VCK it wing-Andhra pradesh

VCK it wing-Andhra pradesh VCK itwing

*𖥔 జిల్లా కార్యాలయాలకు స్థలాలు లేవు.. పార్టీ ఆఫీసుకు రెండు ఎకరాలా.?**◉ ప్రజల అవసరాల కోసం కొన్న భూమిని పార్టీకి కేటాయించడ...
26/08/2026

*𖥔 జిల్లా కార్యాలయాలకు స్థలాలు లేవు.. పార్టీ ఆఫీసుకు రెండు ఎకరాలా.?*
*◉ ప్రజల అవసరాల కోసం కొన్న భూమిని పార్టీకి కేటాయించడం దారుణం: వి.సి.కె నేత బొంతు రమణ..*

*అమలాపురం, ఆగస్టు 26: అమలాపురం ప్రజల తాగునీటి అవసరాల కోసం మున్సిపాలిటీ కొనుగోలు చేసిన విలువైన భూమిని అధికార టీడీపీ కార్యాలయానికి దీర్ఘకాలిక లీజుకు కేటాయించడంపై వి.సి.కె రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.*

*తాగునీటి అవసరాల కోసం కొనుగోలు చేసిన భూమిని ఇప్పుడు ‘మిగులు స్థలం’గా పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రజల నిధులతో కొనుగోలు చేసిన భూమిని రాజకీయ పార్టీ కార్యాలయానికి కేటాయించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.*

*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాల కొరత ఉందని, అయితే అధికార పార్టీ కార్యాలయానికి మాత్రం కోట్లాది రూపాయల విలువైన రెండు ఎకరాలు కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం హాస్టళ్లు, ఉచిత స్టడీ సర్కిల్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.*

*టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపునకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు, మున్సిపల్ తీర్మానాలు, లీజు వివరాలను ప్రజల ముందుంచాలని బొంతు రమణ డిమాండ్ చేశారు. భూమిని ప్రజల తాగునీటి అవసరాలు, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు లేదా స్టడీ సర్కిల్ కోసం వినియోగించాలని కోరారు.*

*ప్రజా ఆస్తులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తే వి.సి.కె పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపడతామని, అవసరమైతే న్యాయపోరాటానికి కూడా సిద్ధమని బొంతు రమణ స్పష్టం చేశారు.*

#అమలాపురం #బొంతురమణ #కోనసీమ #టీడీపీ #ప్రజాధనం #ప్రజాఆస్తులు #తాగునీరు ాస్టళ్లు #స్టడీసర్కిల్ #ప్రజాపోరాటం #న్యాయపోరాటం

23/08/2026
రాజోలు ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే హామీపై వీసీకే హర్షంరాజోలు: రాజోలు నియోజకవర్గం...
19/08/2026

రాజోలు ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్న ఎమ్మెల్యే హామీపై వీసీకే హర్షం
రాజోలు: రాజోలు నియోజకవర్గంలోని ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హామీ ఇవ్వడం పట్ల వీసీకే (VCK) పార్టీ హర్షం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా వీసీకే పార్టీ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొంతు రమణ మాట్లాడుతూ, ఎస్సీ విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్‌తో హాస్టల్ సమస్యను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హాస్టల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం స్వాగతించదగ్గ విషయమన్నారు.
ఎస్సీ బాలుర హాస్టల్ లేకపోవడంతో పేద విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎమ్మెల్యే ఇచ్చిన హామీని త్వరితగతిన అమలు చేసి నిధులు మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనులను ప్రారంభించాలని వీసీకే పార్టీ కోరింది.
ఎస్సీ విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని, హామీ కార్యరూపం దాల్చితే రాజోలు ప్రాంతంలోని ఎస్సీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వీసీకే నాయకులు పేర్కొన్నారు.
“ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి — హాస్టల్ నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలి” అని వీసీకే పార్టీ డిమాండ్ చేసింది.

#రాజోలు #ఎస్సీబాలురహాస్టల్ #విద్యార్థులహక్కులు #విద్యార్థులసంక్షేమం #హాస్టల్నిర్మాణం #బొంతురమణ #విద్యాభివృద్ధి #సామాజికన్యాయం

18/08/2026

తలైవా Thol.Thirumavalavanగారి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా! 🎉💙❤️

VCK పార్టీ జాతీయ అధ్యక్షులు, తలైవా Dr. తొల్. తిరుమావళవన్ గారి 64వ జన్మదిన వేడుకలను ఒంగోలులో VCK పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆది నాగేశ్వరరావు గారు, వెంకీ గారు, ప్రభు గారు, LCP పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శోభన్ గారు, కె. ఆంజనేయులు గారు, కృపారావు గారు తదితరులు పాల్గొన్నారు.

అలాగే బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి వారసులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా చేశారు.

తలైవా తిరుమా గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు! 💐

జై భీమ్! ✊🏿
జై VCK! 💙❤️

17న విజయవాడ ధర్నా చౌక్‌లో “జై భీమ్ రావు భారత్ పార్టీ” అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దళిత, గిరిజన సంక్షేమ ప...
18/08/2026

17న విజయవాడ ధర్నా చౌక్‌లో “జై భీమ్ రావు భారత్ పార్టీ” అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో దళిత, గిరిజన సంక్షేమ పథకాల పునరుద్ధరణ కోసం నిర్వహించిన నిరసన దీక్షలో VCK పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు N. J. విద్యాసాగర్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు.

దళిత, గిరిజన హక్కులు మరియు సంక్షేమ పథకాల పరిరక్షణ కోసం జరిగే పోరాటాలకు VCK పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది.

జై భీమ్ ✊🏾
విదుతలై చిరుతైగల్ కచ్చి – VCK

తలైవా Dr. తిరుమావళవన్ గారి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా! 🎉💙❤️VCK పార్టీ జాతీయ అధ్యక్షులు, తలైవా Dr. తొల్. తిరుమావళవన్ గారి ...
18/08/2026

తలైవా Dr. తిరుమావళవన్ గారి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా! 🎉💙❤️

VCK పార్టీ జాతీయ అధ్యక్షులు, తలైవా Dr. తొల్. తిరుమావళవన్ గారి 64వ జన్మదిన వేడుకలను ఒంగోలులో VCK పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆది నాగేశ్వరరావు గారు, వెంకీ గారు, ప్రభు గారు, LCP పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శోభన్ గారు, కె. ఆంజనేయులు గారు, కృపారావు గారు తదితరులు పాల్గొన్నారు.

అలాగే బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి వారసులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా చేశారు.

తలైవా తిరుమా గారికి 64వ జన్మదిన శుభాకాంక్షలు! 💐

జై భీమ్! ✊🏿
జై VCK! 💙❤️

ఘనంగా పుట్టినరోజు వేడుకలు 🎉VCK పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డా. Thol. Thirumavalavan గారి పుట్టినరోజు సందర్భంగా నా...
17/08/2026

ఘనంగా పుట్టినరోజు వేడుకలు 🎉

VCK పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డా. Thol. Thirumavalavan గారి పుట్టినరోజు సందర్భంగా నాగలాపురంలో ఫ్లెక్స్ ఏర్పాటు చేసి, నాగలాపురం మండలం VCK కార్యకర్తలు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, డా. Thol. Thirumavalavan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

జై భీమ్! ✊🏿
వీర్ వందనం! 💙❤️


🇮🇳 VCK పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపున 🇮🇳80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,సమ...
15/08/2026

🇮🇳 VCK పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపున 🇮🇳

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,
సమానత్వం • సామాజిక న్యాయం • స్వేచ్ఛ • సోదరభావం విలసిల్లే భారతదేశం కోసం మనమందరం ఐక్యంగా ముందుకు సాగుదాం.

జై భీమ్ ✊🏿
జై భారతం 🇮🇳
వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం!

VCK పార్టీ ఆంధ్రప్రదేశ్

Address

Nagalapuram

Alerts

Be the first to know and let us send you an email when VCK it wing-Andhra pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share