Sirasanagandla Srinivasulu

టీటీడీ ఆధ్వర్యంలో నడిచే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్...
04/06/2026

టీటీడీ ఆధ్వర్యంలో నడిచే హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న “గుండ్లకమ్మకు హారిత హారం” కార్యక్రమ ఏర్పాట్లలో భాగంగా జిల్లా కో-ఆర్డినేటర్ శ్రీ హరిహరావు గారు, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీ వెంకట్ రెడ్డి గారు, బంగారమ్మ గుడి ఛైర్మన్ శ్రీ గుంటక సుబ్బారెడ్డి గారితో కలిసి గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో చేపట్టనున్న హారితహారం కార్యక్రమం, మొక్కల నాటడం, పరిశుభ్రత చర్యలు మరియు ప్రజల భాగస్వామ్యంపై చర్చించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ధర్మ పరిరక్షణ కూడా సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించడం జరిగింది.

ప్రకృతిని సంరక్షించడం అంటే భవిష్యత్ తరాలకు జీవనాధారాన్ని అందించడం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, దానిని సంరక్షించి పచ్చని ప్రకృతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాము.

🌱 గుండ్లకమ్మకు హారిత హారం
🌿 పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత
🙏 ధర్మ పరిరక్షణతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా మన కర్తవ్యం

#గుండ్లకమ్మకు_హారితహారం SaveNature PlantTrees GreenFuture JaiHanuman

కోడి రాంమూర్తి క్రీడా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో, శ్రీ కాళంగి శ్రీనివాసులు గారి శిక్షణలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా అద...
03/06/2026

కోడి రాంమూర్తి క్రీడా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో, శ్రీ కాళంగి శ్రీనివాసులు గారి శిక్షణలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా అద్భుతమైన కర్రసాము ప్రదర్శన చేసి శోభాయాత్రను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దిన గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

వారి ప్రతిభ, క్రమశిక్షణ, సాంస్కృతిక విలువలను గుర్తిస్తూ భరతమాత చిత్రపటాన్ని అందజేసి శాలువాతో సన్మానించారు. యువతలో దేశభక్తి, ధర్మం పట్ల అంకితభావం మరియు భారతీయ యుద్ధ కళల పరిరక్షణకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఈ సందర్భంగా కొనియాడారు.

జై శ్రీరామ్ 🚩
భారత్ మాతాకీ జై 🇮🇳

హనుమాన్ శోభాయాత్రను అత్యంత వైభవంగా, శోభాయమానంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన ప్రముఖులను భరతమాత చిత్రపటం అందించి, శాలువ...
02/06/2026

హనుమాన్ శోభాయాత్రను అత్యంత వైభవంగా, శోభాయమానంగా నిర్వహించడంలో విశేష కృషి చేసిన ప్రముఖులను భరతమాత చిత్రపటం అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా తర్లుపాడు రోడ్డు ఆంజనేయస్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షులు వెంకటరావు గారు, రమణారెడ్డి గారు, పిన్నిక నాగేశ్వరరావు గారు, సాగర సంగం మార్కాపురం అధ్యక్షులు రామకృష్ణ గారు, కొప్పుల వెంకటేశ్వర్లు గారు, పూల సుబ్బయ్య వీధికి చెందిన రాజారాపు ముని గారు సత్కారం అందుకున్నారు.

అలాగే స్వామివారికి తమలపాకులు సమర్పించి భక్తి భావాన్ని చాటిన వాల్మీకి సమాజానికి చెందిన వెంకటరావు గారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెనుక ప్రాంతంలో మహిళలను చైతన్యపరచి, పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో భాగస్వామ్యం అయ్యేలా కృషి చేసిన కొప్పుల జ్యోతి గారిని కూడా సత్కరించి వారి సేవలను కొనియాడడం జరిగింది.

ఈ సత్కార కార్యక్రమంలో అందజేసిన భరతమాత చిత్రపటాలను ఎంతో అందంగా, ఆకర్షణీయంగా తయారు చేయించి కార్యక్రమానికి ప్రత్యేకత తీసుకువచ్చిన పిన్నిక శివా యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సమాజ సేవ, ధార్మిక చైతన్యం, సామాజిక భాగస్వామ్యంతో హనుమాన్ శోభాయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సేవాస్ఫూర్తి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
మీ
శిరసనగండ్ల శ్రీనివాసులు

టీటీడీ అద్వర్యం లో నిర్వహింపబడుతున్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ ఎంపికైన పెద్దలు శ్రీ గోపాలున...
02/06/2026

టీటీడీ అద్వర్యం లో నిర్వహింపబడుతున్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ ఎంపికైన పెద్దలు శ్రీ గోపాలుని హరిహరావు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

మొదటి రోజు…పూల సుబ్బయ్య కాలనీ మరియు భగత్ సింగ్ కాలనీ ప్రాంతాలలో హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయడంలో విశేష కృషి చేసి, కా...
01/06/2026

మొదటి రోజు…

పూల సుబ్బయ్య కాలనీ మరియు భగత్ సింగ్ కాలనీ ప్రాంతాలలో హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయడంలో విశేష కృషి చేసి, కార్యక్రమాన్ని శోభాయమానం చేసిన పెద్దలను మర్యాదపూర్వకంగా కలిసి వారి సేవలను అభినందించడం జరిగింది.

సమాజం పట్ల బాధ్యతతో, ధర్మం పట్ల అంకితభావంతో, యువతకు మార్గదర్శకులుగా నిలుస్తూ శోభాయాత్ర ఘన విజయానికి తమ వంతు సహకారం అందించిన దనకుల హరిబాబు గారు, మాజీ సర్పంచ్ పెద్దన గారు, సుబ్బారెడ్డి గారు, మండ్ల శివప్రసాద్ గారు మరియు మధు యాదవ్ గారి సేవలు చిరస్మరణీయమైనవి. ఇలాంటి పెద్దల ఆశీస్సులు, సూచనలు, సహకారం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి.

ధర్మ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ పెద్దలకు హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 🙏🚩

మీ
శిరసనగండ్ల శ్రీనివాసులు

బిజెపి మార్కాపురం నూతన జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు గారిని నా కార్యాలయం లో అభినందించడం జరిగింది.....
01/06/2026

బిజెపి మార్కాపురం నూతన జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు గారిని నా కార్యాలయం లో అభినందించడం జరిగింది.....

బిజెపి మార్కాపురం నూతన జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు గారిని అభినందించడం జరిగింది.....BJP Ongole DistrictBJP Kanigiri...
01/06/2026

బిజెపి మార్కాపురం నూతన జిల్లా అధ్యక్షుడు పీవీ కృష్ణారావు గారిని అభినందించడం జరిగింది.....
BJP Ongole District
BJP Kanigiri Assembly
BJP Andhra Pradesh

29/05/2026

ప్రపంచంలోని సుఖాలు, సంతోషాలు తాత్కాలికమైనవి. కానీ భగవంతునిపై భక్తి, ఆయన స్మరణ, ఆయన దివ్యసాన్నిధ్యం మనసుకు నిజమైన ఆనందం మరియు ప్రశాంతతను ఇస్తుంది

నాకు నా మీద నమ్మకం ఉంది… ఆలస్యమవచ్చు కానీ నా విజయం ఎవ్వరూ ఆపలేరు.
28/05/2026

నాకు నా మీద నమ్మకం ఉంది… ఆలస్యమవచ్చు కానీ నా విజయం ఎవ్వరూ ఆపలేరు.

పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసి, దేవతా స్వరూపంగా కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానటుడు…రాజకీయాల్లో ప్రజల మనస...
28/05/2026

పౌరాణిక పాత్రలకు ప్రాణం పోసి, దేవతా స్వరూపంగా కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహానటుడు…

రాజకీయాల్లో ప్రజల మనసు గెలిచి, “ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో పాలన చేసిన మహానాయకుడు…

తెలుగు వారి గౌరవాన్ని ఢిల్లీ గద్దె ముందు నిలబెట్టి ప్రపంచానికి తెలుగు శక్తిని చాటి చెప్పిన ధీరుడు…

సినిమా తెరపై శ్రీరాముడిగా, శ్రీకృష్ణుడిగా ఆరాధింపబడి…
ప్రజాజీవితంలో సేవా తపనతో నిజమైన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం…

పేదల పక్షాన నిలబడి సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన దూరదృష్టి నాయకుడు…

తెలుగు సంస్కృతి, సంప్రదాయం, ఆత్మగౌరవానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన యుగపురుషుడు…

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా
ఆ మహానుభావునికి మా హృదయపూర్వక నివాళులు…

Address

Markapur

Website

Alerts

Be the first to know and let us send you an email when Sirasanagandla Srinivasulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share