Palnadu Police

Palnadu Police Officially Maintained by Palnadu Police. "Call 1930 to report a cyber crime within 24 hours of its occurrence"

ప్రెస్ నోట్  పల్నాడు జిల్లా పోలీస్  ది.31.08.2026 // ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్...
31/08/2026

ప్రెస్ నోట్
పల్నాడు జిల్లా పోలీస్
ది.31.08.2026

// ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బందికి ఘన సన్మానం చేసిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు,.//

🔹 "మీరు భావితరాలకు ఆదర్శం - మీ సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం."

🚩 పల్నాడు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి ఈ రోజు (31.08.2026) ఉద్యోగ విరమణ పొందిన ఎనిమిది మంది పోలీసు సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పోలీస్ అధికారులు,పోలీస్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో పూలమాలలు వేసి, బహుమతులు అందించి ఘనంగా సత్కరించిన గౌరవ జిల్లా అదనపు ఎస్పీ గారు మరియు పోలీసు అధికారులు గారు.

👮‍♂️ ఉద్యోగ విరమణ పొందిన అధికారులు

అడిషనల్ ఎస్పీ (AR) V సత్తిరాజు
శ్రీ వి సత్తిరాజు గారు 1991 సంవత్సరం లో విశాఖపట్టణంలో RSI గా విధులలో చేరి తర్వాత RI గా ,DSP AR వివిధ హోదాల లో విజయనగరం, విశాఖపట్టణం, రాజమండ్రి లో పని చేసి అడిషనల్ ఎస్పీ గా పదవి పొందిన తరువాత అల్లూరి సీతరామరాజు జిల్లా లో పని చేసి, చివరిగా ADDITIONAL SP (AR) గా పల్నాడు జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఈ రోజు ఉద్యోగ విరమణ పొందినారు. ఈయన తన 35 సంవత్సరాల సర్వీసు లో చేసిన సేవలకు గాను ప్రభుత్వం వారు ఇండియన్ పోలీస్ మెడల్, సేవ పతాకం, ఉత్తమ సేవ పతాకం ఇచ్చి సత్కరించినారు.
(SI -6959)* :-
🫟 శ్రీ *K. నరసదాసు గారు 1989 వ సంవత్సరంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ చేరి, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై గా పలు పోలీస్ స్టేషన్ల నందు విధులు నిర్వహించినారు.
ప్రస్తుతం PCR (పోలీస్ కంట్రోల్ రూమ్)నందు SI గా విధులు నిర్వహిస్తూ ఈ రోజు ఉద్యోగ విరమణ పొందినారు.ఈయన మొత్తం 37 సంవత్సరాల 02 నెలలు సుదీర్ఘంగా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు.

(ASI - 2055)
🫟 శ్రీ MD. జిలానీ గారు 1990 వ సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా చేరి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ గా పని చేస్తూ ప్రస్తుతం DSB,పల్నాడు నందు విధులు నిర్వహిస్తూ ఈ రోజు రిటైర్ అయినారు.ఈయన మొత్తం 36 సంవత్సరాల 01 నెల పోలీస్ విభాగంలో సేవలందించారు.

(WHC - 3070)
🫟 శ్రీ G.రమాదేవి గారు 1994 సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ గా చేరి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ప్రస్తుతం Dial 100 నందు విధులు నిర్వహిస్తూ ఈ రోజు రిటైర్ అయినారు.ఈమె మొత్తం 32 సంవత్సరాల 04 నెలలు పోలీస్ విభాగంలో సేవలందించారు.

(AR HC - 470)
🫟 శ్రీ SK. కరిముల్లా గారు 1983 వ సంవత్సరంలో APSP విభాగంలో కానిస్టేబుల్ గా చేరి,2004 AR నందు గుంటూరు రూరల్ జిల్లా నందు పని చేస్తూ ప్రస్తుతం DAR,పల్నాడు నందు హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఈ రోజు రిటైర్ అయినారు.ఈయన మొత్తం 43 సంవత్సరాల 4 నెలలు పోలీస్ విభాగంలో సేవలందించారు.

(PC - 6909)
🫟 శ్రీ R. సాంబశివరావు గారు 1990 వ సంవత్సరంలో APSP నందు కానిస్టేబుల్ గా విధులలో చేరి 2004 వ సంవత్సరంలో AR విభాగం లోని DAR నందు కానిస్టేబుల్ గా చేరి 2018 వ సంవత్సరంలో కానిస్టేబుల్ గా కన్వర్ట్ అయి ప్రస్తుతం పల్నాడు జిల్లా ఈపూరు పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తూ ఈ రోజు రిటైర్ అయినారు.
ఈయన మొత్తం 36 సంవత్సరాలు పోలీస్ విభాగంలో సేవలందించారు.

(PC - 3002)
🫟 శ్రీ S. పోతురాజు గారు 1993 వ సంవత్సరంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నందు AR కానిస్టేబుల్ గా చేరి 2014 వ సంవత్సరంలో సివిల్ పీసీ గా కన్వర్షన్ అయినారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా రెంటచింతల పిఎస్ నందు నందు విధులు నిర్వహిస్తూ ఈ రోజు రిటైర్ అయినారు.
ఈయన మొత్తం 32 సంవత్సరాల 10 నెలలు పోలీస్ విభాగంలో సేవలందించారు.

( ASI - 1819 )
🫟 శ్రీ P.మధుసూదన రావు గారు ఉమ్మడి గుంటూరు జిల్లా నందు 1990 వ సంవత్సరంలో పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా చేరి వివిధ పోలీస్ స్టేషన్ ల నందు విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు ASI గా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయినారు.
ఈయన మొత్తం 36 సంవత్సరాల 01 నెల పాటు పోలీసు విభాగంలో సేవలు అందించారు.

( ASI - 212 )
🫟 శ్రీ S. వీరాంజనేయులు* గారు ఉమ్మడి గుంటూరు జిల్లా నందు 1990 వ సంవత్సరంలో పోలీసు విభాగంలో కానిస్టేబుల్ గా చేరి వివిధ పోలీస్ స్టేషన్ ల నందు విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం CCS,పల్నాడు నందు ASI గా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయినారు.
ఈయన మొత్తం 36 సంవత్సరాల పాటు పోలీసు విభాగంలో సేవలు అందించారు.

👉 ఈ సందర్భంగా శ్రీ అదనపు ఎస్పీ(పరిపాలన) గారు మాట్లాడుతూ :-

🔅 ప్రజల స్వేచ్ఛ, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు సుదీర్ఘ కాలం పని చేసి ఈ రోజు ఉద్యోగ విరమణ పొందుతున్న వివిధ పోలీసు అధికారులకు అభినందనలు.జీవితంలో, ఉద్యోగంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి, సమాజానికి మంచి పోలీస్ సేవలు అందించిన మీ సేవా, స్పూర్తి మాకు ఆదర్శం.

🫟 "మీరు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయి. దేవుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, మీ కుటుంబ సభ్యులతో శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

👉 ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీసు అధికారులు తమ విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారంటే దానికి వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంటుంది.కావున సుదీర్ఘకాలం ప్రజలకు మంచి పోలీస్ సేవలు అందించిన పోలీసు అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. దేవుడు వారికి,వారి కుటుంబ సభ్యులకు మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను కలిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

👉 ఈ కార్యక్రమంలో గౌరవ అదనపు ఎస్పీ ఎస్ పి గారితో పాటు హోంగార్డ్ RI S.కృష్ణ గారు,వెల్ఫేర్ RI L. గోపీనాథ్ గారు, పల్నాడు జిల్లా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు T. మాణిక్యాల రావు గారు,ఇతర పోలీస్ సిబ్బంది,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ప్రెస్ నోట్పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం...ది.31/08/2026//PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించ...
31/08/2026

ప్రెస్ నోట్
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం...
ది.31/08/2026

//PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి ఉత్తమ పోలీస్ సేవలు అందించడం లక్ష్యం - పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు,.//

🚩 ఈరోజు (సోమవారం -31.08.2026) పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరీ ఐపిఎస్ గారు,.

🔰 PGRS లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 92 ఫిర్యాదులను ప్రజలు పోలీస్ అధికారికి అందజేయగా,వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే పోలీస్ అధికారులకు వాటిని రిఫర్ చేయడం జరిగింది.

🔰 PGRS లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి,క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసి, చట్ట ప్రకారం వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు అదనపు ఎస్పీ గారు సూచించారు.

🔰 PGRS లో తమ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు వాటిని రాసి పెట్టడం లో సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.

పల్నాడు జిల్లా పోలీస్  28.08.2026 🚩 //శాంతి భద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథ...
28/08/2026

పల్నాడు జిల్లా పోలీస్
28.08.2026

🚩 //శాంతి భద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా క్రోసూరు పీస్ 88 తాళ్ళూరు గ్రామం లో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.... //

🔰 పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం:6::00 సత్తెనపల్లి sub division పరిధిలొ క్రోసూరు పిస్ 88తాళ్ళూరు గ్రామం లో సత్తెనపల్లి DSP చైతన్య గారు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

🔰 ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

🔰ఈ తనిఖీ లో 88. తాళ్ళూరు గ్రామం * నందు సరైన పత్రాలు లేని
ద్విచక్ర వాహనాలు - 29
ఆటో. - 01
స్వాధీనం చేసుకున్నారు

🔰 ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ క్రోసూరు పిస్ పరిది లో 88 తాళ్ళూరు గ్రామం లో ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

🔰 హెల్మెట్ వాడకం గురించి,గ్రామంలోని పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112 కు కాల్ చేయాలని తెలిపారు.

🔰రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

🔰 అంతేకాకుండా గ్రామంలోని రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

🔰 పాత కేసుల నిందితుల తో సమావేశమైn పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

🔰 గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా అడిషనల్ ఎస్పీ గారి ఆదేశానుసారం చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు క్రోసూరు పిస్ పరిది లొ గల 88తాళ్ళూరు గ్రామం లొ జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో పెద్దకూరపాడు C I సురేష్ గారు, సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ గారు , అచ్చంపేట CI శ్రీనివాస్ గారు, , క్రోసూరు s i రవి , ముప్పాళ్ళ si, అమరావతి si గార్ల తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు #పల్నాడుజిల్లాపోలీస్ #కార్డన్అండ్సెర్చ్ #క్రోసూరు

26/08/2026

*పల్నాడు జిల్లా పోలీస్*
*26.08.2026*

🚩 //*శాంతి భద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా కారంపూడి పీస్ ఒప్పిచర్ల గ్రామం లో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు....* //

🔰 పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ *శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్* గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం:6::00 గురజాల sub division పరిధిలొ కారంపూడి పిస్ ఒప్పిచర్ల గ్రామం లో గురజాల DSP మహేశ్వర్ రావు గారు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి *ప్రజలకు మేమున్నాము* అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

🔰 ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

🔰ఈ తనిఖీ లొ ఒప్పిచర్ల గ్రామం * నందు సరైన పత్రాలు లేని
ద్విచక్ర వాహనాలు - 18
స్వాధీనం చేసుకున్నారు.

🔰 ఫుట్ పెట్రోలింగ్ చేస్తూ కారంపూడి పిస్ పరిది లో ఒప్పిచర్ల గ్రామం లో ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

🔰 హెల్మెట్ వాడకం గురించి,గ్రామంలోని పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, *మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు.* గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112 కు కాల్ చేయాలని తెలిపారు.

🔰రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

🔰 అంతేకాకుండా గ్రామంలోని రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

🔰 పాత కేసుల నిందితుల తో సమావేశమైn పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

🔰 గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా అడిషనల్ ఎస్పీ గారి ఆదేశానుసారం చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు కారంపూడి పిస్ పరిది లొ గల ఒప్పిచర్ల గ్రామం లొ జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో గురజాల dsp గారు, కారంపూడి రూరల్ సీఐ భాస్కర్ గారు గురజాల టౌన్ CI మురళీ గారు, , కారంపూడి SI vasu, దుర్గి si, సాగర్ si గిరిబాబు గార్ల తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

*పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం,*  *నరసరావుపేట* .  *ది.24/08/2026*  🚩*విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకం : పల్న...
24/08/2026

*పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం,*
*నరసరావుపేట* .
*ది.24/08/2026*

🚩*విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకం : పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు*


క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన ఎనిమిది మంది ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ గారి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున స్కాలర్‌షిప్ తో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ....
🔰విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైనదని, విద్యతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల,సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ గారు తెలిపారు.

🔰విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

🔰విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల వంటి లక్షణాలను అలవర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.

🔰 ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సంస్థలు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గారితో పాటు క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ V.కుటుంబరావు గారు, రీజనల్ మేనేజర్ మక్బూల్ బాషా గారు, ఏరియా మేనేజర్ సాంబయ్య, నరేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

*పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం...*ది.24/08/2026_*//PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి ఉత్తమ...
24/08/2026

*పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం...*
ది.24/08/2026

_*//PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదులను సత్వరంగా పరిష్కరించి ఉత్తమ పోలీస్ సేవలు అందించడం లక్ష్యం - పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారు,.//*_

🚩 *ఈరోజు (సోమవారం -24.08.2026) పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరీ ఐపిఎస్ గారు,.*

🔰 PGRS లో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 94 ఫిర్యాదులను ప్రజలు పోలీస్ అధికారికి అందజేయగా,వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, వాటిని పరిష్కరించే పోలీస్ అధికారులకు వాటిని రిఫర్ చేయడం జరిగింది.

🔰 PGRS లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించి,క్షేత్రస్థాయిలో విచారణ వేగవంతం చేసి, చట్ట ప్రకారం వారికి న్యాయం చేయాలని పోలీస్ అధికారులకు అదనపు ఎస్పీ గారు సూచించారు.

🔰 PGRS లో తమ సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలకు వాటిని రాసి పెట్టడం లో సిబ్బంది సహాయ సహకారాలు అందించారు.

పల్నాడు జిల్లా పోలీసుపత్రికా ప్రకటనతేదీ: 23-08-26ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అ...
23/08/2026

పల్నాడు జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన

తేదీ: 23-08-26

ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాసేవకుడు, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని జిల్లా అడిసినల్ SP శ్రీ రోహిత్ కుమార్ చౌదరి IPS గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్. డి.ఎస్పీ శ్రీ G మహాత్మా గాంధి గారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డి.ఎస్పీ గారు మాట్లాడుతూ...1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా కనుపర్తి గ్రామంలో జన్మించిన టంగుటూరి ప్రకాశం గారు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అపారమైన ధైర్యసాహసాలతో పేరు గాంచారు.

“టంగుటూరి ప్రకాశం గారు కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాదు, న్యాయం, నిజాయితీ, సమానత్వం కోసం నిలబడిన మహానాయకుడు. పోలీస్ శాఖగా మనం ప్రజల హక్కులను రక్షించే క్రమంలో ఆయన చూపిన ధైర్యం, సమర్పణ మనకు స్ఫూర్తి కావాలి” అని పేర్కొన్నారు.

ప్రకాశం పంతులు గారు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రైతుల సంక్షేమం, విద్యా అభివృద్ధి, పారిశ్రామిక రంగం వృద్ధి కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. ఆయన జీవితం ప్రజల సేవకే అంకితం అయింది.

“పోలీసులుగా మన కర్తవ్యం కేవలం చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు, న్యాయం, సమానత్వం, ప్రజల పట్ల కరుణతో కూడిన సేవ అందించడం. టంగుటూరి ప్రకాశం గారి జీవితం మనకు అదే బోధిస్తుంది – నిజం కోసం నిలబడటమే గొప్ప ధైర్యం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు శ్రీ గోపినాథ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

22/08/2026

పల్నాడు జిల్లా పోలీస్
మాచవరం ఘటనపై గురజాల డీఎస్పీ వివరణ

పల్నాడు జిల్లా, మాచవరం మండలం, కొత్త గణేష్‌పాడు గ్రామానికి చెందిన బొంత పెద్ద గురవయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనకు సంబంధించి పోలీసులపై వస్తున్న ఆరోపణలు సరైనవి కావని గురజాల డీఎస్పీ శ్రీ M. మహేశ్వరరావు తెలిపారు.

బొంత పెద్ద గురవయ్యను 06.08.2026 తేదీన మాచవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.56/2026 కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం 41A నోటీసు జారీ చేసి పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా, గతంలో సుమారు ఒక నెల క్రితం Cr.No.66/2023 కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కూడా అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించడం జరిగిందని తెలిపారు. సదరు కేసు 09.09.2026 తేదీన లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున, ఆ కేసుకు సంబంధించి రాజీ ప్రక్రియ నిమిత్తం అతడిని పిలిపించడం జరిగిందని డీఎస్పీ స్పష్టం చేశారు.

మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎటువంటి వ్యక్తిగత కక్షతో గానీ, ఎవరిపైనా ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో గానీ వ్యవహరించలేదని గురజాల డీఎస్పీ తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి, విచారణ అనంతరం వాస్తవాలను వెల్లడిస్తామని గురజాల డీఎస్పీ శ్రీ M. మహేశ్వరరావు తెలిపారు.

21/08/2026

పల్నాడు జిల్లా పోలీస్

🚩 //శాంతి భద్రతల పరిరక్షణ,చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన మరియు నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా వెల్దుర్తి Ps కండ్లకుంట గ్రామం లో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.... //

🔰 పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం:6::00 గురజాల sub division పరిధిలొ గల వెల్దుర్తి పిస్ కండ్లకుంట గ్రామం లో గురజాల DSP గారు పర్యవేక్షణలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు,సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

🔰 ఈ కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను మరియు సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు,ట్రబుల్ మాంగర్స్,పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా... ఇళ్లు, పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

🔰ఈ తనిఖీ లో వెల్దుర్తి పిస్ కండ్లకుంట గ్రామం * నందు సరైన పత్రాలు లేని
ద్విచక్ర వాహనాలు - 30
స్వాధీనం చేసుకున్నారు.

🔰 ఫుట్ పెట్రోలింగ్ చేస్తూవెల్దుర్తి పిస్ కండ్లకుంట గ్రామం లో ప్రజలతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

🔰 హెల్మెట్ వాడకం గురించి,గ్రామంలోని పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని,మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112 కు కాల్ చేయాలని తెలిపారు.

🔰రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

🔰 అంతేకాకుండా గ్రామంలోని రౌడీషీటర్లు,ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు మరియు పాత కేసుల లోని నిందితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

🔰 పాత కేసుల నిందితుల తో సమావేశమైn పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.

🔰 గ్రామంలో అకారణంగా గొడవలు సృష్టిస్తే సహించేది లేదని,గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని, గొడవలు సృష్టించే వారి మీద జిల్లా అడిషనల్ ఎస్పీ గారి ఆదేశానుసారం చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వెల్దుర్తి పిస్ పరిది లో గల కండ్లకుంట గ్రామం లో జరిగిన కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలొమాచర్ల రూరల్ CI వేణు గారు, వెల్దుర్తి SI సత్యనారాయణ గారు, మాచర్ల రూరల్ SI గారు,కారంపూడి SI గారు తో పాటు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు



పల్నాడు జిల్లా పోలీస్... ది.18/08/2026 🪖🏍️ హెల్మెట్ ధరించండి - ప్రాణాలను కాపాడండి🏍️🪖... నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు...
18/08/2026

పల్నాడు జిల్లా పోలీస్...
ది.18/08/2026

🪖🏍️ హెల్మెట్ ధరించండి - ప్రాణాలను కాపాడండి🏍️🪖... నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు గారు

🚩 పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ రోహిత్ కుమార్ చౌదరి ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నరసరావు పేట డీఎస్పీ M. హనుమంత రావు గారి ఆధ్వర్యంలో నరసరావు పేట లోనీ నరసరావుపేట డీఎస్పీ ఆఫీసు నుండి ప్రారంభమైన ర్యాలీ మల్లమ్మ సెంటర్ మీదుగా పాత చెక్పోస్ట్ వరకు * ట్రాఫిక్ పై అవగాహన సదస్సు, హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన నరసరావు పేట సబ్ డివిజన్ పోలీసులు.*

🎤 ఈ సందర్భంగా నరసరావుపేట డిఎస్పి M. హనుమంతరావు గారు
మాట్లాడుతూ....

🔰హెల్మెట్ లేకుండా నడిపే వారి మీద చర్యలు తీసుకుంటామని,
త్రిబుల్ రైడింగ్ నడిపే వారి మీద, సీట్ బెల్ట్ పెట్టుకోని వారి మీద, మైనర్లు వాహనాలు నడిపే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
🔰 ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న వాటిలో మరియు ప్రమాదాల వల్ల మరణించే వారిలో ఎక్కువగా తలకు గాయాలు అయి చనిపోవడం జరుగుతుంది. దానిని నివారించాలి అంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు .

🔰 హెల్మెట్ ధరించడం వలన చిన్నచిన్న ఇబ్బందులు చూపి పక్కన పెట్టడం అనేది సరైన కారణం కాదని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
🔰 ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుసుకొని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.

🪖 వాహనదారులు హెల్మెట్‌ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్‌ ధరించి వాహనాలు నడపటం వలన తలకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని నరసరావుపేట డి.ఎస్.పి M. హనుమంత రావు గారు తెలిపారు.

👉 హెల్మెట్ ధరించడం వలన ఉపయోగం :-

🪖 హెల్మెట్ ధరించడం వలన మీ మెదడుకు తీవ్రమైన గాయం మరియు మరణం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే పడిపోయినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు, మీ తల మరియు మెదడు కంటే ఎక్కువ ప్రభావం హెల్మెట్ ద్వారా గ్రహించబడుతుంది.

🪖 అదే విధంగా మీ తల, ముఖం మరియు మెదడును గాయం నుండి రక్షించి,మిమ్మల్ని బలమైన గాయాల బారి నుండి రక్షిస్తుంది.

🪖 హెల్మెట్ ధరించడం వలన ప్రమాదకరమైన సూర్య కిరణాలు(అతినీలలోహిత కిరణాలు) నేరుగా మీ కళ్ళలో పడకుండా చేసి మీ కంటి చూపును ప్రభావితం కాకుండా చేస్తుంది. హెల్మెట్ విజర్ సూర్యుని నుండి మీ ముఖానికి నీడనిస్తుంది మరియు వర్షం లేదా మంచు మీ కళ్ళలోకి రాకుండా చేస్తుంది.

🚦 రోడ్డు భద్రతా నియమాలను పాటించండి 🚦

ట్రాఫిక్ సదస్సు పై అవగాహన కల్పిస్తూ..

🔹ట్రాఫిక్ సిగ్నల్స్, చిహ్నాల అర్థం చెప్పడం జరిగింది.

🔹హెల్మెట్, సీట్‌ బెల్ట్ వాడకం పై అవగాహన కల్పించడం జరిగింది.

🔹ఓవర్‌ స్పీడ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వచ్చే ప్రమాదాలు గురించి వివరించడం జరిగింది.

🔹పాదచారుల భద్రత,జీబ్రా క్రాసింగ్ వాడకం గురించి వివరించడం జరిగింది.
🔹 అదేవిధంగా మైనర్లు ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ చేయరాదని పిల్లలపై ఉన్న మమకారంతో ఎవరు వాహనాలను ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు.

👉 ఈ ర్యాలీ కార్యక్రమంలో నందు నరసరావు పేట డీఎస్పీ M. హనుమంతరావు గారు ,నరసరావు పేట ట్రాఫిక్ సిఐ CH. లోకనాథం గారు, నరసరావుపేట ఒకటవ పట్టణ సిఐ SK.T.ఫిరోజ్ గారు, నరసరావుపేట రెండవ పట్టణ సిఐ ప్రభాకర్ గారు, నరసరావుపేట రూరల్ సీఐ సుబ్బారావు గారు నరసరావుపేట సబ్ డివిజన్ సీఐ లు, ఎస్సైలు, MVI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Address

Narasaraopet

Alerts

Be the first to know and let us send you an email when Palnadu Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Palnadu Police:

Shortcuts

Share