20/06/2024
నర్సంపేట:-
*విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి*
- ఏబీవీపీ వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్
అఖిలభారతి విద్యార్థి పరిషత్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సంధర్బంగా వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జల దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ఇప్పుడు గద్దెనెక్కి విద్యార్ధులను మోసం చేసింది అని అన్నారు.. ఈ రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖ కు మంత్రి లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటు అని, తాగుబోతులకు ఉన్న విలువ విద్యార్థులకు లేదు అని మద్యానికి ఉన్న విలువ విద్యకు లేదు అని ఎద్దేవా చేశారు,ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలనీ, ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలనీ, నిభందనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాల పైన కఠిన చర్యలు తీసుకోవాలనీ, ప్రభుత్వ గుర్తింపు మరియు నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా వెంటనే భర్తీచేయాలని వెంటనే డిఈఓ, ఎంఈఓ అధికారులను నియమించి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని అన్నారు,ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతున్న మధ్యాహ్నభోజనంలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ
జరిపించి నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారుల పైన మరియు కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలనీ, మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనీ మాట్లాడారు, మెగా డీఎస్సీ ద్వారా ఇరవై నాలుగు వేల పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ మరియు స్క్యావెంజర్లను నియమించాలి అలాగే విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచితం సీట్లు కేటాయించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నాల శశి కుమార్, కార్యకర్తలు:- ఆది, జశ్వంత్, కార్తిక్, విక్కీ, సిద్దు తదితరులు పాల్గొన్నారు.