Poluboina Roop Kumar Yadav

Poluboina Roop Kumar Yadav Official page of Poluboina Roop Kumar Yadav | Nellore Municipal Corporation Deputy Mayor | Ex Incharge Mayor | Corporator | Telugu Desam Party

15/08/2026
10/08/2026


వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్
డ్రైన్ల ఆధునికీకరణతో నగరానికి మేలు
నగర అభివృద్ధికి అందరి సహకారం.. పేదలకు పూర్తి భరోసా
50 కోట్లతో నెల్లూరు రూపురేఖలు మారనున్నాయి
మన్సూర్ నగర్ వాసులకు తప్పనున్న వరద ముప్పు.. శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
వేగంగా డ్రైనేజీ పనులు

నెల్లూరు నగరంలో వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా డ్రైన్ల ఆధునికీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. మూలాపేటలోని గచ్చు కాలువ పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అభివృద్ధి పనుల వల్ల ఏ ఒక్క పేదవాడికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఒకవేళ ప్రత్యామ్నాయం అవసరమైతే పూర్తి పరిహారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ... మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించి, నీటిపారుదల శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రితో మాట్లాడి 50 కోట్ల నిధులు మంజూరు చేయించి నెల్లూరు నగరంలోని 12 ప్రధాన కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారని తెలిపారు. అందులో భాగంగా మూలాపేట ప్రాంతంలో 310 మీటర్ల పొడవైన గచ్చు కాలువ పనుల్లో ఇప్పటికే 210 నుండి 220 మీటర్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
​డ్రైన్ పనుల వల్ల ఇళ్లు దెబ్బతింటాయేమోనని స్థానిక పేద ప్రజలు ఆందోళన చెందడంతో, నారాయణ గారి ఆదేశాల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలన చేశామని... ఏ ఒక్క పేదవాడికి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా సమస్య ఎదురైతే ఖచ్చితంగా వారికి ప్రత్యామ్నాయ పరిహారం చూపిస్తామన్నారు. గతంలో 7 నుండి 8 అడుగుల లోతు పూడికతో నిండిపోవడం వల్ల వర్షాలు వస్తే మన్సూర్ నగర్ అంతా మునిగిపోయి ఇళ్లలోకి నీరు చేరేదని, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకూడదనే దూరదృష్టితోనే ఈ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నాని, క్లస్టర్ ఇంచార్జ్ ప్రసాద్, కార్పొరేటర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

09/08/2026


వైఎస్ఆర్సిపివి దొంగ దీక్షలు..
రూప్ కుమార్ యాదవ్
డిఎస్‌సి నిరసనల్లో గోవింద నామాల అపహాస్యం.. మండిపడ్డ డిప్యూటీ మేయర్
నిరుద్యోగుల పేరుతో వైఎస్సార్‌సీపీ రాజకీయ డ్రామాలు
జింజీ విద్యార్థులతో ఫేక్ దీక్షలు చేయిస్తారా?వైఎస్సార్‌సీపీపై ధ్వజం
భగవంతుడితో ఆడుకుంటే బుద్ధి చెప్తారు.. వైఎస్సార్‌సీపీకి వార్నింగ్
16,347 ఉద్యోగాలిస్తే ఓర్వలేకపోతున్నారు: డిప్యూటీ మేయర్ ఫైర్
వైఎస్సార్‌సీపీకి స్థానిక ఎన్నికల్లో దెబ్బ తప్పదు

వైఎస్‌ఆర్‌సిపి నేతలు నిరుద్యోగుల పేరుతో ఆడుతున్న రాజకీయ నాటకాలను, వారి దొంగ దీక్షలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎండగట్టారు. నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన, మెగా డిఎస్‌సి ద్వారా అత్యంత పారదర్శకంగా 16,347 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓర్వలేక వైఎస్‌ఆర్‌సిపి తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

​కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్‌సి ఎంపిక విధానంపై విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చినప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి దుష్ప్రచారం చేస్తోందని డిప్యూటీ మేయర్ ఆరోపించారు. విఆర్ కాలేజ్ సెంటర్ వద్ద చేపట్టిన నిరసనల్లో డిఎస్‌సి అభ్యర్థుల పేరిట జింజీ విద్యార్థులను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేయించడమే కాకుండా, పవిత్రమైన వెంకటేశ్వర స్వామి గోవింద నామాలను అపహాస్యం చేస్తూ పాటలు పాడి హిందూ మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పేపర్ ద్వారా కల్పిత వార్తలు రాయిస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని, 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే వైఎస్‌ఆర్‌సిపి అడ్డుపడుతోందని విమర్శించారు. భగవంతుడితో, నిరుద్యోగులతో ఆడుకుంటున్న వైఎస్‌ఆర్‌సిపికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు.

 మూలాపేట DSR హైస్కూల్‌లో నారాయణ ఉచిత వైద్య శిబిరంనారాయణ నేత్ర జ్యోతి, దంత సురక్ష శిబిరాలకు విశేష స్పందనమంత్రి నారాయణ సేవ...
01/08/2026


మూలాపేట DSR హైస్కూల్‌లో నారాయణ ఉచిత వైద్య శిబిరం
నారాయణ నేత్ర జ్యోతి, దంత సురక్ష శిబిరాలకు విశేష స్పందన
మంత్రి నారాయణ సేవలు అభినందనీయం..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
DSR హైస్కూల్‌లో 200 మంది విద్యార్థులకు కంటి, దంత పరీక్షలు
విద్యార్థులకు త్వరలోనే ఉచితంగా కళ్లద్దాల పంపిణీ: అన్నంగి ప్రసాద్

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా నిరుపేదల ఆరోగ్యం మరియు విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా అనేక బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు.​ప్రజాసేవే పరమావధిగా భావించే మంత్రి నారాయణ, సొంత నిధులతో నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష పేరిట ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వేలాది మందికి కంటి చూపును, మెరుగైన దంత ఆరోగ్యాన్ని అందిస్తున్నారు.కేవలం వైద్య సేవలతోనే ఆగకుండా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునీకరించి, విద్యార్థుల సౌకర్యార్థం వేలాది ఉచిత సైకిళ్లను పంపిణీ చేసి విద్యా వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు.​ఈ క్రమంలోనే, నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్‌లో ఉన్న DSR హైస్కూల్‌లో శనివారం నారాయణ నేత్ర జ్యోతి,నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని వైభవంగా ప్రారంభించారు.​ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 39 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ అన్నంగి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ గారి సేవా కార్యక్రమాలను విశేషంగా కొనియాడారు...నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఇప్పటివరకు 12,000 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసి, 7,000 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేయడంతో పాటు 200 మందికి ఉచిత శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారని, అలాగే నారాయణ దంత సురక్ష ద్వారా 6,900 మందికి దంత పరీక్షలు నిర్వహించి, సంచార బస్సులోనే 1,000 మందికి పైగా అక్కడికక్కడే ఉచితంగా చికిత్స అందించి మిగతా వారిని ఆస్పత్రికి రిఫర్ చేశారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్ DSR హైస్కూల్‌లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించి, తొలిరోజే 200 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరు...ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, ఇటీవల 7,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసిన బాటలోనే, పేద విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా సొంత నిధులతో ప్రజాసేవ అందిస్తున్న మంత్రి నారాయణ గారికి ఆశీస్సులు తెలియజేస్తూ, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు, వైద్యులతో సమన్వయం చేస్తూ ఈ శిబిరాన్ని విజయవంతం చేస్తున్న క్లస్టర్ ఇన్‌ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...అనంతరం *క్లస్టర్ ఇంచార్జ్ అన్నంగి ప్రసాద్ మాట్లాడారు* DSR పాఠశాలలో ఇప్పటివరకు సుమారు 200 మంది పేద విద్యార్థులు ఈ కంటి మరియు దంత పరీక్షల సేవలను వినియోగించుకున్నారని. ఈ పరీక్షల్లో కళ్ళద్దాలు అవసరమని తేలిన పిల్లలకి, ఎల్లుండి అదే పాఠశాలలో వైద్యుల ద్వారా ఉచితంగా కళ్ళద్దాలను పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఈ డివిజన్‌లో ప్రజల కోసం ఇప్పటివరకు 4 మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు.. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ ప్రియ, డెంటల్ ప్రొఫెసర్ రాహుల్, AO ఆఫీసర్ సుధీర్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

15/07/2026

నెల్లూరు నగరాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం.. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్
స్వచ్ఛ నెల్లూరు దిశగా భారీ అడుగు.. సరికొత్తగా 200 ఎలక్ట్రికల్ ఆటోలు
పర్యావరణ విప్లవానికి నాంది.. నెల్లూరు నగరానికి సరికొత్త ఈ-ఆటోలు
ఈ శనివారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా నెల్లూరు ఈ-ఆటోలు ప్రారంభం
వర్చువల్ విధానంలో 100 ఎలక్ట్రికల్ ఆటోలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
రంగంలోకి దిగుతున్న పర్యావరణ అనుకూల ఈ-ఆటోలు

నగర కార్పొరేషన్‌ను స్వచ్ఛతలో ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చినట్లు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గర్వంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి తరలించేందుకు ప్రవేశపెట్టిన ఈ వాహనాలలో... మొదటి విడత కింద 100 ఎలక్ట్రికల్ ఆటోలను ఈ శనివారం ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నెల్లూరు నగరం సర్వసిద్ధమైందని, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు ,శివాలయం చైర్మన్ అజయ్,టీడీపీ ముఖ్యనేతలు బాలాజీ,తిరుమలనాయుడు,జహీర్,దర్శి హరికృష్ణ,పిట్టి సత్య నాగేంద్ర ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్సార్సీపీ ఆరోపణలపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఫైర్చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికలపై కనీస అవగాహన లేదు: రూప్ కుమార్...
10/07/2026



వైఎస్సార్సీపీ ఆరోపణలపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఫైర్
చంద్రశేఖర్ రెడ్డికి ఎన్నికలపై కనీస అవగాహన లేదు: రూప్ కుమార్ యాదవ్
నెల్లూరులో ఇల్లే లేదు.. కానీ 28 దొంగ ఓట్లు ఉన్నాయి: డిప్యూటీ మేయర్ సంచలన వ్యాఖ్యలు
SIR ప్రక్రియలో ఓట్ల తొలగింపు ఉండదు.. అవగాహన లేకుండా మాట్లాడొద్దు
​మంత్రి నారాయణపై ఇసుక ఆరోపణలు ముమ్మాటికీ అబద్ధం: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్
మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకోండి: వైఎస్సార్సీపీకి రూప్ కుమార్ హితవు

నెల్లూరులో ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు మీడియా ముందుకు వచ్చే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికిన ఆయన, జూన్ 15 నుండి జూలై 14 వరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో ఓట్ల తొలగింపుగానీ, చేర్పుగానీ ఉండదని, కేవలం ఓటర్ల వివరాల సేకరణ, డిజిటలైజేషన్ మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు నగర నియోజకవర్గంలో ఇప్పటికే 72 శాతానికి పైగా డిజిటలైజేషన్ పూర్తయిందని, కలెక్టర్ ప్రతిరోజూ ఈ వివరాలను అన్ని పార్టీలకూ అధికారికంగా అందిస్తున్నారని చెబుతూ, ఏ ఒక్క వైఎస్సార్సీపీ కార్యకర్తకైనా ఎన్యుమరేషన్ ఫారం అందలేదని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. 47వ డివిజన్‌లో వైఎస్సార్సీపీ నాయకులే స్వయంగా బీఎల్ఓల పక్కన కూర్చుని ఫారాలు పూర్తి చేయిస్తున్నారని, 238వ బూత్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే వారి పార్టీ కార్పొరేటర్ నాగార్జునని అడిగి తెలుసుకోవాలని సూచించారు. కేవలం 20 వేల ఓట్లతో గెలిచిన చంద్రశేఖర్ రెడ్డికి సాధారణ ఎన్నికలపై అవగాహన లేదన్న ఆయన, నెల్లూరులోని రామ్మూర్తి నగర్ డోర్ నెంబర్ 15-6-43 లో కనీసం ఇల్లే లేకపోయినా ఏకంగా 28 దొంగ ఓట్లు ఉన్నాయని, ఇలాంటివి నగరంలో మరెన్నో ఉన్నాయని ధ్వజమెత్తారు. అలాగే మంత్రి నారాయణ గారిపై చేస్తున్న ఇసుక అక్రమాల ఆరోపణలు అబద్ధమని, మంత్రి నారాయణ గారి విజన్ ప్రజలకు తెలుసన్నారు..గతంలో 4 వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుకను నారాయణ గారు చొరవ తీసుకుని 1,200 లకే పేదలకు అందేలా చేశారని గుర్తు చేస్తూ, అభ్యంతరాలు ఉంటే అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి తప్ప అబద్ధాలు ప్రచారం చేయవద్దని హితవు పలికారు.

  Postఅభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్నెల్లూరు 42వ డివిజన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించ...
09/07/2026

Post
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్
నెల్లూరు 42వ డివిజన్‌లో అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ
రోడ్డు వెడల్పు సమస్యను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్తాం: రూప్ కుమార్ యాదవ్
ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు..మున్సిపల్ అధికారులతో కలిసి డిప్యూటీ మేయర్ పర్యటన

నెల్లూరు నగరంలోని 42వ డివిజన్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 42, 43, 48 డివిజన్లకు ప్రధాన రహదారి అయిన ఈ ప్రాంతంలో డ్రైన్ నిర్మాణ పనుల వద్ద చిన్నపాటి సమస్యలు ఉన్నాయని, జంక్షన్ వద్ద రోడ్డు కుంచించుకుపోవడంతో దానిని వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని స్థానిక కార్పొరేటర్, నాయకులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ఏ పేదవాడికీ ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అభివృద్ధి పనులు వేగంగా జరగాలన్నదే గౌరవ మంత్రి నారాయణ గారి ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలోని సమస్యలన్నింటినీ త్వరలోనే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ప్రజలకు ఎక్కడా చిన్న ఆటంకం కూడా లేకుండా త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కరిముల్లా, టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మెయినుద్దీన్, కాలేషా, హాజీ, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

Address

Nellore

Alerts

Be the first to know and let us send you an email when Poluboina Roop Kumar Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share