05/09/2026
సూరారం శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి
శంకరంపేట(ఆర్) మండలం సూరారం గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.10,380 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, IPS గారు హెచ్చరించారు.