24/07/2024
నంద్యాలలో పవిత్ర జగజ్జనని అమ్మవారి దేవాలయం ఉన్న జగజ్జనని నగర్ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది - NMD ఫిరోజ్
ఏళ్ళ తరబడి ప్రజలు జీవిస్తున్న రోడ్లు లేక,డ్రైనేజీ కాల్వలు లేక, ఉన్న రోడ్లన్నీ గుంతల మయం, మురికి నీళ్లు రోడ్ల పై ప్రవహిస్తూ,ఇళ్ల మధ్య ఓపెన్ డ్రైనేజీ నీటి వల్ల రోగాలు, వీధి కుక్కలు పందుల భేడదతో జగజ్జనని నగర్ ప్రాంత ప్రజలు బాధలు వర్ణనతీతం.
కొంతమంది భూ బకాసురులు ఆక్రమ వెంచర్లు వేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఎలాంటి సౌకర్యలు కల్పించకుండా పేద మధ్యతరగతి ప్రజలను సొంతింటి ఇళ్లు /ప్లాట్ పేరుతో లక్షలు కాజేసి దగా చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం - NMD ఫిరోజ్ గారు, నంద్యాలజిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి
నంద్యాల పట్టణంలోని వార్డు పర్యటనలో భాగంగా NMD ఫిరోజ్ గారు 6వ వార్డు చేరుకోవడంతో వార్డు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు
NMD ఫిరోజ్ గారు జగజ్జనని నగర్ , ఆత్మకూరు బస్టాండ్ ఏరియా , ఫాతిమా మసీదు లైన్ వీధి వీధినా పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్డు నందు ఏళ్ళ తరబడి ప్రజలు జీవిస్తున్న రోడ్లు లేక,డ్రైనేజీ కాల్వలు లేక, ఉన్న రోడ్లన్నీ గుంతల మయం, మురికి నీళ్లు రోడ్ల పై ప్రవహిస్తూ,ఇళ్ల మధ్య ఓపెన్ డ్రైనేజీ నీటి వల్ల రోగాలు, వీధి కుక్కలు పందుల భేడదతో బాధపడుతున్నమని ప్రజలు తెలియజేయడంతో వెంటనే అధికారులకు సమస్యలను తెలియజేసి వాటిని పరిష్కరించాలని కోరారు మరియు రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏజెండాలో తప్పక చేర్చాలని కోరారు.
ఈ సందర్భంగా నంద్యాల ప్రజానీకానికి వెంచర్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వెంచర్ లో స్థలం కొనేటప్పుడు వాటిలో రోడ్లు , కాలువలు , వాటర్ పైప్ లైన్లు సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ప్రభుత్వ అప్రూవల్ ఉందో లేదో తెలుసుకొని కొనాలని సూచించారు
కొంతమంది భూ బకాసురులు ఆక్రమ వెంచర్లు వేసి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఎలాంటి సౌకర్యలు కల్పించకుండా పేద మధ్యతరగతి ప్రజలను సొంతింటి ఇళ్లు /ప్లాట్ పేరుతో లక్షలు కాజేసి దగా చేస్తున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటమాన్నారు..
ఈ వార్డు నందు ఖాళీ స్థలాలలో మురికి నీరు నిలవ ఉండడంతో అక్కడ నివసించే ప్రజానీకానికి ఇబ్బందిగా మరియు వ్యాధులు సోకే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైతే కాళీ స్థలాలు ఉన్నాయో వారు వెంటనే నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలని లేకపోతే వారికీ ప్రభుత్వం తరుపున నోటీసులు అందజేసి కఠిన చర్యలు తీసుకుంటామని హేచ్చరించారు.
అనంతరం వార్డు ప్రజలు తమ సమస్యలు విని సానుకూలంగా స్పందించిన NMD ఫిరోజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 6 వార్డు బూత్ కన్వీనర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు మరియు మున్సిపల్ , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు