08/06/2023
*తెలంగాణ ప్రభుత్వం. ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ,
*****************
*ఆయిల్ పామ్ పంట ఎందుకు పండించాలి?* // **ఆయిల్ పామ్ సాగు ఆవశ్యకత.*
*1. మన దేశ తలసరి వంట నూనెల వాడకం 21.70 కిలోలు/ సంవత్సరానికి,*
*2. దేశ జనాభా సుమారు 134 కోట్లు -*
3. సాలీన వంట నూనెల అవసరం(ఆహారంగా)
29.08 మీ. టన్నులు+
పారిశ్రామిక అవసరాలు 4.12 మి. టన్నులు
*మొత్తం అవసరాలు 33.20 మి.టన్నులు**
4. మన దేశ వంట నూనెల ఉత్పత్తి (ఏకవార్షిక పంటలు & ఆయిల్ పామ్
నుండి) 17.03 మి. టన్నులు.
5. విదేశాల నుండి దిగుమతి - 16.17 మి.టన్నులు …
6.దేశంలో *ఏటా ముడి పామాయిల్ ఉత్పత్తి 2.90 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, డిమాండ్ 100 లక్షల మెట్రిక్ టన్నులకు* పైగా ఉంటుందని అంచనా. ఈ లోటు దిగుమతుల ద్వారా తీరుతుంది.
7. ఈ *దిగుమతి ఖర్చు ని భారతదేశ ప్రభుత్వం ఏటా - 70 వేల కోట్లు* భారత ప్రభుత్వం ఇతర దేశాలకు చెల్లిస్తున్నది.
8. *మన దేశ అవసరాలకు సరిపడా నూనె ఉత్పత్తిలో స్వయం సమృద్ధి* *చెందాలంటే కావల్సిన తోట విస్తీర్ణం - *75 లక్షల ఎకరాలు.* కానీ ప్రస్తుతం మనదేశంలో సాగుతున్న ఆయిల్ పామ్ తోటల పంట విస్తీర్ణం *9.25 లక్షల ఎకరాలు.*
అంతేకాకుండా
*నూనె ఉత్పాదక సామర్థ్యాన్ని కూడా నూనె పంటల్లో చూసినట్లయితే*
*1. ఆయిల్ పామ్:1.70-2.0 టన్నులు/ ఎకర/ సంవత్సరానికి*
2. ఆవాలు: 0.27 టన్నులు/ ఎకర/ సంవత్సరానికి
3. తిరుగుడు: 0.20టన్నులు/ ఎకర/ సంవత్సరానికి
4. వేరు శనగ : 0.18 టన్నులు/ ఎకర/ సంవత్సరానికి
5. సోయా : 0.15 టన్నులు/ ఎకర/ సంవత్సరానికి.
ఆయిల్ పామ్ యూనిట్ విస్తీర్ణంలో *అత్యధిక నూనె ఉత్పత్తి 1-2 టన్నులు/ఎకరానికి ఐతే ఇది ఇతర నూనె గింజల పంటల కంటే 8-10 రెట్లు ఎక్కువ.*
నూనె ఉత్పత్తి స్థాయి పరంగా ఆయిల్ పామ్ అత్యంత సమర్థవంతమైనది. *ఒక టన్ను నూనె ఉత్పత్తి చేయడానికి 0.625 ఎకరాలు మాత్రమే అవసరం అవుతుంది. సోయా బీన్, పొద్దుతిరుగుడు మరియు రాప్‌సీడ్‌లకు ఒక టన్ను నూనె ఉత్పత్తి అవ్వటానికి ఇది వరుసగా 5.375 ఎకరాలు, 3.75 ఎకరాలు మరియు 1.875 ఎకరాలు అవసరం పడును.*
దీనికి తోడు పర్యావరణ హితము. *ఎకరము పామాయిల్ తోట సంవత్సరములో 12.11 టన్నులు కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని 8,784 టన్నుల ఆక్సిజన్ విడుదల చేయును.*
*ఈ విధంగా ముడి పామాయిల్ ఉత్పత్తి డిమాండు, నూనె ఉత్పాదక సామర్థ్యం దీనిని తోడు పర్యావరణహితము అన్నిట్లోనూ నూనె గింజల పంటల్లో ఆయిల్ చాలా ఉత్తమమైన పంటగా ప్రభుత్వం గుర్తించి, దీనికి తోడు దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశ మరియు తెలంగాణ ప్రభుత్వం ఈ పామాయిల్ తోటలో సాగు విస్తీర్ణాన్ని భారీగా ప్రోత్సహిస్తున్నది.*