BJP4Nawabpet Mandal

BJP4Nawabpet Mandal Official page for BJP_Chevella

23/03/2026
🔸ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని కలిసిన నవాబ్ పేట్ మండల బీజేపీ నాయకులు... 🔸చిట్టిగడ్డ మరియు గుల్లగూడ రైల్వే స్టేషన్...
28/02/2026

🔸ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని కలిసిన నవాబ్ పేట్ మండల బీజేపీ నాయకులు...

🔸చిట్టిగడ్డ మరియు గుల్లగూడ రైల్వే స్టేషన్‌లో రైలు ఆపేందుకు ముందస్తుగా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు.

🔸 స్టేషన్‌లో రైలు ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సమర్పించిన వినతి పత్రంపై మీరు వెంటనే స్పందించి, ఇప్పటికే సెంట్రల్ అధికారులకు లేఖ పంపినట్లు తెలియజేయడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలాగే మరి కొన్ని గ్రామ అభివృద్ధి కోసం అడగటం జరిగింది దానికి కూడా మన MP గారు స్పందిస్తూ తన స్వంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తా అని మాట ఇవ్వటం జరిగింది.

🔸ప్రజల సమస్యను గమనించి, ముందుగానే చర్యలు తీసుకోవడం మీ ప్రజాహిత దృక్పథానికి నిదర్శనం. మీ తక్షణ స్పందనకు మరియు మా ప్రాంత అభివృద్ధికి మీరు చూపుతున్న చొరవకు మా గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.

🔸భవిష్యత్తులో కూడా మీ సహకారం అందించాలని మండల నాయకులు మనవి చేశారు, ఈ కార్యక్రమం లో బీజేపీ చేవెళ్ల ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే కే.ఎస్ రత్నం గారు, బీజేపీ మండలం అధ్యక్షులు చంద్రకాంత్ గారు, బీజేపీ అసెంబ్లీ జాయింట్-కన్వీనర్ రమేష్ గారు, దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు గలయ్య గారు, వట్టి మీనాపల్లి సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు, చిట్టిగిద్ద సర్పంచ్ శ్రీధర్ గారు, ఉప సర్పంచ్ గొల్లగూడెం మహేందర్ గారు, చిట్టిగిద్ద అర్జున్ గారు, నాగిరెడ్డి పల్లి దిరత్ రెడ్డి, గారు వార్డ్ మెంబెర్స్ భీమ్ రెడ్డి గారు, మల్లేశం గారు, మండలం మాజీ దళిత మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నర్సిములు గారు, రమేష్ గారు మాణిక్యం గారు పాల్గొన్నారు.
Konda Vishweshwar Reddy K.S.Ratnam
BJP Telangana BJP4Vikarabad

ఈ రోజు దాతాపురం గ్రామానికి చెందిన ఉరడి అశోక్ గారు మాజీ శాసనసభ్యులు, బీజేపీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జ్ రత్నం అన్న గారి...
09/01/2026

ఈ రోజు దాతాపురం గ్రామానికి చెందిన ఉరడి అశోక్ గారు మాజీ శాసనసభ్యులు, బీజేపీ చేవెళ్ల నియోజకవర్గం ఇన్చార్జ్ రత్నం అన్న గారి మరియు మండల అధ్యక్షులు చంద్రకాంత్ గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది

ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, దళిత మోర్చ నాయకులు గాలయ్య, ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, నరేగూడ బూత్ అధ్యక్షులు వెంకట్, శంకరయ్య, కిష్టయ్య, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

ఈరోజు ఎంపీ గారి కార్యాలయంలో వట్టిమినపల్లి గ్రామ సర్పంచ్ మానెమ్మ - రాంరెడ్డి (చంద్రశేఖర్ రెడ్డి)  గారు మరియు గ్రామం నుండి...
29/12/2025

ఈరోజు ఎంపీ గారి కార్యాలయంలో వట్టిమినపల్లి గ్రామ సర్పంచ్ మానెమ్మ - రాంరెడ్డి (చంద్రశేఖర్ రెడ్డి) గారు
మరియు గ్రామం నుండి అధిక సంఖ్యలో గ్రామస్తులు భారతీయ జనతా పార్టీలో ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు చేవెళ్ల మాజీ శాసనసభ్యులు రత్నం గారి, మండల అధ్యక్షులు చంద్రకాంత్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది
🔸 తదనంతరం నూతన సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి సుదీర్ఘంగా రాబోవు ఎన్నికల గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని ప్రజా నాయకులను ఉద్దేశించి సందేశాన్ని అందివ్వడం జరిగింది
🔸 తను అభివృద్ధికి ఎప్పుడూ పెద్ద పీట వేస్తానని చెబుతూ తను చెప్పిన విధంగా గ్రామాలు అభివృద్ధి చెందడానికి తన ప్రత్యేక దృష్టి ఉంటుందని ఎల్లవేళలా ప్రజా నాయకులకు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు
🔸 ఇప్పటి గెలుపుకి కృషిచేసిన విధంగానే రాబోవు ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో బిజెపిని మరింత బలపరిచి విజయం దిశగా పయనించాలని సూచించారు
🔸 గ్రామాలలో ఎలాంటి అభివృద్ధికైనా ఎంపీ లాండ్స్ మరియు ఎన్ఆర్జిఎస్ నుంచి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని సరైన ప్రణాళికతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు
🔸 అసెంబ్లీ నాయకులలో అత్యంత అనుభవం కలిగిన నాయకులు రత్నం లాంటి మనిషి కే.ఎస్ రత్నం గారి అండదండలు మీకు ఎప్పటికీ ఉంటాయని నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను ఎంతగానో కృషి చేస్తున్నారని వివరించారు
🔸 నాయకుల అవసరాలకు మరియు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తన ఎంపీ కార్యాలయం తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని తాను లేకపోయినా సంబంధిత సిబ్బందిని సంప్రదించవచ్చని వచ్చిన నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు

05/11/2025

నవాబుపేట్ మండల కేంద్రంలో రోడ్ల కోసం BJYM ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేపట్టడం జరిగింది...

16/10/2025
⛈️🍃 *రైతుల పక్షాన బీజేపీ* ⛈️🍃 *పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న బీజేపీ నాయకులు* ⛈️🍃భారతీయ జనతా పార్టీ నవాబ్ పేట్ మండల శా...
29/09/2025

⛈️🍃 *రైతుల పక్షాన బీజేపీ*
⛈️🍃 *పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలన్న బీజేపీ నాయకులు*

⛈️🍃భారతీయ జనతా పార్టీ నవాబ్ పేట్ మండల శాఖ ఆధ్వర్యంలో ఈమధ్య కురిసిన అతి వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి, నష్టపోయిన పంటను చిట్టిగిద్ద, కేశపల్లి గ్రామాలలో సందర్శించి సంబంధిత అధికారులకు మెమొరాండం ఇవ్వడం జరిగింది
⛈️🍃 ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిలు ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రావు మాట్లాడుతూ....
⛈️🍃భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని పసిగట్టిన సంబంధిత శాఖ మరియు ప్రభుత్వం రైతుల పరిస్థితి మరియు రైతులకు ఎంత పంట నష్టం జరగవచ్చు అని సంబంధిత శాఖగానీ ప్రభుత్వం గాని ఎటువంటి అంచనాలు, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు
⛈️🍃 చేవెళ్ల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌ"ఎమ్మెల్యే కాలె యాదయ్య గారు రైతులపై ఎలాంటి దృష్టి సాగించకుండా ప్రజలను పట్టించుకోకుండా ప్రజల కనీస మౌలిక వసతులైన రోడ్డు మరియు ఇంకే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరపట్లేదనీ, పోయినసారి ఎలక్షన్లకి ముందు కేశవపల్లి గ్రామస్తులు మాకు రోడ్డు వేయకుంటే గ్రామంలోకి రావద్దని అడ్డుకుంటే హుటాహుటిన ఎలాంటి కనీస పారామీటర్స్ లేకుండా వరద నీరు ఎటువైపు వెళుతుంది ఎక్కడ బ్రిడ్జిలు మరియు కాలువల అవసరము చూసుకోకుండా ఎలక్షన్ కి మూడు రోజుల ముందు రోడ్డు వేసి ఇప్పుడు రోడ్డు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి పదుల సంఖ్యలో ఎకరాలకు ఎకరాల భూమి కొట్టుకుపోయి పంట నష్టానికి కారణమయ్యిందనీ, అభివృద్ధి పేరు చెబుతూ పార్టీలు మారినా మూడు పర్యాయాలు అభివృద్ధి శూన్యమేనని తెలియజేశారు
⛈️🍃 అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు గడుస్తున్న ప్రజలకు గాని యువతకు గాని రైతులకు గాని చేసింది "గాడిద గుడ్డే" అని ఇచ్చింది "గుండు సున్నా" అని మండిపడ్డారు రాబోవు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు
⛈️🍃 రైతే దేశానికి వెన్నుముక రైతే రాజు అన్న వాక్యాలు కేవలం మాటలకు మాత్రమే సరిపోతుందని చేతులలో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతుందని పాలనలో పూర్తిగా విఫలమయ్యిందని తెలిపారు
⛈️🍃మూసీనది ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతాలలో పొలాలు మునిగిపోవడం మరియు అక్కడక్కడ అన్ని గ్రామాలలో ఎంతో కొంత నష్టం జరిగిందని, దీనికి సంబంధించి అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు వచ్చే పార్టీ రైతులకు రాష్ట్ర పరిహారాన్ని చెల్లించాలని, మరొక రెండు రోజుల తర్వాత ఈ విషయంపై మండల మంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వారు ఏం చర్యలు చేపట్టారు తెలియజేయాల్సి ఉంటుందనీ తెలిపారు
⛈️🍃 *రైతు శ్రీనివాస్* మాట్లాడుతూ తీవ్ర వరద నీరుకు తమ పొలంలోని పంట మొత్తం నాశనమైందని పంట కోసం ఏర్పాటు చేసుకున్న దానికి సంబంధించిన అనేక పరికరాలు వరదలో కొట్టుకుపోయారని లక్షల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు
⛈️🍃 *రైతు అంజయ్య* మాట్లాడుతూ రోడ్డు కొట్టుకుపోవడం వల్ల ఇంతటి పంట నష్టం జరుగుతుందని అనుకోలేదని ఒకవేళ ఇలా జరిగితే లక్షల పెట్టుబడి పెట్టి పంటలు వేసే వారం కాదని ప్రభుత్వం దీనిపై తగు చర్యలు తీసుకొని నష్టపరిహారాన్ని చెల్లించి రైతులకు న్యాయం చేయాలని తెలియజేశారు
⛈️🍃 *రైతు నారాయణ* మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు వెంటనే ఈ విషయంపై స్పందించి పేద రైతులకు చేయూతనిస్తూ వారికి నష్టపరిహారం చెల్లిస్తూ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి ఐటీ సెల్ కో- కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శిలు ప్రభాకర్ రెడ్డి శ్రీధర్ రావు జిల్లా నాయకులు సారా జగన్ గాలయ్య రత్నం పద్మారావు రామిరెడ్డి అరుణ్ మల్లారెడ్డి మహేందర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రైతులు శేఖర్ బందయ్య కొండారెడ్డి నరసింహారెడ్డి రమేష్ మల్లయ్య కృష్ణ సీనియర్ నాయకులు నరసింహులు వేణుగోపాల్ శ్రీకాంత్ యువర్ మోర్చా నాయకులు మణికంఠ రెడ్డి మహేందర్ ప్రభాకర్ వందేమాతరం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Address

Nawabpet
Nawabpet
501111

Alerts

Be the first to know and let us send you an email when BJP4Nawabpet Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share