Mangalagiri
  • తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు

తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు TADEPALLI SAI KRISHNA SARMA PUROHITHULU (సనాతన వైదిక ధార్మిక ఆధ్యాత్మిక విషయాలు)

🙏🌹 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌹🌹🙏హరే కృష్ణ 🙏🌹 జై  #శ్రీకృష్ణ 🙏🌹ముందుగా అందరికీ🌹🌹🌹 శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 4/9/26 ...
03/09/2026

🙏🌹 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌹
🌹🙏హరే కృష్ణ 🙏🌹 జై #శ్రీకృష్ణ 🙏🌹ముందుగా అందరికీ🌹🌹🌹

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 4/9/26 💐💐🌹🌹

#దుష్టశిక్షణ శిష్టరక్షణార్థం భువిలో ఉద్భవించాడు భగవానుడు అనేక అవతారాలతో.... అందులో శ్రీకృష్ణునిగా పుట్టి పుడమిని వుద్ధరించాడు భగవద్గీతను బోధించి జగద్గురు అయినాడు 🙏🌹

శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీ ముఖ నామ సంవత్సరం #శ్రావణ #బహుళాష్టమి నాడు రాత్రి వృషభ లగ్నములో అభిజిత్ ముహూర్తములో రోహిణి నక్షత్రంలో జన్మించినట్లు పురాణ కథనం 🌹🙏

శ్రీకృష్ణ తల్లి దేవకీదేవి తండ్రి వసుదేవుడు 🌹🙏

శ్రీకృష్ణుని బాల లీలలు గూర్చి ఎన్నో అద్భుత కథలు ఉన్నాయి కంసుడు పంపగా పోతననే రాక్షసి కేచారి రేపల్లెకు వచ్చింది కామరూపిణియై ఇల్లు ఇల్లు వెతికి వెతికి నందుని గృహం చేరి సుందరి వేషంతో బాలకృష్ణుని అక్కుని చేర్చి పాలు ఇవ్వటానికి ఉపక్రమించింది ఆమె చనుగవ విషమయం శ్రీకృష్ణుడు సాధార శిశు మాత్రుడా? ఆమె చనువాలను మాత్రమే కాక ఆమె శరీర జవసత్వాల నీటిని పీల్చివేశాడు శ్రీకృష్ణుడు ఆమె నేలగులి ప్రాణాలు కోల్పోయింది 🌹🙏

#అల్లరికృష్ణుడు 🌹🙏 శ్రీకృష్ణుడు చిన్నతనంలో చేసిన అల్లరి ఇంటింతని వర్ణించనవిగానిది శ్రీకృష్ణుడు నవనీత చోరుడుగా జగత్ ప్రసిద్ధుడు 🌹🙏

ఒకనాడు అల్లరి చేస్తున్న శ్రీకృష్ణ తల్లి యశోద రోకలికి కట్టేసింది అతడు తల్లి కన్ను కప్పి రోకలిఇచ్చుకొని రెండు మద్ది చెట్ల మధ్యకు పోయాడు రోలు ఆరెండు చెట్ల మధ్య చిక్కుకుంది బాలకృష్ణ ముందుకు సాగిపోయాడు ఆ రెండు చెట్లు ఫెళ ఫెళ రావాలతో నేల కులాయి అవి వట్టి చెట్లు కావు నారద ముని శాపంచే కుబేర పుత్రుడు నలకుబేర మనిగ్రీవులు వృక్ష స్వరూపాలై బాలకృష్ణ స్పర్శ చె శాప విమోచనం పొందారు 🙏🌹

కృష్ణుడు అనే మాటకు ఆకర్షించేవాడు అని అర్థం ఆకర్షణ ఆయన స్వభావం ఆకర్షణ ఆయన స్వరూపం కృష్ణుని గురించి చదవటం ఆనందం చెప్పటం ఆనందం ఆయన గురించి ఆలోచించడం పరమానందం 🙏🌹

కృష్ణ భగవానుడు ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటు కృష్ణం వందే జగద్గురు 🙏🌹
— తాడేపల్లి సాయి కృష్ణ శర్మ గారు పురోహితులు

చతుర్వేదాల గురించి సూక్ష్మ వివరాలు -_ తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు
01/09/2026

చతుర్వేదాల గురించి సూక్ష్మ వివరాలు
-_ తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు

01/09/2026

నమః శంకరాయ 👏

25/06/2026

ఓం నమో నారాయణాయ 🙏

 #దశావతారాలు1.  మత్స్యావతారం - చేపనీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ  ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్...
21/06/2026

#దశావతారాలు

1. మత్స్యావతారం - చేప
నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో 'ప్రతికూల పరిస్థితుల్లో'నూ సంసారాన్ని ఈదాలి.

2. కూర్మావతారం - తాబేలు
అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి 'ధ్యానం' చేయాలి.

3. వరాహావతారం - వరాహం
ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే 'ఇంటి బాధ్యత'లను మొయ్యాలి.

4. నరసింహావతారం -
మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెందడాలి.

5. వామనావతారం -
మొదటి అడుగు భౌతికంగానూ,
రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ;
మరి మూడవ అడుగును మనలోని 'అహంకారాన్ని' గుర్తించి 'బలి' ఇవ్వాలి.

6. పరశురామావతారం -
'లక్ష్యం' కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.

7. రామావతారం -
'ధర్మ'యుతంగా జీవించాలి.

8. కృష్ణావతారం - ఎన్ని కష్టాలు ఎదురైనా 'ఆనందం'గా ఉండాలి.

9. బుద్ధావతారం -
'జ్ఞానాన్ని' పంచాలి.

10. కల్కి అవతారం -
సకల మానవాళి 'అజ్ఞానాన్ని తీసివేయాలి.
—తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు…

17/06/2026

I got over 700 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

24/05/2026
నామకరణ సంస్కారం.........!!“నామాఖిలస్య వ్యవహార హేతుఃశుభావహం కర్మసు భాగ్య హేతుఃనామ్నేవ కీర్తిః లభతే మనుష్యస్తతః ప్రశస్తం ఖ...
13/05/2026

నామకరణ సంస్కారం.........!!
“నామాఖిలస్య వ్యవహార హేతుః
శుభావహం కర్మసు భాగ్య హేతుః
నామ్నేవ కీర్తిః లభతే మనుష్య
స్తతః ప్రశస్తం ఖలు నామ కర్మ”

అని వీరమిత్రోదయ సంస్కార ప్రకాశికలో బృహస్పతి పేర్కొనటం జరిగింది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించటానికి పేరే కారణ మవుతుంది. తనదైన ప్రత్యేక నామం లేక సంజ్ఞ లేక పేరు లేక పోతే సమాజంలో వ్యవహరించటం కష్టం. పేరు వ్యవహారానికి వీలుగా ఉండటమే కాదు, శుభాలను, అదృష్టాన్ని కలిగిస్తుంది. కీర్తికి కారణ మౌతుంది.

ఒకప్పుడు గురువులు లేదా వంశ పురోహితులు జీవుడి లక్షణాన్ని బట్టి నామ కరణం చేసే వారు. తరువాతి కాలంలో తల్లి తండ్రులు కాని, ఇంటిలోని పెద్దలు కాని తమ అభిరుచులు, ఆదర్శాలు, ఇష్టాల ననుసరించి పేరు పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. పేరును బట్టి పెట్టిన వారి సంస్కారం వ్యక్తమౌతుంది.
అంతే కాదు పేరుని బట్టి వ్యక్తి జీవితం ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఈ నాడు కనపడుతోంది.
అందుకే పేరు మార్చుకోవటం, పేరులోని అక్షరాలను కొంచెం మార్చుకోవటం, కొంచెం అటూ ఇటూ చేయటం, ఆంగ్లంలో వ్రాసేప్పుడు అక్షర క్రమంలో మార్పు చేయటం గమనించ వచ్చు.

“ఆయుర్వర్చోభి వృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తదా
నామకరణ ఫలంత్వే తత్సముద్దిష్టమ్ మనీషిభిః ”

శిశువుకి ఆనందం, ఆయుస్సు, తేజస్సు, కీర్తి కలగటం కోసం నామకరణ సంస్కారాన్ని చేయాలట!

పేరుకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన శాస్త్రకారులు పేరు పెట్టటం అనే కార్యక్రమాన్ని నామకరణ సంస్కారంగా రూపొందించారు. నామకరణ విధి విధానానికి సంబంధించి గృహ్య సూత్రాలలో విపులంగా చర్చించ బడింది. పారస్కర గృహ్య సూత్రం పురుషుల పేరులో రెండు లేక నాలుగు అక్షరాలుండాలని, స్త్రీల పేరులో బేసి సంఖ్య (మూడు, ఐదు- ప్రధానంగా మూడు) లో అక్షరాలుండాలని తెలుపుతుంది. పైగా మగ పిల్లల పేర్లలో ఘోష సంజ్ఞ ఉన్న అక్షరాలు ( ఊది పలికే ఠ, మొదలైనవి) ఉండాలని ఉన్నది. పేరు పెట్టటంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేరు వినగానే ఆ వ్యక్తి స్త్రీయో, పురుషుడో తెలియాలి. కొండలు, నదులు, అరణ్యాలు, ఋషులు, గోత్రాలు, చెట్లు, రాక్షసులు మొదలైన వాటిని సూచించే పేర్లు పెట్ట కూడదని సూచించటం జరిగింది.

నామకరణ కార్యక్రమాన్నే బాలసారె అంటారు. వ్యవహారంలో అది బాలసారెగా మారింది. బాలకు అంటే శిశువుకి అందరు బహుమానాలు (సారె) ఇస్తారు ఆ రోజు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా శిశువు పుట్టిన పదకొండవ రోజున చేస్తారు. ఆ రోజున ఎలాగూ పురుటి స్నానం కనుక పుణ్యాహవచనం చేస్తారు. పురోహితుడు వస్తాడు.
ఇంట్లో కొద్ది హడావుడి ఉంటుంది. అప్పుడు కుదరక పోతే బేసి సంఖ్య రోజున చేయ వచ్చు. 21వ రోజు అయితే ముహూర్తం, తిథి వార నక్షత్రాలు చూడనక్కరలేదు. 16వ రోజు కూడా చేయ వచ్చు. నెల లోపు వీలు కానప్పుడు మూడవ నెల చేసుకుంటారు. కాలామృత కారుడు బిడ్డ పుట్టిన 11వ రోజుతో జాతాశౌచం పూర్తి అవుతుంది కనుక ఆ రోజే నామకరణ సంస్కారం చేయాలని జ్యోతిష పరంగా తెలియ చేశాడు.

“జాతానంతర మేవ నామ కరణం ఏకాదశాహే స్ఫుటం” . శిశువుకి చెందినవిగా చాంద్ర మాన, వేదోక్త, విష్ణు, సూర్య, స్త్రీ దేవతా, ఋతు, మాస నామాలని కూడా ప్రకటించాలి. కాని సాధారణంగా సంవత్సర, మాస, నక్షత్ర , వ్యవహార నామాలని వ్రాయటమే అలవాటుగా వస్తోంది.
తమకు తగిన సమయాన్ని నిర్ణయించుకున్న తరువాత ఆరోజు తల్లి తండ్రులు, శిశువు అభ్యంగన స్నానం చేయాలి.ఇల్లు శుభ్రం చేసి. మామిడాకుల తోరణాలు కట్టాలి. తూర్పు ముఖంగా పీటల మీద కూర్చుని, కలశ స్థాపన చేసి, పసుపుతో చేసిన గణపతిని, షష్ఠి దేవతను పూజించాలి. ఒక వేళ అంతకు ముందు జాతకర్మ (ఆవు నెయ్యి, తేనె, ఆవు పాలలో ముంచిన బంగారు కడ్డీని నాలుకపై రాయటం) చేసి ఉండక పోతే అప్పుడు చేయాలి. నాందీ కర్మ చేసిన తర్వాత పళ్ళెంలో బియ్యం పోసి , దానిలో బంగారు ఉంగరంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకి మూడు గీతలు గీసి, ముందుగా శ్రీకారం వ్రాసి, ఒక్కొక్క గడిలో సంవత్సర, మాస, నక్షత్ర,, వ్యవహార నామాలు వ్రాయాలి. కొంత మంది నక్షత్ర నామాన్నే వ్యవహార నామంగా చేసుకుంటారు.

“సభాసకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం” అని చెప్పి వ్యవహార నామాన్ని మూడు మార్లు బిడ్డ చెవిలో చెప్పాలి. ఈ సమయంలోనే పెద్దలందరూ పిల్ల వాడిని అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. శిశువుకి బహుమానాలు ఇచ్చే సమయం ఇదే. వసంతం (ఎర్ర నీళ్ళు) తో దిష్టి తీసి, కర్పూర హారతి ఇస్తారు. పురోహితుడు మొలతాడు కట్టిస్తాడు. ఒక వేళ నామ కరణం ఆలస్యంగా నయినా, 11వ రోజున పుణ్యాహ వచనం, మొలత్రాడు కట్టటం తప్పని సరిగా చేస్తారు.
నామకరణ సమయంలో చదివే మంత్రాలు తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధాన్ని స్థాపించేవిగా ఉంటాయి.

“ఆత్మావై పుత్రనామాసి” , “అంగాదంగాత్సంభవసి” మొదలైనవి.
పేరు పెట్టటం పూర్తి అయిన తరువాత స్త్రీలు బిడ్డను ఊయలలో వేస్తారు. ఈ కార్య క్రమం మాత్రం ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటుంది. ఊయల క్రింది నుండి ఇద్దరు ముత్తైదువలు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అందుకోవటం, నూతిలో చేద వేయించటం, బిడ్డ చెవిలో ముమ్మారు పేరుని ఉచ్చరించటం వంటివి. పేరుకి ఉన్న శక్తిని అనుసరించి బిడ్డ పేరుగల వాడు అవుతాడు...
—- తాడేపల్లి సాయి కృష్ణ శర్మ గారు పురోహితులు….

Address

MANGALAGIRI
Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when తాడేపల్లి సాయి కృష్ణ శర్మ పురోహితులు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category