28/08/2025
*బషీర్బాగ్ అమరవీరుల త్యాగాలు వృధా కాలేదు.*
*సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.*
ప్రపంచ బ్యాంకు ఆర్థిక విధానాలను అవలంబించోద్దని, కరెంటు చార్జీలను పెంచొద్దని రెండువేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతాంగం చేసిన మహత్తర పోరాటం వల్ల నేడు కరెంటు చార్జీలు ఇంకా సామాన్యులకు అందుబాటులో ఉండటానికి కారణమని దాంట్లో అమరులైనటువంటి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లా త్యాగం వృధా కాలేదని, వారిని స్మరించుకుంటూ నేడు జగద్గిరిగుట్ట అమరవీరుల స్థూపం వద్ద సిపిఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయం చేసుకోవడానికి కరెంటు లేకపోవడం, కరెంటు చార్జీలు కూడా పెంచడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నాడు కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చిన పిలుపునిందుకొని చలో హైదరాబాద్ కి వేలాది మంది రైతులు రాగ దానిని తట్టుకోలేని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరసనకారులపై గుర్రాలతో తొక్కించి పోలీసులతో కాల్పులు జరిపించాడని ఆ కాల్పుల్లో మన ప్రాంతానికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, బాలకృష్ణలు మరణించడం చాలా బాధాకరమని ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు వారి అమృత్వాన్ని గుర్తించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ రైతులకు అందుబాటులో ఉన్నది అని అంటే అది నాడు కమ్యూనిస్టు చేసిన పోరాటం వల్లేనని, కమ్యూనిస్టులు ఏం చేశారు అని అడిగే వాళ్లకు ఇదే ఒక సమాధానమని, అమరవీరులు చూపినటువంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని కోరారు.
*ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి హరినాథ్ రావు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్,, సీనియర్ నాయకులు సి వెంకటేష్, కత్తుల దుర్గయ్య, ప్రజానాట్యమండలి బాబు, శాఖ కార్యదర్శి సహదేవ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు డప్పు రామస్వామి, తొండ వెంకట్, సిపిఐ నాయకులు రాజు, చారి, ఇమామ్, మాముద్, వేణు తదితరులు పాల్గొన్నారు.*