Sdpi Nandyal Assembly

Sdpi Nandyal Assembly Official Account

11వ వార్డు చాంద్ బడాలో SDPI కీలక సమావేశం ప్రజా సమస్యలపై పోరాటం… ప్రజా హక్కుల కోసం ఉద్యమం… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వి...
31/08/2026

11వ వార్డు చాంద్ బడాలో SDPI కీలక సమావేశం

ప్రజా సమస్యలపై పోరాటం… ప్రజా హక్కుల కోసం ఉద్యమం… రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యం!

నంద్యాల 11వ వార్డు చాంద్ బడా బ్రాంచ్ నాయకుల సమావేశం ఈ రోజు నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో 11వ వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

అదేవిధంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో చాంద్ బడా 11వ వార్డు నుంచి SDPI తరఫున బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా ఎన్నికల కార్యాచరణను రూపొందించడం, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.

ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల్లోకి వెళ్లడం కాదు… ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల పక్షాన నిలబడటమే SDPI లక్ష్యం.

✊ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం
✊ అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా గళం
✊ వార్డు అభివృద్ధి కోసం నిరంతర కృషి
✊ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో SDPI బలమైన ప్రత్యామ్నాయం

ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా కార్యదర్శి టీ. కరీముల్లా గారు, అసెంబ్లీ కోశాధికారి నూరుల్లా గారు, 11వ వార్డు బ్రాంచ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🔥 చాంద్ బడా మార్పు కోసం… SDPI ముందడుగు!

✊ ప్రజల కోసం పోరాటం – ప్రజల చేత పాలన!

ముస్లిం కాలేజీ వద్ద పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలి NMJAC వినతి ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా సెక్రటరీ T. కరీముల్ల గ...
31/08/2026

ముస్లిం కాలేజీ వద్ద పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయాలి NMJAC వినతి ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా సెక్రటరీ T. కరీముల్ల గారు పాల్గొన్నారు....

ఈరోజు NMJAC ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆల్ కమిటీలు, ఆల్ సంఘాలు, ఆల్ పార్టీ ప్రతినిధులు కలిసి నంద్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

నంద్యాల జిల్లాలోని నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్, ఉర్దూ కాలేజ్ ప్రాంతాల్లో ఇటీవల నూతనంగా ముస్లిం కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ రూట్‌లో విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని కమిటీ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కాలేజీ పరిసర ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారిని సమావేశానికి హాజరయ్యేలా చేసి, సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా సెక్రటరీ T. కరీముల్లా పాల్గొన్నారు. వివిధ కమిటీలు, సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

📢 SDPI అయ్యలూరు గ్రామపంచాయతీ నాయకుల సమావేశంఈ రోజు SDPI అయ్యలూరు గ్రామపంచాయతీ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావే...
30/08/2026

📢 SDPI అయ్యలూరు గ్రామపంచాయతీ నాయకుల సమావేశం

ఈ రోజు SDPI అయ్యలూరు గ్రామపంచాయతీ నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో గ్రామపంచాయతీ పరిధిలోని వార్డుల్లో నెలకొన్న ముఖ్య సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

అలాగే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై నాయకులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా కార్యదర్శి సుల్తాన్ గారు మరియు నంద్యాల అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కరిముల్లా గారు మరియు అయ్యలూరు గ్రామపంచాయతీ నాయకులు పాల్గొన్నారు.

🤝 ప్రజా సమస్యలపై పోరాటం – ప్రజల కోసం SDPI!

📢 SDPI 5వ వార్డు నడిగడ్డ బ్రాంచ్ నాయకుల సమావేశంఈ రోజు SDPI 5వ వార్డు నడిగడ్డ బ్రాంచ్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిం...
30/08/2026

📢 SDPI 5వ వార్డు నడిగడ్డ బ్రాంచ్ నాయకుల సమావేశం

ఈ రోజు SDPI 5వ వార్డు నడిగడ్డ బ్రాంచ్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో వార్డులో నెలకొన్న ముఖ్య ప్రజా సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించడం జరిగింది.

అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు అభ్యర్థి ఎంపిక, ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన వ్యూహాలు, వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో పార్టీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.

ఈ కార్యక్రమంలో SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ గారు, అసెంబ్లీ కమిటీ సభ్యులు హనీఫ్ గారు, 5వ వార్డు బ్రాంచ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

✊ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ప్రజల కోసం నిరంతరం పోరాటమే SDPI ధ్యేయం.

Al mustan trust ఆధ్వర్యంలో నంద్యాల ప్రాంతానికి చెందిన పేద ఇంటి యువతి పెళ్లి కోసం ఖురాన్ మరియు బీరువా ఇవ్వడం జరిగింది... ...
29/08/2026

Al mustan trust ఆధ్వర్యంలో నంద్యాల ప్రాంతానికి చెందిన పేద ఇంటి యువతి పెళ్లి కోసం ఖురాన్ మరియు బీరువా ఇవ్వడం జరిగింది... ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా SDPI ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ గారు

కోవెలకుంట్ల పట్టణంలో SDPI నూతన బ్రాంచ్ కమిటీ ఏర్పాటునంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో SDPI జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నూ...
29/08/2026

కోవెలకుంట్ల పట్టణంలో SDPI నూతన బ్రాంచ్ కమిటీ ఏర్పాటు

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో SDPI జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నూతన బ్రాంచ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా బ్రాంచ్ కమిటీ అధ్యక్షులుగా ఇర్షాద్ గారిని, సెక్రటరీగా మహబూబ్ బాషా గారిని నియమించడం జరిగింది.

పట్టణంలోని ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి పోరాటాలు నిర్వహించడంతో పాటు, పార్టీని మరింత బలోపేతం చేయాలని నూతన కమిటీ నిర్ణయించింది.

ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తూ, ప్రతి వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి నూతన బ్రాంచ్ కమిటీ కృషి చేయాలని జిల్లా నాయకులు సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారం – పార్టీ బలోపేతమే లక్ష్యం.

నంద్యాల అసెంబ్లీ – 4వ వార్డు పాన్‌పట్టి ప్రాంతంలో తాగునీటి సమస్యపై SDPI వినతినంద్యాల అసెంబ్లీ పరిధిలోని 4వ వార్డు పాన్‌ప...
29/08/2026

నంద్యాల అసెంబ్లీ – 4వ వార్డు పాన్‌పట్టి ప్రాంతంలో తాగునీటి సమస్యపై SDPI వినతి

నంద్యాల అసెంబ్లీ పరిధిలోని 4వ వార్డు పాన్‌పట్టి ప్రాంతంలో ఉన్న బోరింగ్‌ చాలా రోజులుగా పనిచేయకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాకాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చిన్న చెరువు కూడా ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా, బోరింగ్‌ను వీలైనంత త్వరగా మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతూ వార్డు సచివాలయం అడ్మిన్ మురారి సార్ గారికి SDPI నాయకులు, కార్యకర్తలు మెమోరాండం అందజేశారు.

ప్రజల నీటి సమస్యను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని SDPI కోరింది.

ఇట్లు,
SDPI బ్రాంచ్ సెక్రటరీ
పి. సల్మాన్ ఖాన్

SDPI కార్యకర్తలు:
పి. ఇమ్రాన్ ఖాన్
షేక్ గులాబ్ భాష

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన మరియు పోస్ట్ కార్డు ఉద్యమం... 1.నంద్యాల జిల్లా తాత్కాలిక కలెక్టర్ ఆఫీసును ...
29/08/2026

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన మరియు పోస్ట్ కార్డు ఉద్యమం...

1.నంద్యాల జిల్లా తాత్కాలిక కలెక్టర్ ఆఫీసును RARS నుండి వెంటనే తరలించి వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని కాపాడాలని,
2. నంద్యాల నూనెపల్లె మార్కెట్ యార్డులో టిడిపి ఆఫీసుకు కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ

దీనిని ఏ విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని జరిగిన చర్చలలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు మరియు ఇతర సంఘాల నాయకులతోపాటు SDPI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాస్ హుస్సేన్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు మాజీద్ ఖాన్ మరియు నాయకులు అక్తర్ హుస్సేన్ పాల్గొన్నారు.

SDPI పార్టీ 6 వార్డు (ఫాతిమా నగర్, జగజ్జనని నగర్ )   నాయకుల సమావేశంరాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని SDPI పార...
27/08/2026

SDPI పార్టీ 6 వార్డు (ఫాతిమా నగర్, జగజ్జనని నగర్ ) నాయకుల సమావేశం

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని SDPI పార్టీ 6 వార్డు ( ఫాతిమా నగర్, జగజ్జనని నగర్ బ్రాంచ్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో వార్డు నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ, ప్రజల్లోకి పార్టీ విధానాలను తీసుకెళ్లే విధానం, వార్డు స్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

ఈ సమావేశంలో SDPI నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ , నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అమీర్ ముల్లా గారు, నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్ గారు మరియు ఫాతిమా నగర్, జగజ్జనని నగర్ వార్డు బ్రాంచ్ నాయకులు పాల్గొన్నారు.

✊ ప్రజల సమస్యలపై పోరాటం…
ప్రజల కోసం ప్రత్యామ్నాయ రాజకీయాలు…
విజయం దిశగా SDPI!

SDPI 6వ వార్డు సెక్రటరీ వసీం గారి పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధితులు మరియు గర్భిణీ మహిళల కోసం మిత్రబృందం ఆధ్వర్యంలో...
27/08/2026

SDPI 6వ వార్డు సెక్రటరీ వసీం గారి పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధితులు మరియు గర్భిణీ మహిళల కోసం మిత్రబృందం ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా SDPI ప్రధాన కార్యదర్శి ఏజాస్ హుస్సేన్ గారు పాల్గొని రక్తదాతలను అభినందించారు.

🩸 రక్తదానం – ప్రాణదానం
❤️ ఒకరి రక్తదానం మరొకరి జీవితానికి వెలుగునిస్తుంది.

Address

Nandyal

Website

Alerts

Be the first to know and let us send you an email when Sdpi Nandyal Assembly posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sdpi Nandyal Assembly:

Shortcuts

Share