Darni Madhu 32 Division

Darni Madhu 32 Division Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Darni Madhu 32 Division, Public Service, CCC X Road, Naspur.

05/08/2026

*మంచినీటి పైపులైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు*భారీ వర్షాలు, వరద ఉదృతి కారణంగా మంచిర్యాల ...
04/08/2026

*మంచినీటి పైపులైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు*

భారీ వర్షాలు, వరద ఉదృతి కారణంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ దెబ్బతినడంతో పాటు, పునరుద్ధరణ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది.

*వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో, గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించారు.*

వరద ఉదృతి తగ్గిన తర్వాత పనులు వేగవంతం చేసినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కురిసిన వర్షాలకు మళ్ళీ వరద ప్రవాహం పెరిగి పనుల నిర్వహణకు ఆటంకం ఏర్పడినప్పటికీ గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాలతో ఆధునిక చైన్ jcb ల సహాయంతో వరద నీటి ప్రవాహాన్ని మళ్ళించి పైపులైన్ నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతున్నది.
అధికారులు, సిబ్బంది సమన్వయంతో పైపులైన్ మరమ్మతు పనులను మరింత వేగవంతం చేయాలని మంచిర్యాల మేయర్ గారు ఆదేశించారు.

నగర ప్రజలకు తాగునీటి సరఫరా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేస్తూ అక్కడే ఉండి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

*నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరాను త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు తెలిపారు.*

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్ గార్లు, నంబయ్య గారు,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారు,DE రాజేందర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మంచిర్యాల నియోజకవర్గం ..హాజీపూర్ మండల గడపూర్ శివారులోని ఎంసీసీ క్వారీ శ్రీ దుర్గాదేవి జాతరలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్...
02/08/2026

మంచిర్యాల నియోజకవర్గం ..

హాజీపూర్ మండల గడపూర్ శివారులోని ఎంసీసీ క్వారీ శ్రీ దుర్గాదేవి జాతరలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు..

ఈ సందర్భంగా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు..

అనంతరం జాతరకు విచ్చేసిన భక్తులను ఆప్యాయంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు పలకరించారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ , మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, జిల్లా అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, వొడ్డె రాజమౌళి, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి సందర్శించిన మంచిర్యాల శాసన...
01/08/2026

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును
రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి మట్టం, ఇన్ ఫ్లో-అవుట్లో పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వరద పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

01/08/2026

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును
రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి సందర్శించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రాజెక్టులోని నీటి మట్టం, ఇన్ ఫ్లో-అవుట్లో పరిస్థితులను అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, వరద పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిగువ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని

*భారీ వర్షాల అనంతరం మంచినీటి పైపులైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు*గత రెండు రోజులుగా ఎడతెర...
01/08/2026

*భారీ వర్షాల అనంతరం మంచినీటి పైపులైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు*

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరద ఉదృతి కారణంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మంచినీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైన్ దెబ్బతినడంతో పాటు, పునరుద్ధరణ పనులకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది.

*వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో, గౌరవ మంచిర్యాల శాసన సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుదరి తిరుపతి గారితోమరోసారి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి పునరుద్ధరణ పనుల పురోగతిని పరిశీలించారు.*

అధికారులు, సిబ్బందితో మాట్లాడి పైపులైన్ మరమ్మతు పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నగర ప్రజలకు తాగునీటి సరఫరా సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేస్తూ అక్కడికక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు.

*నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరాను త్వరలోనే పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు తెలిపారు.*

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్ గార్లు, DE రాజేందర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సిబ్బంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Address

CCC X Road
Naspur
504302

Website

Alerts

Be the first to know and let us send you an email when Darni Madhu 32 Division posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category