iTDP Nandyal Town

iTDP Nandyal Town Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from iTDP Nandyal Town, Political organisation, Nandyal.

30/08/2024

ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు ప్రతిరోజు సమీక్షించాలి

గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

జిల్లా స్దాయి కమాండ్ కంట్రోల్ కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలి

పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలో జిఓ

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, Sept 11 తేదీ నుండి రానున్న నూతన విధానంలపై సచివాలయం నుండి వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమర్ ఇబ్రహింపట్నం కమీషనరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ రాష్ట్ర స్దాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే జిల్లా స్దాయిలో కూడా జిల్లా స్దాయి కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మీనా అదేశించారు.

కలెక్టర్లు ఎటువంటి రాజకీయ వత్తిడులకు లోనుకావలసిన అవసరం లేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారని. పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలోనే జిఓ ఇవ్వనున్నామని, రవాణ చార్జీలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత ధర అమలులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు. అన్ లైన్ విధానంలో ఇసుక బుకింగ్ ప్రక్రియ ద్వారా ఎవరికి వారు తమ ఇంటి నుండే బుక్ చేసుకుని, జిపిఎస్ విదానంలో తమ వాహనం లోకేషన్ ను కూడా తెలుసుకోవచ్చన్నారు. అన్ లైన్ విధానం పట్ల అవగాహన లేని గ్రామప్రాంతాల వారి కోసం సచివాలయంలో శిక్షణ పొందిన ఉద్యోగి అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా స్దాయిలో కలెక్టర్లు ఇసుక లభ్యత, ధరలపై నిత్యం మీడియాకు బులెటిన్ విడుదల చేయాలని మీనా అదేశించారు. జిల్లా స్దాయి వ్యవహరాలకు జాయింట్ కలెక్టర్ ను బాధ్యునిగా చూస్తామన్నారు.

గనుల శాఖ సంచాలకులు, ఎపిఎండిసి ఎండి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అందుబాటులోకి రానున్న శాండ్ పోర్టల్ విభిన్న అంశాలకు మార్గనిర్దేశకత్వం వహిస్తుందన్నారు. సమస్త సమాచారాన్ని దానిలో అందుబాటులో ఉంచుతామన్నారు. రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ ను వేగంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ఇసుక పరిస్దితిపై సమీక్ష చేస్తున్నారని, సిఎం అకాంక్షల మేరకు పనిచేయవలసి ఉందన్నారు. వంద శాతం వినియోగదారులు ఇసుక రవాణా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేయటమే ద్యేయంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యవస్దలకు భిన్నంగా దర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్సరెన్స్ లో అయా జిల్లాల కలెక్టర్లు, గనుల శాఖ రాష్ట్ర స్దాయి అధికారులు, ఎడిలు పాల్గొన్నారు.

30/08/2024

విజయవాడ చేరుకున్న ముంబయి సినీ నటి జత్వానీ

- మధ్యాహ్నం విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలిసే అవకాశం

- కేసు వివరాలు, ఆధారాలు విజయవాడ సీపీకి అందించనున్న ముంబయి నటి

- కేసులో నిజానిజాలు తేల్చేందుకు ఏసీపీ స్రవంతిరాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం

- ముంబయి సినీనటి నుంచి వివరాలు తీసుకోనున్న విచారణాధికారి స్రవంతిరాయ్

- నటిపై నమోదు చేసిన ఫోర్జరీ కేసునూ పరిశీలించనున్న విచారణాధికారి

ఈరోజు అమరావతిలో ఉన్న రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూ...
29/08/2024

ఈరోజు అమరావతిలో ఉన్న రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నంద్యాలలోని పలు అభివృద్ధి అంశాల పై చర్చించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే & రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి భూమా బ్రహ్మానందరెడ్డి గారు.

28/08/2024

అమరావతి : వైసీపీకి భారీ షాక్

- పార్టీని వీడేందుకు క్యూ కడుతున్న నేతలు

- రేపు రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, మస్తాన్‍రావు రాజీనామా?

- రేపు రాజ్యసభ ఛైర్మన్‍కు రాజీనామా పత్రాలు ఇచ్చే అవకాశం

- అనంతరం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్న మోపిదేవి, బీదా మస్తాన్‍రావు

- ఇరువురు నేతలు త్వరలో టీడీపీలో చేరే అవకాశం

ఇప్పటికే నైపుణ్య గణన ఫైలు పై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. మొదట రాష్ట...
28/08/2024

ఇప్పటికే నైపుణ్య గణన ఫైలు పై సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. మొదట రాష్ట్రంలోని 15 నుంచి 59ఏళ్ల వయసున్న దాదాపు 3.5 కోట్ల మంది నైపుణ్యాలు, వారి ఆసక్తుల సమాచారం సేకరిస్తారు. తర్వాత వారి నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారిస్తారు.

28/08/2024

పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కేంద్రం సుముఖత

- ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నీ ఇచ్చేందుకు కేంద్రం సుముఖం

- పెండింగ్ సహా నిధులన్నీ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం

- ప్రధాని, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా సీఎం చర్చలు

- జాతీయ ప్రాజెక్టుగా పోలవరం పూర్తికి కేంద్రం నిర్ణయం

- ప్రధాని, ఆర్థికమంత్రి, జలశక్తి మంత్రులతో పలు దఫాలుగా సీఎం చర్చలు

- పోలవరం ప్రాజెక్టు నిధులపై సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధానికి విజ్ఞప్తి

13/08/2024

అమరావతి: రాష్ట్రంలో కాగిత రహిత కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం

- కాగిత రహిత కేబినెట్‍లో భాగంగా మంత్రులకు ఐప్యాడ్లు ఇవ్వాలని నిర్ణయం

- ఇకపై క్యాబినెట్ సమావేశాలు ఎలక్ట్రానిక్ ఫార్మాట్‍లోనే జరుగుతాయని గత కేబినెట్‍లో మంత్రులకు తెలిపిన సీఎం

- 2017లోనూ సీఎంగా కాగిత రహిత కేబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు

- అజెండా అంశాల ఆధారంగా ప్రతి కేబినెట్ సమావేశానికి 40 సెట్ల నోట్స్ ముద్రిస్తున్న ప్రభుత్వం

- ఇకపై ఆ నోట్స్ అన్నీ సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులకు, సంబంధిత అధికారులకూ అందజేయనున్న ప్రభుత్వం

13/08/2024

విజయవాడ : అగ్రిగోల్డ్ భూముల విషయంలో అవకతవకలు జరిగాయి
- ఇవాళ ఇద్దర్ని అరెస్టు చేశాం

- అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ కూడా మార్చారు

- మా విచారణలో అవకతవకలు నిజమని తేలాయి

- సీబీఐ అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నాం

- అగ్రిగోల్డ్ ఆస్తులు సీఐడీ అటాచ్మెంట్‍లో ఉన్నాయి

- మా విచారణలో పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం

- ప్రభుత్వ అధికారులు ఈ కేసులో దోషులుగా ఉన్నారు

- అందుకే మా విచారణ వేరుగా సాగిస్తున్నాం

- సీఐడీ, ఏసీబీ అధికారుల విచారణ నివేదికల్ని ఉన్నతాధికారులకు అందజేస్తాం

- మా దర్యాప్తులో ఐదుగురు పేర్లు ఉన్నాయి

- విచారణలో మరికొన్ని పేర్లు ఉండొచ్చు

- జోగి రమేష్ పాత్రపై విచారణ జరుగుతోంది

- నిర్దారణ అయితే కేసు నమోదు చేస్తాం

- 87 సర్వేలో ఎలాంటి సబ్ డివిజన్‍లు జరగలేదు

- శేషునారాయణ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించాం

- అక్రమ రిజిస్ట్రేషన్లు జరిహాయని తేలాకే కేసు నమోదు చేశాం

- 88 సర్వేలో స్థలం కొని.. 87 సర్వేలో ఉన్నట్లు మార్పు చేసుకున్నారు

- ఇదంతా ఒక కుట్ర ప్రకారమే జరిగింది

- గ్రామ, మండల సర్వేర్లను మ్యానేజ్ చేశారు

- సర్వేయర్ రమేష్, జోగి రాజీవ్‍ను అరెస్ట్ చేశాం

- ఇవాళ ఇద్దర్ని కోర్టులో హాజరుపరుస్తాం : ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత

13/08/2024

గత వైసీపీ ప్రభుత్వ జీవోను రద్దు చేసిన ఏపీ హైకోర్టు

- వైద్య కళాశాలల సీట్ల భర్తీలో EWS కోటా కింద 10శాతం సీట్లు కేటాయిస్తూ ఇచ్చిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు

- ఓపెన్ కాంపిటిషన్‍లోని 50 శాతంలో 10 శాతం EWS కోటాకు కేటాయించడాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్

- పిటిషన్‍పై విచారించిన ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం

13/08/2024
13/08/2024

దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ

- అన్ని విభాగాల్లో వరుసగా ఆరో ఏడాదీ మొదటి స్థానంలో ఐఐటీ మద్రాస్‌ - ఐఐఎస్‌సీ బెంగళూరు రెండు, ఐఐటీ బాంబేకు మూడో స్థానం - ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరుకు మొదటి స్థానం - నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ కింద జాబితా రూపొందించిన విద్యాశాఖ - మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులు ప్రకటించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ - కళాశాలల విభాగంలో.. హిందూ కాలేజీ, మిరాండా కాలేజీ, సెయింట్ స్టీఫెన్‌ కాలేజీకి తొలి 3 ర్యాంకులు - ఇంజినీరింగ్‌ విభాగంలో.. ఐఐటీ మద్రాస్‌ వరుసగా 9వ సారి మొదటి స్థానం - మేనేజ్‌మెంట్‌ విభాగంలో.. ఐఐఎం అహ్మదాబాద్‌ తొలి స్థానం - వైద్య విద్యలో.. ఢిల్లీలోని ఎయిమ్స్‌‌కు మొదటి స్థానం - పరిశోధనలో.. ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఢిల్లీ తొలి 3 స్థానాలు - వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో.. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఢిల్లీ) తొలి స్థానం - ఆవిష్కరణల విభాగంలో.. ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ హైదరాబాద్‌ తొలి 3 స్థానాలు - స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీల్లో.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఆరో ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీకి ఏడో స్థానం - న్యాయవిద్యలో.. బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా వర్సిటీకి తొలిస్థానం - ఆర్టిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌లో.. ఐఐటీ రూర్కీకి మొదటి స్థానం

12/08/2024

ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం

- ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన గవర్నర్ కార్యాలయం

- పంద్రాగస్టు వేడుక ఆహ్వాన పత్రికను సీఎంకు అందించిన జీఏడీ కార్యదర్శి

Address

Nandyal

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Nandyal Town posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share