P. Roop Kumar Yadav Nellore City

P. Roop Kumar Yadav Nellore City Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from P. Roop Kumar Yadav Nellore City, Political Party, Atmakur Bustand, Near James Garden, Nellore.

*దమ్ముంటే చర్చకు రా**.. దొంగ ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందిన నువ్వా మాట్లాడేది**... వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత రెడ్డిక...
02/04/2024

*దమ్ముంటే చర్చకు రా*

*.. దొంగ ఓట్లతో ఎమ్మెల్సీగా గెలుపొందిన నువ్వా మాట్లాడేది*

*... వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత రెడ్డికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ సవాల్*

రాజకీయాల్లో ఎమ్మెల్సీ చంద్రశేఖర రెడ్డికి ఏడాది అనుభవం మాత్రమే ఉంది

నెల్లూరు సిటీలో అణువణువూ నాకు తెలుసు.

నీ స్థాయికి నారాయణతో అవసరం లేదు.. నాతో చర్చకు రా..

దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ అయిన నీకు సమాధానం చెప్పాలా..

విజయ సాయి రెడ్డి తాను పేదవాడినని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు

కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్...విజయవాడలకు. రాకపోకలు సాగించేందుకు స్పెషల్ ఫ్లైట్ లు ఉపయోగించారు.

దానికి ఆధారాలు కూడా ఇస్తాను

ఈ పేదోడికి శంషాబాద్ వద్ద 10 ఎకరాల పొలం ఉంది

ఎన్నికల ప్రచారంలో బూటకపు హామీలు ఇస్తున్నారు

దగదర్తి వద్ద అంతర్జాతీయ
ప్రమాణాలతో విమానాశ్రయం తీసుకువస్తానని చెప్పారు

ఆరు నెలల్లో అండర్ పాస్ లు నిర్మిస్తానని హామీ ఇస్తున్నారు

ఐదేళ్లు మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా.
ఎందుకు చేయలేదు సాయన్నా

ప్రభుత్వంలో నెం.2 గా ఉన్నావు

ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలంటే సంస్కారం అడ్డం వస్తోంది

02/04/2024
02/04/2024

విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు

నెల్లూరు జిల్లా,  కావలి నియోజకవర్గంలో జరుగు ప్రజాగళం సభలో పాల్గొనేందుకు కావలిలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకున్న మా...
29/03/2024

నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో జరుగు ప్రజాగళం సభలో పాల్గొనేందుకు కావలిలోని జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ కు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని ఘన స్వాగతం పలికిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు...

28/03/2024

MLC చంద్రశేఖర్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు...

*నెల్లూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షులు మరియు MLC  పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన నెల్లూరు డిప...
28/03/2024

*నెల్లూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షులు మరియు MLC పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్..*

*పర్వత రెడ్డి ఏరోజైనా వైసీపీ జెండా మోసావా..*

*... పార్టీ ఆవిర్భావం అయినప్పుడు 2019 ఎన్నికల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు*

*.. విమర్శలు పద్ధతిగా చేయకుంటే పెద్ద ముసుగు తొలగిస్తాం..*

*. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 564 కోట్ల అయితే 800 కోట్లని చెప్పావు.*

*.. నీకు స్క్రిప్ట్ రాసించిన పనికిమాలిన వాడు ఎవరు*

*.. కార్పొరేషన్ గురించి నీకు ఏం తెలుసు*

*.. ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరే పరిస్థితి నీది*

*. నువ్వు మాజీ మంత్రి నారాయణ పై విమర్శలు చేయడమా*

*.. అరగంటసేపు ప్రెస్ మీట్ లో ఉపన్యాసం చెప్పావు అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్కసారి అన్న చెప్పావా*

*నారాయణ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్ర శేఖర్ రెడ్డికి లేదు...*

*చంద్ర శేఖర్ రెడ్డి రాజకీయంగా ఒక సంవత్సరం వున్న చిన్న బేబీ...*

*. నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ఎగిరెగిరి పడుతున్నావు*

*ఎండ్ టు ఎండ్ రోడ్డు పనులు గురించి,భూగర్భ డ్రైనేజీ,వాటర్ పనులు విషయం లో నువ్వు చేసిన ఆరోపణలు అన్నీ అసత్యాలు,*

*ఒక్క సారి విదేశాలకు వెళ్లి చూడు ఎండ్ టు ఎండ్ రోడ్లు గురించి తెలుస్తుంది...*

*దేశంతో పాటు అంతర్జాతీయంగా ఎంతో పేరున్న ఎల్ & టి కంపెనీ నాణ్యత తో భూగర్భ డ్రైనేజీ పనులు చేసింది...*

*చంద్ర శేఖర్ రెడ్డి పెద్ద మనిషిగా చాలామణి అవుతున్నాడు నేను మాట్లాడితే నీ పెద్ద మనిషి ముసుగు తొలగి పోతుంది....*

*రాజకీయాల్లో నేను కార్పొరేటర్ అయ్యేనాటికి నీకు రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు..*

*ఏ పార్టీ అధికారం లో వుంటే ఆ పార్టీ నాయకులు ఇళ్ళ గేటు దగ్గర తిరిగిన విషయం మరిచిపోకు...*

*కాంగ్రెస్ పార్టీ అధికారం లో వున్నప్పుడు ఆనం వాళ్ళ ఇంటిదగ్గర,టిడిపి హయాంలో నారాయణ ఇంటిదగ్గర,వైసిపి అధికారం లో వున్నప్పుడు అనిల్ ఇంటి దగ్గర గేటు దగ్గర వున్న కాలం మరిచి పోకు...*

*వైసిపి పార్టీ లో ఏనాడు జెండా మోయని చంద్ర శేఖర్ రెడ్డికి ఆ పార్టీ లో MLC గా ఎలా ఎన్నికైనారో అందరికీ తెలుసు...*

*వైసిపి జిల్లా అధ్యక్షులుగా వచ్చిన చంద్ర శేఖర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పడానికి కూడా ఇష్ట పడటం లేదు*.

*వైసిపి పార్టీ కోసం నేను ఎంత కష్ట పడ్డానో నాకు తెలుసు....*

*విజయ సాయిరెడ్డిని అండ చూసుకున చంద్ర శేఖర్ రెడ్డి ఏదంటే అది మాట్లాడుతున్నాడు.*

*రాజకీయాల్లో చంద్ర శేఖర్ రెడ్డి అనుభవం ఒక సంవత్సరం,అనుకోకుండా ఎమ్మెల్సీ గా జిల్లా అధ్యక్షుడిగా వచ్చేసి జిల్లా అంతా నాదే అనుకుంటున్నాడు...*

*ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు SR తహసీన్ ఇంతియాజ్, అస్మా మైనుద్దీన్, దేవరకొండ సుజాత అశోక్, గోగుల నాగరాజు, నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, కలికి శ్రీధర్ రెడ్డి, నిశ్చల్ కుమార్ రెడ్డి, అల్లంపాటి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..*

*నెల్లూరు...**నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి, విమర్శలు ప్రతి విమర్శలు మొదలయ్యాయి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న...
24/03/2024

*నెల్లూరు...*

*నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి, విమర్శలు ప్రతి విమర్శలు మొదలయ్యాయి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టిడిపి ఎంపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పై చేసిన విమర్శలకు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి అదే రీతిలో ఘాటైన ప్రతి విమర్శలు చేశారు*

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ...

నెల్లూరు జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది..

మాట్లాడడం మొదలు పెడితే నీకన్నా గలీజుగా మాట్లాడుతాం...

నీ చరిత్రను వీధిలో పెడతాం...

నెల్లూరు జిల్లా నుండి పుచ్చలపల్లి,నేదురుమల్లి, నల్లపురెడ్డి లాంటి వారు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర వుంది ..

దురదృష్ట వశాత్తూ కోవూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వారి సతీమణి ప్రశాంతి రెడ్డి ని నోటికొచ్చినట్టు మాట్లాడారు..

మేము కొండపల్లి గురవయ్య దగ్గరనుండి మాట్లాడడం మొదలు పెడితే ప్రసన్న కుమార్ రెడ్డి తట్టుకొలేడు,

ఇంగిత జ్ఞానం మరిచి మాట్లాడుతున్న ప్రసన్న అన్నకు మా గురించి బాగా తెలుసు,విమర్శలు చేయడం మొదలు పెడితే నీకన్నా ఎక్కువ చేస్తాం

నిన్న మొన్నటి దాకా వేమిరెడ్డి ఇంటిదగ్గర కు వచ్చ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర తిరిగిన విషయం మరిచి పోయావా...

మీ కుల దైవం కోటమ్మ గుడిలో నాకు అన్నదమ్ములు లేరు వారికి పిండ ప్రధానం చేసిన చరిత్ర నీది..

*విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతూ..*

సాయిరెడ్డి ఇది విశాఖ కాదు నెల్లూరు,

మా ప్రాంతంలో నిన్న ఒక పెద్దాయన పర్యటించారు కనీసం ఆయన పర్యటించిన ప్రాంతంలో కార్పొరేటర్ పేరు తెలియదు ....

నీ ఓటు ఎక్కడ వుంది విజయ సాయిరెడ్డి?విశాఖ లోని సీతమ్మధార లో నీ ఓటు వుంది...

జగన్మోహన్ రెడ్డి నిన్ను విశాఖ నుండి తరిమేశాడు సాయిరెడ్డి...

నీ అల్లుడు అరవిందో కంపెనీల పేరుతో విశాఖ నుండి,పోర్టు ల నుండి ఏమీ చేస్తున్నాడో తెలియదా...

రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం మళ్ళీ రాధని నీ అల్లుడు చేత 50 కోట్లు బిజెపి పార్టీకి ఇప్పించావు..

నీకు వేమిరెడ్డి కి పోలికా సాయి రెడ్డి,జిల్లా లో ఒక్కో చోట ఒక్కొక్క మ్యానిఫెస్టో పెడతాడు అంట..

150 కోట్లతో విశాఖ లో ప్యాలెస్ కడుతున్న సాయిరెడ్డి నిరుపేద అంట..

విజయ సాయిరెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగానే నెల్లూరు జిల్లాలో ప్రజలు తమ స్థలాలకు కంచెలు వేసుకుంటున్నారు..

వేమిరెడ్డి సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎన్నో సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

మీరు ఏమిచేసారో ఏమీ చేస్తారో ప్రజలకు చెప్పుకోండి,అంతే కానీ మా వేమిరెడ్డి జోలికి వస్తే తట్టుకోలేరు...

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు SR తహసీన్ ఇంతియాజ్, గోగుల నాగరాజు, దేవరకొండ సుజాత, అస్మా మైనుద్దీన్, నెల్లూరు జిల్లా టిడిపి సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, నిశ్చల్ కుమార్ రెడ్డి, అల్లంపాటి జనార్దన్ రెడ్డి. మైనారిటీ నాయకులుSk హాజీ, ఫజల్, ఇలియాస్, సమి తదితరులు పాల్గొన్నారు...

నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారి కార్యాలయంలో పండుగ వాతావరణం..రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నెల్లూ...
15/03/2024

నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారి కార్యాలయంలో పండుగ వాతావరణం..

రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ, రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లను ఘన స్వాగతం పలికిన నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు..

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు వందలాదిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల నడుమ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, పొంగూరు నారాయణ గారిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఘన స్వాగతం పలికి వేద పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భారీ గజమాలతో సత్కరించిన నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు.

*ముస్లిం మతపెద్ద ముఫ్టీ అబ్దుల్ వహాబ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్‌ ఎమ్మెల్యే కో...
11/03/2024

*ముస్లిం మతపెద్ద ముఫ్టీ అబ్దుల్ వహాబ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు..*

*రాజ్యసభ సభ్యులు, టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు.. సోమవారం ముస్లిం మత పెద్దలను కలిశారు.*

* నెల్లూరు నగరంలోని జామియా నోరుల్ హుదా మదర్సా కు వెళ్లిన వారు.. ముస్లిం మతపెద్ద ముఫ్టీ అబ్దుల్ వహాబ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు SR ఇంతియాజ్, మైనుద్దీన్, మదీనా వాచ్ ఇంతియాజ్, మైనారిటీ నాయకులు SK హాజీ, ఫజల్, సికో, సమిఉల్ల తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయ...
02/03/2024

నెల్లూరు నగరంలోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన నగర డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు....

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్**. వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా*...
28/02/2024

*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్*

*. వైసీపీ సీనియర్ నేత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి రాజీనామా*

*... బాధతప్త హృదయంతో మీడియా సమావేశం పెడుతున్నా...*

*.....వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని*

*....ఉద్వేగానికి గురైన రూప్ కుమార్ యాదవ్ ప్రకటన*

*.. తొలి రోజు నుంచి వైసీపీ బలోపేతానికి పునాదిరాయిగా పనిచేశా*

*.. రక్త మాంసాలను చెమటగా మార్చి వైసిపి కోసం పనిచేశా..*

*.....కన్నీటిమయంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రూప్ కుమార్*.
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్లోని కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు*.

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన రక్తాన్ని చెమటగా మార్చి పనిచేశానన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తమ సొంత పార్టీగా భావించామని, ప్రతిపక్షాలతో నిరంతరం పోరాటం చేశానన్నారు. మార్పు సహజం.. మార్పు అనివార్యమని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారన్నారు. వైసిపి కోసం పునాదులుగా పనిచేస్తే గత ఒకటి న్నర సంవత్సరాలగా కొన్ని రాజకీయ పరిస్థితులు తనను బాధ పెట్టాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు. రాజీనామా ప్రకటన చేస్తున్నప్పుడు రూప్ కుమార్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు*.

ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ సన్ను నాగమణి, 48వ డివిజన్ కార్పొరేటర్ SR తహసీన్ ఇంతియాజ్, 52వ డివిజన్ కార్పొరేటర్ SK అస్మా మైనుద్దీన్, 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత అశోక్, సీనియర్ నాయకులు దార్లవేంకటేశ్వర్లు గారు, కలికి శ్రీధర్ రెడ్డి గారు, నిశ్చల్ కుమార్ రెడ్డి గారు, మూలస్థానేశ్వర దేవాలయం చైర్మన్ లొకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి గారు, గోగుల నాగరాజు గారు మైనారిటీ నాయకులు SD మున్వర్ గారు, SK హాజీ గారు, SR ఇలియాజ్ గారు, ఫజల్ గారు తదితరులు పాల్గొన్నారు...

రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన నెల్లూరు నగర నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలు.రా...
21/02/2024

రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన నెల్లూరు నగర నియోజకవర్గ కార్పొరేటర్లు, నాయకులు మరియు కార్యకర్తలు.

రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

వేమిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఆయనకు మద్దతుగా నెల్లూరు నగరంలోని పలు డివిజన్ల నుంచి వందలాదిమంది కార్యకర్తలతో కార్పొరేటర్లు స్థానిక నేతలు విపిఆర్ నివాసం వరకు ప్రదర్శన నిర్వహించారు.

ముఖ్యంగా పలు ప్రాంతాల నుంచి ముస్లిం నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో వీపిఆర్ నివాసం కిటకిటలాడింది.

పలువురు ముఖ్య నాయకులను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రూప్ కుమార్ యాదవ్ దగ్గరుండి పరిచయం చేశారు.

డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో పాటు, 52, 39, 48 డివిజన్లకు సంబంధించిన కార్పొరేటర్లు వీపిఆర్ నివాసానికి చేరుకొని మద్దతు పలికారు.

వీపిఆర్ నివాసం వద్ద రూప్ కుమార్ యాదవ్ అన్నీ తానై వ్యవహరించారు..

శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి దేవస్థానంలో సూర్యప్రభవాహన సేవలో  పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాద...
16/02/2024

శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి దేవస్థానంలో సూర్యప్రభవాహన సేవలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు...

ఈ రోజు నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాధస్వామి వారి దేవస్థానం నందు రధసప్తమి సందర్భంగా స్వామి వారిని దర్శించుకొని అనంతరం స్వామివారి సూర్యప్రభ వాహన సేవలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు.....

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *75వ భారత గణతంత్ర దినోత్సవం* సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాజ్య...
26/01/2024

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *75వ భారత గణతంత్ర దినోత్సవం* సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు మరియు జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు *వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి* గారు...

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ నందు గల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *75వ భారత గణతంత్ర దినోత్సవం* సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రువర్యులు *కాకాని గోవర్ధనరెడ్డి* గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ *ఆదాల ప్రభాకర్ రెడ్డి* గారు, ఎంయల్ సి *బల్లి కళ్యాణ్ చక్రవర్తి* గారు, వెంకటగిరి నియోజకవర్గం ఇంచార్జ్ *నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి* గారు, గూడూరు నియోజకవర్గం ఇంచార్జ్ *మేరుగ మురళీధర్* గారు, జిల్లా పరిషత్ చైర్మన్ *ఆనం అరుణమ్మ* గారు, నగర మేయర్ *పొట్లూరి స్రవంతి* గారు, డిప్యూటీ మేయర్ *పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్* గారు, విజయ డైరీ చైర్మన్ *కొండ్రెడ్డి రంగారెడ్డి* గారు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ *మెట్టకూరు చిరంజీవి రెడ్డి* గారు, జిల్లా అధ్యక్షురాలు *మొయిళ్ళ గౌరీ* గార్లతో కలిసి _జాతీయ పతాకాన్ని_ ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు గౌ// *వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి* గారు..

నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారునెల్లూరు కార్పొరేషన్ ఆవరణలో నూతనంగా నిర్మి...
25/01/2024

నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు

నెల్లూరు కార్పొరేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజ్యసభ సభ్యులు, జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు, నగర మేయర్ పోట్లూరి స్రవంతి గారు, డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు..

*జగనన్న భవన్లో నూతన ఏడాది వేడుకలు**నెల్లూరు నగరంలోని జగనన్న భవన్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వై.యస్.ఆర్ కాంగ్రెస...
03/01/2024

*జగనన్న భవన్లో నూతన ఏడాది వేడుకలు*

*నెల్లూరు నగరంలోని జగనన్న భవన్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు గారు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు SK హాజీ ఆధ్వర్యంలో నూతన ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించారు.*

*ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. పలువురు అభిమానులు రూప్ కుమార్ యాదవ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు .*

*.ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకుంటామన్నారు.*

ఈ కార్యక్రమంలో చింతల రాజేష్, గంప నరసింహారావు, నన్నే జాన్, మునీర్, చుక్కల బాబు, రామనాథం, ఖలీల్, చిట్టి, సంజీవ్, సాత్విక్, మీరా, పెనుమల్లి శ్రీనివాసులు, మల్లి రత్నయ్య, నాగా ప్రభాకర్ రెడ్డి,కమల్, ఖలీల్, సికో, సాయి కమల్, సమీఉల్లా, అరాఫత్, శ్రీను, అజీజ్, అలీ, నూరి, ఆరిఫ్, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.

మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు #2024
01/01/2024

మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
#2024

నెల్లూరు నగరంలోని ఏ సి సుబ్బారెడ్డి స్టేడియం లో జరుగుతున్న *ఆడుదాం ఆంధ్రా లాంచింగ్* కార్యక్రమం లో పాల్గొని క్రీడా పోటీలన...
26/12/2023

నెల్లూరు నగరంలోని ఏ సి సుబ్బారెడ్డి స్టేడియం లో జరుగుతున్న *ఆడుదాం ఆంధ్రా లాంచింగ్* కార్యక్రమం లో పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించిన వ్యవసాయశాఖ మంత్రి వర్యులు *కాకాని గోవర్ధన్ రెడ్డి* గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు *ఆదాల ప్రభాకర్ రెడ్డి* గారు, నెల్లూరు జడ్పీ చైర్పర్సన్ *ఆనం ఆరుణమ్మ* గారు, నగర మేయర్ *పొట్లూరి స్రవంతి* గారు, విజయ డైరీ చైర్మన్ *కొండ్రేడ్డి రంగారెడ్డి* గారు, డిప్యూటీ మేయర్ *పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్* గారు తదితరులు పాల్గొన్నారు...

నుడా చైర్మన్ గా రెండవ సారి నియమితులైన ముక్కాల ద్వారకానాథ్ గారిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నెల్లూరు నగర...
25/12/2023

నుడా చైర్మన్ గా రెండవ సారి నియమితులైన ముక్కాల ద్వారకానాథ్ గారిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, మూలస్థానేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ లొకిరెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి గారు, వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు గారు, కార్పొరేటర్లు SR ఇంతియాజ్ గారు, గోగుల నాగరాజు గారు, మైనారిటీ నాయకులు SK హాజీ గారు, నిశ్చల్ కుమార్ రెడ్డి గారు...

*డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు*  నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ జగనన్...
21/12/2023

*డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు*

నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ జగనన్న భవన్ లో డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి ఒక్కరికి మేలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందన్నారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో మూలస్థానేశ్వర దేవాలయం చైర్మన్ లోకి రెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు గారు, కార్పొరేటర్లు ఇంతియాస్ గారు, గోగుల నాగరాజు, మైనారిటీ నాయకులు హాజీ గారు, ఇలియాస్ గారు తదితరులు పాల్గొన్నారు..

ముఖ్యమంత్రితో రూప్ కుమార్ యాదవ్ భేటీ..తాడేపల్లి లో వైసీపీ నేత ఏపీ ఈడబ్ల్యు ఐడిసి  చైర్మన్ నాగార్జున యాదవ్ వివాహ మహోత్సవం...
23/11/2023

ముఖ్యమంత్రితో రూప్ కుమార్ యాదవ్ భేటీ..

తాడేపల్లి లో వైసీపీ నేత ఏపీ ఈడబ్ల్యు ఐడిసి చైర్మన్ నాగార్జున యాదవ్ వివాహ మహోత్సవం కు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్..
.. ఈ సందర్భంగా రూపు కుమార్ యాదవ్ ను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించారు.. క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు

నెల్లూరు నగర కార్పొరేషన్ లో కౌన్సిల్ ఏర్పడి నేటికి (22.11.23) రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మీడియా సమావేశంల...
22/11/2023

నెల్లూరు నగర కార్పొరేషన్ లో కౌన్సిల్ ఏర్పడి నేటికి (22.11.23) రెండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న నగర డిప్యూటీ మేయర్ *పో్లుబోయిన రూప్ కుమార్ యాదవ్* గారు...

ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ కార్పొరేషన్ లో కౌన్సిల్ ఏర్పడి నేటికి (22.11.23) రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. నగర కార్పొ్రేషన్ లో మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు మరియు కార్పొరేటర్లు గా ఎన్నిక కాబడి ప్రమాణస్వీకారం చేసి నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత గతంలోనే ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర చరిత్రలోనే నగర కార్పొ్రేషన్లో 54 డివిజన్లో గెలుపొందడం జరిగిందన్నారు. నెల్లూరు నగర ప్రజలు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టి 54 స్థానాలకు గాను 54 స్థానాలు గెలుపొందడం జరిగిందన్నారు.

మా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలోకంటే అనేకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు రావడం జరిగిందన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశం మొత్తం మీద మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు. నగర పాలకసంస్థ కౌన్సిల్, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల సహకారంతో దేశంలోనే పెద్ద పెద్ద మహానగరాలను సైతం పక్కన పెట్టి నెల్లూరు నగరపాలకసంస్థ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు.

ఆనాటి మునిసిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు కేంద్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు హర్షదీప్ సింగ్ పూరి గారి చేతులమీదుగా 10కోట్ల రూపాయల నగదును బహుమతిగా తీసుకోవడం జరిగిందన్నారు. మేము కౌన్సిల్లో మేయరు మరియు డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు నెల్లూరు నగరపాలకసంస్థ మొట్టమొదటి స్థానం కైవసం చేసుకోవడంలో భాగస్వామ్యం అవ్వడం గర్వంగాఉందన్నారు.

మా ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలోకంటే అనేకరకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు రావడం జరిగిందన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్ సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశం మొత్తం మీద మొదటి స్థానం కైవసం చేసుకుందన్నారు. నగర పాలకసంస్థ కౌన్సిల్, అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల సహకారంతో దేశంలోనే పెద్ద పెద్ద మహానగరాలను సైతం పక్కన పెట్టి నెల్లూరు నగరపాలకసంస్థ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు.

ఆనాటి మునిసిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు కేంద్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు హర్షదీప్ సింగ్ పూరి గారి చేతులమీదుగా 10కోట్ల రూపాయల నగదును బహుమతిగా తీసుకోవడం జరిగిందన్నారు. మేము కౌన్సిల్లో మేయరు మరియు డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు నెల్లూరు నగరపాలకసంస్థ మొట్టమొదటి స్థానం కైవసం చేసుకోవడంలో భాగస్వామ్యం అవ్వడం గర్వంగాఉందన్నారు.

నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో 15కోట్ల రూపాయలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ను త్వరలో ప్రారంభించబోతున్నమ్మన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తయ్యే నాటికి నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లో వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్ మరియు డయాలసిస్ పెన్షన్ అన్ని రకాల పెన్షన్లు కలిపి 27వేలు ఉండేవన్నారు. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 48వేల మందికి నెల్లూరు నగరపాలక సంస్థ ద్వారా పెంక్షన్లు అందజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనకంటే, ఈ ప్రభుత్వ పాలనలో లబ్ధిదారులు నుంచి రూపాయికూడా తీసుకోకుండా వారిమీద ఆర్ధికభారం పడకుండా టిడ్కో గృహలను అందజేస్తున్నామన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము భాగస్వాములవ్వడం గర్వం గా ఉందన్నారు...

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు SR ఇంతియాజ్, గోగుల నాగరాజు మరియు నాగమణి పాల్గొన్నారు...

బంపర్ డ్రా లో  విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన మంత్రి కాకానీ గోవర్ధన్ రెడ్డి గారు...నెల్లూరు నగరంలోని సి.ఎం.ఆర్ షాపింగ్ మ...
15/11/2023

బంపర్ డ్రా లో విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన మంత్రి కాకానీ గోవర్ధన్ రెడ్డి గారు...

నెల్లూరు నగరంలోని సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ వారి దసరా, దీపావళి పండుగ వైభవాల మెగా బంపర్ డ్రా బహుమతులు పొందిన విజేతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకనాథ్ గారు ,నగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గార్లు

రెనాల్ట్ క్విడ్ కారు డ్రా తీశారు. డ్రా లో గెలుపొందిన విజయలక్ష్మిని అభినందించారు.అలాగే 5వ వీక్లీ డ్రా విజేత శ్రీ షేక్ ముమీద్ గారికి హీరో మోటార్ బైక్ అందజేశారు మరియు డైలీ డ్రా విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా విజేతలను వారు అభినందించారు...

Address

Atmakur Bustand, Near James Garden
Nellore
524002

Website

Alerts

Be the first to know and let us send you an email when P. Roop Kumar Yadav Nellore City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share


Other Political Parties in Nellore

Show All

You may also like