Mulugu District Police

Mulugu District Police Mulugu District Police

*ఆపరేషన్ ముస్కాన్–2026 విజయవంతం.**జిల్లా కేంద్రంలో సంయుక్త ముగింపు సమావేశం నిర్వహణ*ఈ రోజు **ఆపరేషన్ ముస్కాన్–XII ముగింపు...
04/08/2026

*ఆపరేషన్ ముస్కాన్–2026 విజయవంతం.*

*జిల్లా కేంద్రంలో సంయుక్త ముగింపు సమావేశం నిర్వహణ*

ఈ రోజు **ఆపరేషన్ ముస్కాన్–XII ముగింపు సమావేశం** నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా ములుగు జిల్లా వ్యాప్తంగా పిల్లలను గుర్తించి, రక్షించి వారికి అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది.

ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, బాల కార్మికులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి మొత్తం 138 మంది చిన్నారులను రక్షించడం జరిగింది. వీరిలో 86 బాలురు మంది , 52 మంది బాలికలు ఉన్నారు. ఇందులో **24 మంది బాల కార్మికులు, 112 మంది డ్రాప్‌అవుట్ పిల్లలు, 1 రన్‌అవే చైల్డ్ మరియు 1 అనాథ బాలుడు** ఉన్నారు. డ్రాప్‌అవుట్ పిల్లల్లో కొందరికి పాఠశాలల్లో తిరిగి ప్రవేశం కల్పించగా, ఆశ్రయం లేని బాలికలను **ములుగు బాలసదన్‌లో**, బాలురను **ఆశ్రమ పాఠశాలల్లో** చేర్పించడం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన **ముస్కాన్ ఇన్‌చార్జ్, DSP DCRB శ్రీ E. కిషోర్ కుమార్ గారు** ముస్కాన్ టీమ్ సభ్యులను అభినందించారు. బాల్యవివాహాలు, బాల కార్మికత్వం, పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి పిల్లవాడు పనిలో కాకుండా **పాఠశాలలో ఉండేలా చూడాలని** సూచించారు.

**DLO శ్రీమతి V. వినోద గారు** జిల్లాలో నమోదైన 8 FIRల్లో ఎక్కువగా బాల కార్మికత్వానికి సంబంధించినవేనని, బాల కార్మికులపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు.

**DWO శ్రీమతి ప్రేమలత గారు** ములుగు జిల్లా SSC ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. రక్షించిన డ్రాప్‌అవుట్ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారు తిరిగి చదువుకునేలా అందరూ కలిసి కృషి చేస్తే వారి **బంగారు భవిష్యత్తుకు మంచి మార్గం చూపినవారమవుతామని** తెలిపారు.

సబ్‌డివిజన్ వారీగా రక్షించిన చిన్నారులు:

ములుగు సబ్‌డివిజన్: 29 మంది

ఏటూరునాగారం సబ్‌డివిజన్: 109 మంది

ఆపరేషన్ సందర్భంగా బాల కార్మికులను పనిలో పెట్టుకున్నట్లు గుర్తించిన 08 మంది యజమానులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో జిల్లా పోలీసు శాఖతో పాటు కార్మిక శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, బాలల సంక్షేమ కమిటీ (CWC), చైల్డ్‌లైన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేశాయి.

జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, వీధి బాలలు లేదా ప్రమాదంలో ఉన్న చిన్నారులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసు స్టేషన్‌కు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ ప్రజలను కోరింది.

ఈ కార్యక్రమంలో బిసిఆర్బి డిఎస్పి కిషోర్ కుమార్, డిడబ్ల్యుఓ ప్రేమలత పాల్గొన్నారు, డి ఎల్ ఓ వినోద మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు

జంపన్నవాగులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ పరిశీలన ములుగు జిల...
31/07/2026

జంపన్నవాగులో గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు – జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ పరిశీలన

ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జంపన్నవాగులో ప్రమాదవశాత్తు గల్లంతైన వ్యక్తి కోసం పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF), జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF) బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

బుధవారం జంపన్నవాగు ప్రధాన వంతెన నుంచి ఊరట్టం వంతెన మధ్య ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి మద్యం మత్తులో నీటిలో ఈతకు దిగిన పీట్ల తిమ్మయ్య (45), తండ్రి రంగయ్య, వడ్డెర, వృత్తి: కారు డ్రైవర్, స్వస్థలం: కొండాపూర్ గ్రామం, ఘట్‌కేసర్ మండలం ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం ఆయన ఆచూకీ లభించలేదు.

ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్ సంఘటన స్థలాన్ని సందర్శించి గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ములుగు డీఎస్పీ నలువాల రవీందర్, పస్రా సీఐ దయాకర్ లతో కలిసి సంఘటన స్థలాన్ని ఎస్ పి గారు పరిశీలించారు.

జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DDRF)కు చెందిన ఇద్దరు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, 25 మంది శిక్షణ పొందిన నిపుణులైన సిబ్బంది ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయంగా జంపన్నవాగు మొత్తం పరిధిలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు, ముక్యంగా 9 కిలోమీటర్ల పరిధిలో ఇంచు ఇంచు గాలింపు చేసారు .ఇసుకమెటలలో చిక్కుకపోయి ఉండచ్చు అనే నేపథ్యంలో గాలింపు బృందం స్వయంగా వాగు లోకి దిగి పరిశీస్తున్నారు,ఏ క్షణమైనా మృతదేహం లభించే అవకాశం ఉన్నందున గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు మద్యం సేవించి నీటిలోకి దిగడం, వాగులు, నదుల్లో ఈత కొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడవద్దని జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

*గోదావరి వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్ పి కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్* ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భా...
31/07/2026

*గోదావరి వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్ పి కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్*
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం *మూడో ప్రమాద హెచ్చరిక* కి చేరుకున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్ పి సూచించారు.
ముఖ్యంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు, బ్యాక్‌వాటర్ ప్రభావిత గ్రామాల ప్రజలు పరిస్థితులను నిరంతరం గమనిస్తూ పోలీసు, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఏటూరునాగారం, వాజేడు, మంగపేట పేరూరు కన్నాయిగూడెం వెంకటాపురం మండలాల్లోని గోదావరి నది పరివాహక ప్రాంతాలు, బ్యాక్‌వాటర్ ప్రభావిత గ్రామాల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని ఎస్పీ సూచించారు. అవసరమైతే అధికారులు సూచించే సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలివెళ్లాలని తెలిపారు.
మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లరాదని, వరద ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో నదిలోకి దిగడం, పడవల ద్వారా ప్రయాణించడం, సాహసాలకు పాల్పడడం ప్రాణాపాయమని హెచ్చరించారు.
అలాగే గోదావరి ఒడ్డున నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు చిన్నారులను నది వద్దకు వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించారు.
జిల్లా పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసు అధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్ పి గారు తెలిపారు.

*వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ**పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా – ఆన్లైన్ నమ...
25/07/2026

*వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ*

*పెండింగ్ కేసుల పురోగతిపై ఆరా – ఆన్లైన్ నమోదుపై పరిశీలన*

*ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిస్పాక్షిక సేవలు అందించాలని అధికారులకు ఆదేశం*

ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపీఎస్ గారు వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు. జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యక్ష అవగాహన పొందడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ సందర్శనలో ఎస్పీ గారు మొదటగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరంపోలీస్ స్టేషన్ చుట్టూ కలియ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత ను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులలో ఉన్న వాహనాల యొక్క పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రిసెప్షన్ అధికారి తో మాట్లాడుతూ ఫిర్యాదారులతో మర్యాదగా వ్యవహరించాలని దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులలో పురోగతిని సమీక్షించారు. ఎప్పటికప్పుడు కేసులలోని దర్యాప్తును వినవెంటనే ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు.

అనంతరం రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించారు. కేస్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆదేశించారు. రౌడీ శీటర్ల పైన తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించే విధంగా సేవలు అందించాలని అధికారులను మరియు సిబ్బందికి ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ఎస్పీ గారు పేర్కొన్నారు.

*"స్పెషల్ పార్టీ సిబ్బందితో జిల్లా ఎస్పీ దర్బార్ – విశేష సేవలకు ప్రశంసలు, రివార్డులు, సంక్షేమానికి ప్రాధాన్యత"*  *కర్రెగ...
24/07/2026

*"స్పెషల్ పార్టీ సిబ్బందితో జిల్లా ఎస్పీ దర్బార్ – విశేష సేవలకు ప్రశంసలు, రివార్డులు, సంక్షేమానికి ప్రాధాన్యత"*

*కర్రెగుట్టల రహదారి పనుల్లో సేవలందించిన స్పెషల్ పార్టీ సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు*

ములుగు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్ పి కేకన్ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ గారు స్పెషల్ పార్టీ సిబ్బందితో దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ అంశాలు, భవిష్యత్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు, అభ్యర్థనలను స్వయంగా తెలుసుకుని వారితో చర్చించారు.

దర్బార్‌లో సిబ్బంది పోలీసు హెడ్ క్వార్టర్స్ లో తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు, సిబ్బంది విశ్రాంతి కోసం పోలీస్ వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని కోరగా వెంటనే ఏర్పాటు చేసే దిశగా సంబంధిత అధికారులకు ఎస్ పి గారు ఆదేశాలు జారీ చేసారు .

మేడారం సమయంలోను అధికారుల చొరవతో ప్రయాణ బత్యం లభించగా, మరి కొన్ని నెలల ప్రయాణ బత్యం రావాల్సి ఉందని సిబ్బంది ఎస్ పి గారిని అభ్యర్ధించగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఎస్ పి గారు హామీ ఇచ్చారు.

అలాగే, కఠిన సేవా పథకాల వంటివి పొందేందుకు అర్హులైన సిబ్బంది వివరాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు.

ఇటీవల ఎండలను సైతం లెక్కచేయకుండా కర్రెగుట్టల కొండ ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో విశేష కృషి చేసిన స్పెషల్ పార్టీ సిబ్బందిని జిల్లా ఎస్ పి గారు ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం, క్రమశిక్షణ, సేవలను గుర్తిస్తూ ఉన్నత అధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు మరియు రివార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు.

అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దీర్ఘకాలంగా అంకితభావంతో సేవలందించిన అర్హులైన స్పెషల్ పార్టీ, బాంబు స్క్వాడ్ సిబ్బందికి ఆక్సిలరీ ప్రమోషన్లు కల్పించే అంశాన్ని కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి ఉన్నతాధికారులకు సిఫారసు చేశామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్ పి గారు మాట్లాడుతూ, స్పెషల్ పార్టీ సిబ్బంది ములుగు జిల్లా పోలీసు శాఖకు వెన్నెముకలాంటివారని, వారి సంక్షేమం, సేవలకు తగిన గుర్తింపు కల్పించడం జిల్లా పోలీసు శాఖ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే సేవాస్ఫూర్తితో ప్రజల భద్రత కోసం కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. స్పెషల్ పార్టీ అని కాకుండా నిజాయితీ తో పనిచేసిన ప్రతి సిబ్బందికి తగిన గుర్తింపు ఉంట్టుందని తెలియచేసారు.

పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు శారీరిక పరీక్షల నిర్వహణఅర్హత పొందిన విద్యార్థులకు వసతితో కూడిన శిక్షణ తరగతులుఅంది వచ్చిన అవకాశ...
22/07/2026

పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు శారీరిక పరీక్షల నిర్వహణ

అర్హత పొందిన విద్యార్థులకు వసతితో కూడిన శిక్షణ తరగతులు

అంది వచ్చిన అవకాశాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపు

---జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు

రాబోయే పోలీస్ శాఖ నోటిఫికేషన్ కోసం ములుగు జిల్లా యువత కోసం ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందె. కాగా ఇట్టి ఉచిత శిక్షణ శిబిరం కోసం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో దరఖాస్తులు ఆహ్వానించగా, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈరోజు అనగా 22.07.2026 బుధవారం నాడు ములుగు జిల్లా కేంద్రంలోని ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు ములుగు జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అధికారులు శారీరిక పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఇట్టి శారీరక పరీక్షలలో సఫలీకృతమైన వారికి ఉచిత వసతితో కూడిన శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ములుగు జిల్లా నిరుద్యోగ యువత ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని, తమ తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని ఆకాంక్షించారు.

ధ్వంసం అయిన చీకుపల్లి వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారిఇసుక వాగు బ్రిడ్జి మీద ప్రస్తుతం రాకపోకలు నిలిపివేతసంఘటన స్థలాన్...
22/07/2026

ధ్వంసం అయిన చీకుపల్లి వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక రహదారి

ఇసుక వాగు బ్రిడ్జి మీద ప్రస్తుతం రాకపోకలు నిలిపివేత

సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏ.ఎస్.పి మనన్ భట్,ఐపిఎస్

ప్రమాదాల జరగకుండా రోడ్డు మీద భారీ కేడ్లు ఏర్పాటు చేయించిన ఏఎస్పీ

ప్రజలు సహకరించాలని వెల్లడి

వాజేడు మండలంలోని చీకుపల్లి గ్రామ పరిధిలో గల ఇసుక వాగు మీద శాశ్వత వంతెన నిర్మాణం జరుగుతున్నందున, రాకపోకలకు వీలుగా దాని పక్కన నుంచి తాత్కాలిక రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయబడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇసుక వాగు లో వరద నీరు చేరి, ఆ వరద ప్రభావం వల్ల తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారింది.ఈ సంఘటన తెలుసుకున్న ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ ఐపిఎస్ గారు అధికారులతో కలిసి సందర్శించారు. అట్టి తాత్కాలిక నిర్మాణం ప్రస్తుతం రాకపోకలకు అణువు కాదని, ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని, వెంటనే ఇరువైపులా భారీకేడ్లు ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ గారు మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనులు పునరుద్ధరించే వరకు ఇరువైపులా రాకపోకలు నిషేధించామని, తిరిగి త్వరలోనే రహదారిని వాడుకలోకి తీసుకొస్తామని, అందువల్ల ప్రజలందరూ సహకరించాలని కోరారు.

ములుగు పోలీసు శాఖలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాంపథకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించ...
17/07/2026

ములుగు పోలీసు శాఖలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం

పథకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్

5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 (క్లస్టర్–A) పోటీల్లో ములుగు జిల్లా పోలీసు సిబ్బంది నాలుగు పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే పోలీసు సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ మైదానంలో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 క్లస్టర్–Aలోని 14 క్రీడా విభాగాల పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పతకాలు సాధించిన ములుగు జిల్లా పోలీసు క్రీడాకారులను జిల్లా ఎస్పీ అభినందించి, వారిని ప్రత్యేకంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధన, లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అన్నారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమన్వయం, జట్టు స్ఫూర్తి, శారీరక దృఢత్వం అత్యంత కీలకమని, ఈ లక్షణాలను పెంపొందించడంలో క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు.

నేరాల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల పరిరక్షణ వరకు ప్రతి బాధ్యతను విజయవంతంగా నిర్వహించడంలో జట్టు సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తితో విధులు నిర్వహిస్తూ పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకుంటే మరిన్ని విజయాలు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రీడలకు సమయం కేటాయించే పోలీసు సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన ఫలితమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని కూడా పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

పతక విజేతలు:

1) ఆర్‌ఎస్‌ఐ డి. రాకేష్ – రెజ్లింగ్‌లో కాంస్య పతకం (🥉)

2) ఆర్‌ఎస్‌ఐ ఎన్. అశోక్ – రెజ్లింగ్‌లో కాంస్య పతకం (🥉)

3) హెడ్ కానిస్టేబుల్ (HC-721) అమిత్ కుమార్ సింగ్ – రెజ్లింగ్‌లో రజత పతకం (🥈), జూడోలో కాంస్య పతకం (🥉)

*అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్ పి*  *దొంగతనాలు, గంజాయి కేసులపై ఆరా-బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ...
14/07/2026

*అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్ పి*

*దొంగతనాలు, గంజాయి కేసులపై ఆరా-బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం.*

*కోర్టు విచారణ లో ఉన్న కేసులపై ఆరా.. నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని ఆదేశం*

*నేర నియంత్రణలో రాజీపడొద్దు - పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి*

*– ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ ఐపిఎస్*

ఈరోజు అనగా 14.07.2026 మంగళవారం నాడు ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్ పి గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులతో అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశం నిర్వహించబడింది.

ఈ సమావేశంలో ప్రధానంగా దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగ నిర్మూలన, కల్తీ మద్యం, గుడుంబా తయారీ, రోడ్డు ప్రమాదాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల నియంత్రణపై ఎస్ పి చర్చించారు.

దొంగతనాల నియంత్రణ కు ప్రస్తుతం నిర్వహిస్తున్న గస్తీ విధులు పెంచాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారినీ ఆనుకొని ఉన్న గ్రామాలలో గస్తీ పెంచాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు మారుమూల గ్రామాలలో సైతం CC కెమెరాల యొక్క ఉపయోగాలు తెలియచేస్తూ, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ CC కెమెరాలను పెట్టించేలా కృషి చేయాలని ఆదేశించారు.

గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్థాయిలో బలమైన సమాచార వ్యవస్థ (ఇన్ఫార్మర్ నెట్‌వర్క్) ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహించి గంజాయి రవాణాను అడ్డుకోవాలని, యువత గంజాయి వినియోగానికి అలవాటు పడుతున్న ప్రాంతాలను (హాట్‌స్పాట్స్) గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.

*Arrive- Alive* కార్యక్రమం లో భాగంగా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. మైనర్ డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వకుండా తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేయాలని ఆదేశించారు.

మద్యం కల్తీ చేసే వారిపై, గుడుంబా తయారీ దారులపై కఠిన వైఖరి ప్రదర్శించాలని ఆదేశించారు. గ్రామస్తుల భాగస్వామ్యంతో గుడుంబా రహిత గ్రామాలు గా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

కోర్టు విచారణలలో ఉన్న కేసుల పురోగతిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కానిస్టేబుల్ ల పనితీరును నిత్యం పర్యవేక్షించాలని, సరైన సాక్ష్యాధారాలను, సాక్షులను సరైన సమయంలో కోర్టులలో ప్రవేశపెట్టి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని, నిరంతరం ఆదేశించారు.

అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పని చేయాలని సూచించారు. ఎవరైనా అధికారి విధులలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

పోలీస్ సిబ్బందికి రైన్ కోట్లు అందజేత.  విధులలో అలసత్వం వహించరాదని ఆదేశం.ఏ ఇబ్బందులు ఎదురైనా తనని సంప్రదించాలని, ఎల్లవేళల...
06/07/2026

పోలీస్ సిబ్బందికి రైన్ కోట్లు అందజేత.

విధులలో అలసత్వం వహించరాదని ఆదేశం.

ఏ ఇబ్బందులు ఎదురైనా తనని సంప్రదించాలని, ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ

-- జిల్లా ఎస్ పి కేకన్ సుధీర్ రామనాధ్ ఐ పి ఎస్

వర్షాకాలంలో విధి నిర్వహణలో సిబ్బంది వర్షాల వల్ల ఇబ్బంది పడకూడదని ఈరోజు అనగా 06.07.2026 సోమవారం నాడు ములుగు జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేశారు. తద్వారా సిబ్బంది కూడా తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించరాదని సిబ్బందిని ఆదేశించారు. విధి నిర్వహణలో ఏవైనా ఆటంకాలు ఏర్పడిన, ఏవేని సమస్యలు ఎదురైనా వెంటనే తమ పై అధికారులకు తెలియజేయాలని సూచించారు. అవసరమైతే తనను కూడా ఎప్పుడైనా సంప్రదించవచ్చునని, తాను ఎల్లవేళలా క్రింది స్థాయి సిబ్బందికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Address

Mulugu

Alerts

Be the first to know and let us send you an email when Mulugu District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share