Nalgonda 1 Town PS-nlgcops nalgonda district police

Nalgonda 1 Town PS-nlgcops nalgonda district police One State One Service One Experience for all Citizens at All Times

*నల్లగొండ వన్ టౌన్ పిఎస్ పట్టణ పరిధి నిరుద్యోగ యువతీ యువకులకు ఒక గొప్ప అవకాశం* నల్లగొండ జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ. శరత్చంద...
02/04/2025

*నల్లగొండ వన్ టౌన్ పిఎస్ పట్టణ పరిధి నిరుద్యోగ యువతీ యువకులకు ఒక గొప్ప అవకాశం*
నల్లగొండ జిల్లా గౌరవ ఎస్ పి శ్రీ. శరత్చంద్ర పవార్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో *మిషన్ పరివర్తన్ యువ తేజం* కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీఖున జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతీ యువకుల కోసం నిర్వహించబడుతుంది.
ఇట్టి జాబ్ మేళాలో నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ యొక్క నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు పొందాలని వన్ టౌన్ పోలీస్ వారు కోరుతున్నారు.
దీనికి నిరుద్యోగ యువతీ యువకులు చేయవలసింది
1. కనీస విద్య అర్హత పదవ తరగతి ఉండి వారి యొక్క వివరాలను పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు పరుచుకోవాలి.
2. వందకు పైగా కంపెనీలు, 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించ నున్నాయి.
3. జాబ్ లో సెలెక్ట్ అయిన వారందరికీ, ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే అపాయింట్మెంట్ లెటర్ మంచి శాలరీ ప్యాకేజ్ తో ప్రకటించ బడుతుంది.
4. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రతి వార్డు నుండి కనీసం 20 మంది పైగా జాబ్ మేళాలో పాల్గొని అధిక సంఖ్యలో ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాము
5. యువత ఖాళీగా ఉంటూ చెడు ధోరణి వైపు వెళ్లకుండా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ, వారి కుటుంబానికి సమాజానికి మేలు చేసేలా ఈ అవకాశం కలగజేస్తుందని ఆశిస్తున్నాము.
ఇట్లు
*వన్ టౌన్ ఇన్స్పెక్టర్*
*నల్గొండ వన్ టౌన్ పిఎస్*

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... 💐
01/01/2025

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... 💐

పత్రిక ప్రకటన తేది 30.12.2024     *ఆపరేషన్ చబుత్ర*                  ******ఆపరేషన్ చబుత్ర ద్వారా రెండు రోజుల్లో నల్గొండ ప...
30/12/2024

పత్రిక ప్రకటన
తేది 30.12.2024

*ఆపరేషన్ చబుత్ర*
*****
*ఆపరేషన్ చబుత్ర ద్వారా రెండు రోజుల్లో నల్గొండ పట్టణంలో పట్టుబడిన 250 మందికి పైగా కౌన్సిలింగ్, 128 డీడీ మరియు 62 పెట్టీ కేసులు* :*శరత్ చంద్ర పవార్ ఐపీఎస్, ఎస్పీ నల్గొండ*

* 250 మందికి పైగా వారి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్, పట్టుబడిన వారిలో అధిక శాతం యువకులే.

* 128 డీడీ కేసుల్లో 97 మందిని కోర్టులో హాజరు పరచగా, వారిపై కోర్టు 1,19,000 రూ. జరిమానా విధించింది.

* 62 పెట్టీ కేసుల్లో 54 మందిని కోర్టులో హాజరు పరచగా, 56,000 రూ. జరిమానా విధించింది.

* 100 పైగా వాహనాలను సీజ్ చేసి, ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై మొత్తం 481 చల్లాన్స్ విధించి, 3,51,665 రూ. జరిమానా విధించింది.

శని, ఆదివారం రోజులలో అర్థరాత్రి నల్గొండ పట్టణంలో, నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో వరసగా రెండవ రోజు వన్ టౌన్, టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సిఐలు, 15 మంది ఎస్సైలు, 98 మంది కానిస్టేబుల్, మొత్తం 13 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసి, నల్గొండ పట్టణాన్ని జల్లెడ పట్టడం జరిగింది. యాంటీ నార్కోటిక్స్ స్నిఫర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ చబూత్ర కార్యక్రమం చేయడం ద్వారా పట్టణంలో నేరాలు జరగకుండా, యువకుల చెడు ధోరణుల వైపు వెళ్లకుండా, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జరగకుండా తద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని, ప్రజల నుండి మంచి స్పందన రావడంతో, ఈ కార్యక్రమం డిసెంబర్ 31వ తారీఖు వరకు కొనసాగుతుందని, ట్రాఫిక్ రూల్స్, న్యూసెన్స్ చేస్తూ, అర్థరాత్రి రోడ్లపై తిరిగే ఆవారా/పోకిరిల పై ఇంకా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలియజేశారు.

*ఈ డిసెంబర్ 31వ తారీఖు యాక్సిడెంట్ ఫ్రీ మరియు ఇన్సిడెంట్ ఫ్రీగా నల్గొండ జిల్లా ప్రజలు పోలీస్ సహకారంతో చేయాలని ఆకాంక్షించారు.*

అలాగే డిసెంబర్ 31వ తారీఖు వేడుకలు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వారి ఇండ్లలోనే జరుపుకోవాలని సూచించారు.
అలాగే యువకులు తమ జీవితాలలో వెలుగులు నింపుకొని, వారి తల్లి తండ్రులకు, సమాజానికి ఉపయోగపడే విధంగా 2025వ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ,నల్గొండ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఇట్టి ఆపరేషన్ చబుత్ర లో ప్రత్యేక చొరవ చూపిస్తున్న డి.ఎస్.పి కె శివరాం రెడ్డిని వన్ టౌన్ మరియు ట్రాఫిక్ సిఐ లు రాజశేఖర్ రెడ్డి, రాజు ఎస్సైలు నాగరాజు, శంకర్, సందీప్ సైదుల్ని మరియు పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు..👇*జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాం...
29/12/2024

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ జారీ చేసిన నియమ నిబంధనలు..👇

*జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు*
* *ప్రజలు,యువత డిశంబర్ 31 వేడుకలు శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలి* .
* *31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.*
* *డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం జరుగుతుంది*
* *జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ IPS*
జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ డిసెంబర్ 31 న నిర్వహించుకునే వేడుకలు జిల్లా ప్రజలు యువత శాంతి యుత వాతావరణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం జరుపుకోవాలని ఒక ప్రకటనలో జిల్లా యస్.పి గారు తెలిపారు.
డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునే ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉంటూ పోలీసు వారి సూచనలు పాటించాలి, వేడుకలు నిర్వహించుకునే వారు ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ప్రమాదాలకు దూరంగా ఉంటూ నిర్వహించుకోవాలని అన్నారు.
* మద్యం దుకాణాలు, వైన్ షాప్స్ రాత్రి 12.00 గంటల వరకు బార్స్, రెస్టారెంట్స్ రాత్రి 1.00 గంట వరకు ప్రభుత్వo అనుమతించిన సమయపాలన పాటించాలి.
* 31వ తేది రాత్రి 10 గం. నుండి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తాము.మద్యం సేవించి వాహనాలు నడిపితే అలాంటి వారిని అదుపులొకి తీసుకుని కేసులు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తాము, అదేవిదంగా వాహనము సీజ్ చేయడం లైసెన్స్ రద్దు చేయడం మరియు బైయిండోవర్ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.
* గంజాయి, డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాలు సేవించే వారి పై ఎప్పటికప్పుడు డ్రగ్స్ టెస్టింగ్ కిట్ల ద్వారా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది.
* ట్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండ వాహనం నడిపితే కూడా చట్ట పరమైన చర్యలు తప్పవు.
* మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తో అక్రమ సిట్టింగులు, ఆరుబయట మద్యం సేవించడం, గుంపులు గుంపులుగా తిరుగుతూ మహిళలను వేదింపులకు గురి చేస్తూ,ఇబ్బందులను పెట్టే వారిపై షి టీం బృందాలు ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది.
* ఆర్కెస్ట్రా, డి.జే లు, మైకులు ఉపయోగించడం, బాణసంచా నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.
* ముఖ్యంగా యువత పై కేసు నమోదు ఐతే భవిషత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు,ఇతర దేశాలకు వెళ్ళుటకు వీసాలు లాంటివి ఇవ్వబడవు, కావున యువత గమనించగలరు.
* మద్యానికి దూరంగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి.
* వేడుకల్లో అపశృతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికేట్స్, మఫ్టీ టీమ్స్, ముఖ్యమైన కూడలిలలో CC కెమరాలు ఏర్పాటు లాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము.
పై సూచనలు పాటిస్తూ జిల్లా ప్రజలు మరియు యువత యొక్క అమూల్యమైన జీవితం ప్రమాదాల బారిన పడకుండా చూడడం పోలీస్ వారి బాధ్యత.
ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ *INCIDENT FREE-ACCEDENT FREE* గా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఎస్పీ శరత్ చంద్రపవార్ ఐపీఎస్ 👆

*నల్గొండ పట్టణంలో డిసెంబర్ 31 ఉద్దేశించి, అర్థరాత్రి పకడ్బందీగా ఆపరేషన్ చబుత్ర:  కె శివరాం రెడ్డి* ,*డీఎస్పీ నల్గొండ** అ...
29/12/2024

*నల్గొండ పట్టణంలో డిసెంబర్ 31 ఉద్దేశించి, అర్థరాత్రి పకడ్బందీగా ఆపరేషన్ చబుత్ర: కె శివరాం రెడ్డి* ,*డీఎస్పీ నల్గొండ*

* అర్థరాత్రి ఆవారా గా తిరుగుతున్న 154 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
* 88 బైకులు,6 కార్లు, 15 ఆటోలు, 78 సెల్ఫోన్లు స్వాధీనం
* 54 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు

శనివారం అర్థరాత్రి నల్గొండ పట్టణం లో జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో వన్ టౌన్, టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు సిఐలు 15 మంది ఎస్సైలు, 98 మంది కానిస్టేబుల్ మొత్తం 13 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 154 మందిని అదుపులోకి తీసుకొని డిఎస్పీ గారు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 88 బైకులు, 6 కార్లు, 15 ఆటో లు, 78 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన 54 మంది పై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే డిసెంబర్ 31 కార్యక్రమం ఉద్దేశించి, అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురిచేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని డిసెంబర్ 31 వ తారీఖు వరకు రెగ్యులర్గా ఈ డ్రైవ్ నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది. అలాగే *ఈ డిసెంబర్ 31 వ తారీకు యాక్సిడెంట్ మరియు ఇన్సిడెంట్ ఫ్రీ గా నల్గొండ పట్టణాన్ని చేయాలని ఆకాంక్షించారు.*

అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లైతే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.

నల్లగొండ పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరడం జరిగింది.

రాత్రి పట్టుబడిన వారందరినీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని టిటిఐ సెంటర్ నందు వారి తల్లిదండ్రుల సమక్షంలో, అర్ధరాత్రి సమయంలో ఎలాంటి కారణం లేకుండా ఆవారాగా తిరగడం, తాగి వాహనం నడపడం వల్ల జరిగే నష్టాల గురించి మరొకసారి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

కార్యక్రమంలో సిఐలు రాజశేఖర్ రెడ్డి, రాజు మరియు ఎస్ఐ లు నాగరాజు, సైదులు, సురేష్, సందీప్, శంకర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పత్రిక ప్రకటన(తేది 19.12.2024)*ఇంటి గేటుకి తాళం వేసి బయటకు వెళ్తున్నారా?**ఐతే తప్పక ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...*: *ఎస...
19/12/2024

పత్రిక ప్రకటన
(తేది 19.12.2024)

*ఇంటి గేటుకి తాళం వేసి బయటకు వెళ్తున్నారా?*
*ఐతే తప్పక ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...*: *ఎస్పీ నల్గొండ, శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*

రాబోయే క్రిస్మస్ మరియు సంక్రాంతి పండగల సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే, నల్లగొండ జిల్లా ప్రాంత వాసులకు పోలీసు వారి విజ్ఞప్తి.

1. *ఇంటికి, ఇంటిగేటుకు తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్ళరాదు, ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్ళినట్లయితే మీ సమీప బంధువులను, మీకు తెలిసిన మిత్రులను ఇంటి దగ్గర పడుకొనే విధముగా చూసుకోవలెను*.
2. ఒకవేళ తాళం చేయవలసిన పరిస్థితి ఏర్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి కనపడే విధంగా గేట్ కి, మెయిన్ డోర్ కి వేయకూడదు. గేట్ బయట నుండి కాకుండా లోపల నుండి, మెయిన్ డోర్ కాకుండా పక్క డోర్ లకు వేసుకోవాలి. అలాగే తాళం కనపడకుండా డోర్ కర్టెన్ తో కవర్ చేసే విధంగా చూసుకోవాలి.
3. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన వస్తువులను అనగా బంగారు, వెండి ఆభరణాలను మరియు నగదును బీరువాలో పెట్టకూడదు. తప్పనిసరిగా బ్యాంక్ లాకర్ లో భద్రపరచుకోవాలి.
4. రాత్రి సమయంలో ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదైనా రూంలో లైట్ వేసి ఉంచాలి.
5. తప్పనిసరి ఊరికి వెళుతున్నట్లయితే ఇంటి పక్కన వారికి మరియు సంబంధిత పోలీస్ స్టేషన్ కి తప్పనిసరిగా సమాచారం అందించాలి. పోలీస్ స్టేషన్లో తెలియ జేసినట్లైతే రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుంది.
6. ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి సీసీటీవీ కెమెరాలను ఇంటికి అమర్చుకోవాలి. అదేవిధముగా ఇంటి బయటకు నాలుగు దిక్కులా రోడ్డు కవర్ అయ్యే విధంగా కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
7. ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు మీ ఇంటి చుట్టుపక్కల గాని, కాలనీలో గాని తిరుగుతున్నట్లయితే వెంటనే 100కి గాని, సంబంధిత పోలీస్ స్టేషన్కి గాని సమాచారం తెలియజేయాలి.
*ప్రతి ఒక్కరూ, పై సూచనలు పాటిస్తూ, జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ, నల్గొండ జిల్లా ను నేర రహిత జిల్లాగా తీర్చిదుద్దుటలో భాగస్వామ్యం అవుతారని ఆశిస్తున్నాము*

18/12/2024
16/12/2024
నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు తమ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది కిరణ్, రామకృష్ణ వెంకటేష్ లను డీఎస్పీ శ్రీ...
12/12/2024

నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు తమ విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది కిరణ్, రామకృష్ణ వెంకటేష్ లను డీఎస్పీ శ్రీ కె శివరాం రెడ్డి గారు అభినందించడం జరిగింది.

*ప్రతి కాలనీ సురక్షిత కాలనీగా తీర్చిదిద్దుటకు సీసీ కెమెరాలు దోహదపడుతాయి* :*డీఎస్పీ కె శివరాం రెడ్డి* • 22 వార్డులో స్థాన...
10/12/2024

*ప్రతి కాలనీ సురక్షిత కాలనీగా తీర్చిదిద్దుటకు సీసీ కెమెరాలు దోహదపడుతాయి* :*డీఎస్పీ కె శివరాం రెడ్డి*
• 22 వార్డులో స్థానిక కౌన్సిలర్ మరియు కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ సహకారంతో ఏర్పాటు చేసిన 29 కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం

నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు 22 వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ మరియు స్థానికులు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను నల్లగొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ, నేర రహిత పట్టణం గా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో ప్రతి కాలనీ లో సీసీటీవీ కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలని, దీనికి ప్రతి ఒక్క కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాలనీ లో ప్రతి ఎంట్రీ మరియు ఎక్సిట్ ప్రదేశాలలో, ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఒక్క సీసీ కెమెరా 100 పోలీస్ సిబ్బంది తో సమానం అని, అన్ని కేసులలో ముఖ్య సాక్ష్యం గా తీసుకోబడుతుంది అని తెలియ జేయడం జరిగింది.
ప్రతి కాలనీ ని సురక్షిత కాలనీ గా ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాలనీ లో దొంగతనాలు/నేరాలు, న్యూసెన్స్ పూర్తిగా తగ్గిపోతాయని తెలిపారు.
*నేను సైతం* అనే కార్యక్రమం ద్వారా ప్రతి అపార్ట్మెంట్లలో, షాప్స్ లలో, ఇండివిజల్ హౌసెస్ లలో కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఫోన్లలో సమాచారం తెలుసుకునే విధంగా అనేక రకాల టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని నేరాలను అరికట్టవచ్చు అని తెలియజేశారు. సూచించారుఅలాగే పోలీస్ సూచన మేరకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ సమద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
కార్యక్రమంలో గుమ్మల మోహన్ రెడ్డి, ఎస్ఐ సందీప్, పోలీస్ సిబ్బంది మహమూద్, గాంధీ, కృష్ణ, శ్రీను కాలనీ వాసులు పాల్గొన్నారు.

*రాజీ మార్గమే.. రాజ మార్గం..**నల్గొండ -డి. ఎస్. పి కె శివరాం రెడ్డి**నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 14 న ని...
10/12/2024

*రాజీ మార్గమే.. రాజ మార్గం..*
*నల్గొండ -డి. ఎస్. పి కె శివరాం రెడ్డి*

*నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 14 న నిర్వహించబోయే మెగా లోక్ అదాలత్ సంధర్బంగా రాజీపడదగిన కేసులలో ఉన్న కక్షిదారులతో సమావేశం*

ఈ నెల డిసెంబర్ 14న జరగబోయే మెగా లోక్ అదాలత్ సందర్భంగా, నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారం, నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాజీపడదగిన (కాంపౌడబుల్ కేసులు) కేసులలో కక్షిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ డి.యస్.పి కె శివరాం రెడ్డి గారు మాట్లాడుతూ, క్షణికావేశంలో, విచక్షణ కోల్పోయి, ఆవివేకంతో పట్టింపులకి పోయి కేసులు నమోదు చేసుకుని పంథాలకి పోకుండా రాజీ పడే కేసులలో కక్షిదారులు రాజీ పడి అన్నదమ్ముల్లా మెలగాలని, రాజీ మార్గమే రాజమార్గం అని, ప్రతి ఒక్క కక్షీ దారుడు జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏ రాజాశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఈ పెట్టి కేసులో, డ్రంకెన్ డ్రైవ్ లలో పట్టుబడిన వారు ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకుని వారిపై నమోదైన కేసులని క్లియర్ చేసుకోని, వారికి సంబందించి పోలీస్ స్టేషన్ లో ఉన్న డాక్యుమెంట్స్ మరియు వస్తువులని తీసుకుని వెళ్ళమని సూచించారు. ఈ సమావేశంలో ఎస్. ఐ. లు సందీప్ రెడ్డి,సురేష్, సైదులు కౌన్సిలర్స్ ఆమిర్, బాబా సిబ్బంది శివరామ కృష్ణ, ఫరూక్, సైదులు, కృష్ణ నాయక్ మరియు కక్షిదారులు పాల్గొన్నారు.

03/12/2024

Address

Opposite To Bodrayee
Nalgonda
508001

Telephone

+918712670141

Website

Alerts

Be the first to know and let us send you an email when Nalgonda 1 Town PS-nlgcops nalgonda district police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Nalgonda 1 Town PS-nlgcops nalgonda district police:

Share

Category