11/09/2025
గర్భిణీ స్త్రీల వైద్య సేవల పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
గురువారం ఆమె నల్గొండ మండలం, రాములబండ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హై రిస్క్ ఏఎన్ సి కేసులు, కుక్క కాటుకు యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్, ఈడిడీ క్యాలెండర్ ,ఆసుపత్రిలో మందుల అందుబాటు, మలేరియా,డెంగ్యూ పరీక్షల నిర్వహణ తదితరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్ జమీర్ తో మాట్లాడుతూ హై రిస్క్ గర్భిణీ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం వారికి వైద్య సేవలు అందించాలని చెప్పారు.ఈ సందర్బంగా ఆమె ఆసుపత్రికి వస్తున్న జ్వరం కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పి హెచ్ సి లో అందుబాటులో ఉన్న మందులు , ఆంటీ రేబిస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రి ఆవరణ లో పరిశుభ్రతను పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అప్పజిపేటలో ఉన్న చందుపట్ల మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థులకు నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు.