Telugu Desam Party: Nandikotkur

Telugu Desam Party: Nandikotkur Official Page of TDP Nandikotkur

మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు.. ముందు అద్దంలో మీ రాజకీయ ముఖం చూసుకుని మాట్లాడండి.. తర్వాత మా నాయకుల గురించి చెప్...
24/08/2026

మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి గారు.. ముందు అద్దంలో మీ రాజకీయ ముఖం చూసుకుని మాట్లాడండి.. తర్వాత మా నాయకుల గురించి చెప్పండి!

98 జీవో ఉద్యోగాల విషయంలో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నమ్ముకున్న నాయకులను ముందుగా ప్రశ్నించే ధైర్యం చూపించండి. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పుడు*గౌరవ మాండ్ర శివానందరెడ్డి గారు* *"గౌరవ గౌరు వెంకటరెడ్డి" గారు* మీకు అడ్డంకులు సృష్టించలేదు. మరి ఇప్పుడు ఎవరిపై నిందలు వేస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు లబ్బి వెంకటస్వామి గారు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 98 జీవో ఉద్యోగాల అంశం ఫైనాన్స్ అప్రూవల్ దశ వరకు వెళ్లినప్పటికీ, ఒక దళిత మాజీ ఎమ్మెల్యే కి పేరు వస్తుందనే అక్కుసతో ఆ 98 జీవో ఉద్యోగాల పొట్ట కొట్టి అడ్డుకున్న వ్యక్తి ఎవరు *బైరెడ్డి సిద్ధార్థరెడ్డి* మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆ విషయంపై మాట్లాడే దమ్ము మీకు ఉందా?

లబ్బి వెంకటస్వామి గారు.. 98 జీవో బాధితుల సమస్యను మీ రాజకీయ స్వార్థానికి మెట్లుగా వాడుకోవడం ఆపండి. ప్రజల సమస్యపై నిజంగా పోరాడాలంటే ఆధారాలతో మాట్లాడండి.. లేకపోతే మీ రాజకీయ డ్రామాలను ప్రజలే తిరస్కరిస్తారు.

ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుపడిన వాళ్లను వదిలేసి.. ఇప్పుడు ఉద్యోగాల కోసం పోరాడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం మీకు మాత్రమే చెల్లింది!

హైదరాబాదుకు వెళ్ళే వ్యక్తివి సడన్ గా కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ సిద్ధమైందని సమాచారం రాగానే కెమెరాల ముందు ధర్నా చేసి, పని మొత్తం మీ వల్లే జరిగినట్టు క్రెడిట్ కొట్టేయాలనుకోవడం ప్రజలకు తెలియదనుకుంటున్నారా?

ఫైల్ కదిలించిన వాళ్లు వేరే.. ఫైల్ కదిలిందని తెలిసి ఫోటోలకు పరుగెత్తిన వాళ్లు వేరే!

ముందు మీ నాయకుడిని ప్రజలకు మంచి చేయడం నేర్పించండి.. తర్వాత మా నాయకుల గురించి మాట్లాడండి.

మాట్లాడే ముందు ఎవరు మీకు విలువ ఇచ్చారు.. ఎవరు అడ్డుపడ్డారు.. ఎవరు నిజంగా పని చేశారు అనేది గుర్తు పెట్టుకోండి. లేకపోతే మీరు విసిరిన మాటలకే ప్రజల ముందు తలవంచి సమాధానం చెప్పాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త







2019_2024 వైసిపి ప్రభుత్వం హయాంలోనే అలగనూరు రిజర్వాయర్‌ దొంగలూ..!బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. పోచ జగదీశ్వర్ రెడ్డి..Dara S...
21/08/2026

2019_2024 వైసిపి ప్రభుత్వం హయాంలోనే అలగనూరు రిజర్వాయర్‌ దొంగలూ..!
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి.. పోచ జగదీశ్వర్ రెడ్డి..
Dara Sudheer

(పి.ఆర్.పి) ఇంజక్షన్ల దొంగ డాక్టర్ చదువు వస్తే చదువుకో.. గత వైసిపి ప్రభుత్వం లో అలగనూరు రిజర్వాయర్‌ కేవలం 50 మీటర్ల మేర దెబ్బతిన్న కట్టను రూ.6 కోట్లతో పూర్తయ్యే పనులను రాత్రికి రాత్రే #బైరెడ్డి_సిద్ధార్థరెడ్డి, (అతని అనుచరులు కాంట్రాక్టర్లు) JCBలతో కట్టను పగలగొట్టి రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో కాంట్రాక్టుల మీ నాయకుల ప్రయోజనాల కోసం రైతులకు నీరు అంది ఇవ్వకుండా మరింత నాశనం చేశారు.
#అలగనూరు_రిజర్వాయర్_దొంగలు #అలగనూరు_రిజర్వాయర్_కట్ట

20/08/2026

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి దారా సుధీర్, 2019–2024 మధ్య వైసిపి ప్రభుత్వం లోనే నందికొట్కూరు నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టు మీ నాయకులే నిర్లక్ష్యమే నేడు రైతులకి దుస్థితి రావడానికి కారణం దారా సుధీర్.

రివర్స్ టెండరింగ్ పేరుతో అలగనూరు రిజర్వాయర్‌ సుమారు 250 మీటర్ల మేర తెగిపోయినా కట్ట రైతులకు చుక్క నీరు అందించకుండా, రిజర్వాయర్ నత్తనడకన వదిలేసి.. ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటు దారా సుధీర్.

గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో ఆగిన అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు పనులకు కూటమి ప్రభుత్వం ఆమోదం రూ. 36 కోట్లతో మరమ్మత్తులు, 250 మీటర్ల పొడవునా కట్ట నిర్మాణం త్వరలోనే శరవేగంగా సాగనున్న అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తు పనులు.




20/08/2026

మిడ్తూరు మండలం తలముడిపి గ్రామంలో నిర్వహించిన “కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి & సంక్షేమం” ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు గ్రామ ప్రజలకు కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు





andhrapradeshartistry

18/08/2026

రైతుల సాగునీటి సమస్యపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారి విజ్ఞప్తి

నందికొట్కూరు నియోజకవర్గంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అసెంబ్లీలో ప్రస్తావించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక తుంగభద్ర డ్యాం నుంచి సుంకేసుల డ్యాంకు ఆశించిన స్థాయిలో నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు మల్యాల HNSS, ముచ్చుమరి ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నప్పటికీ, నందికొట్కూరు నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించలేకపోవడం తీవ్ర ఆందోళనకరంగా మారిందని రైతులకు అవసరమైన సాగునీటిని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలగనూరు రిజర్వాయర్ కట్ట గత వైసిపి ప్రభుత్వం లో కుంగిపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, త్వరగా మరమ్మతులు, పనులను వేగవంతం చేసి తాగునీటికి రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

“రైతుల పంటలు ఎండిపోకుండా, నందికొట్కూరు రైతాంగానికి సాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి రైతులకు అండగా నిలవాలి” అని ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు అసెంబ్లీ వేదికగా కోరారు.
Gitta Jaya Surya

కేసి కెనాల్ కు 360 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య నందికొట్కూరు నియోజకవర్గం – నందికొట్కూరు మండలంమల...
12/08/2026

కేసి కెనాల్ కు 360 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య

నందికొట్కూరు నియోజకవర్గం – నందికొట్కూరు మండలం

మల్యాల ఎత్తిపోతల పథకం శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా జలాలను ఎత్తిపోసి హంద్రీ - నీవా సుజల స్రవంతి (HNSS) ద్వారా ఒక పంపు నుండి (కేసీ కెనాల్ కు) 360 క్యూసెక్కుల నీటిని నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య గారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన నీటిని అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.




నందికొట్కూరులో డ్యూటీ వేళ రాజకీయ ర్యాలీలో VRO..!నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనలు వర్తించవా? అన...
11/08/2026

నందికొట్కూరులో డ్యూటీ వేళ రాజకీయ ర్యాలీలో VRO..!

నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనలు వర్తించవా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలకు సేవ చేయాల్సిన రెవెన్యూ ఉద్యోగి డ్యూటీ సమయంలోనే రాజకీయ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

DSC అవకతవకలపై వైఎస్ఆర్‌సీపీ సోమవారం నిర్వహించిన ర్యాలీలో నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి చెందిన VRO మనోహర్ పాల్గొన్నట్లు పేర్కొంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ సమయంలో ఆయన రెవెన్యూ విధుల్లో ఉండాల్సి ఉండగా, రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

డ్యూటీ సమయంలో ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమా? దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

09/08/2026

నందికొట్కూరు పట్టణం కూరగాయల మార్కెట్‌ను నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య గారు సందర్శించారు. మార్కెట్‌లోని వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో మౌలిక వసతులు, పరిశుభ్రత, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై పరిశీలించారు. వ్యాపారులు, రైతుల సమస్యలను పరిష్కరించి మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు.




Address

Nandikotkur Consens
Nandikotkur
518401

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nandikotkur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nandikotkur:

Shortcuts

Share