14/06/2026
ప్రశ్నిస్తే...
మమ్మల్ని 'బొద్దింకలు' అన్నారు కదూ!
అవును,
మేము చీకట్లోనే ఉంటాం...
కానీ, మీ చీకటి సామ్రాజ్యాల పునాదులు కదిలేలా
ఇప్పుడు సైన్యమై కదులుతాం!
పట్టాలొచ్చాయి... కొలువులు రాలేదు!
పేపర్లు అంగట్లో అమ్ముడవుతుంటే,
ఇంకా శవాల్లా పడి ఉండమంటారా?
మీ ఏసీ గదుల వెనుక,
మీ అవినీతి గల్లీల్లో,
మీరు 'పరాన్నజీవులు' అన్న అక్షరాలే...
ఇప్పుడు మీ సింహాసనాల కింద
ల్యాండ్ మైన్లు!
ఇది ఆన్‌లైన్ ట్రెండ్ కాదు...
ఆకలి కడుపుల అగ్నిపర్వతం!
కళ్లజోళ్లు తొడిగి, బొద్దింక మాస్కులేసి,
ధర్నా చౌక్ నుండి జంతర్ మంతర్ దాకా...
యువతరం రోడ్డు కెక్కింది!
ఒక్కటి గుర్తుంచుకోండి:
నలిపేసే కొద్దీ...
మేము ఇంకా విస్తరిస్తాం!
ఈ వ్యవస్థలోని మీ కుళ్లును
కడిగేసే దాకా...
మా 'మార్చ్' ఆగదు!
-- చైతన్య ( త్రిస్వరం )