MAYOR SRAVANTHIJAYAVARDHAN

MAYOR SRAVANTHIJAYAVARDHAN You can't serve God without serving the people��

అల్లీపురం డంపింగ్ యార్డ్ వ్యర్ధాల నిర్వహణ పనులను పర్యవేక్షించిన మేయర్ స్రవంతి జయవర్ధన్ స్థానిక అల్లీపురం డంపింగ్ యార్డున...
28/02/2025

అల్లీపురం డంపింగ్ యార్డ్ వ్యర్ధాల నిర్వహణ పనులను పర్యవేక్షించిన మేయర్ స్రవంతి జయవర్ధన్

స్థానిక అల్లీపురం డంపింగ్ యార్డును మేయర్ స్రవంతి జయవర్ధన్ శుక్రవారం సందర్శించి వ్యర్దాల నిర్వహణ పనులను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అల్లీపురం డంపింగ్ యార్డ్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కొంత మేరకు దెబ్బతిని కూలిపోయున్నందున, శిధిలమైన చోట అవసరమైన మేరకు గోడను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మేయర్ స్రవంతి జయవర్ధన్ అధికారులను ఆదేశించారు.

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి చెత్త సేకరణ వాహనాల ద్వారా ఇంటింటి నుంచి సేకరిస్తున్న వ్యర్దాలను అల్లీపురంలోని డంపింగ్ యార్డ్ కు ప్రతిరోజు తరలిస్తారని తెలిపారు.

నెల్లూరు నగరంలోని అన్ని డివిజన్ల నుండి తడి - పొడి వ్యర్ధాలను విడివిడిగా సేకరించి ప్రతిరోజు దాదాపు 300 టన్నుల వ్యర్దాలను డంపింగ్ యార్డ్ కు తరలించి అక్కడినుంచి దొంతాలి యార్డుకు తరలిస్తారని వివరించారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పారిశుద్య పనుల నిర్వహణమీద ప్రత్యేక దృష్టి సారించి ఇందులో భాగంగా పెద్ద ఎత్తున పారిశుద్య పనులకు నిధులు కేటాయించారని తెలిపారు.

నగరపాలక సంస్థ పరిధిలో క్రమం తప్పకుండా పారిశుధ్య పనులను ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్నామని మేయర్ తెలియజేసారు.

వ్యర్ధాలను డంపింగ్ యార్డ్ కు తరలించే క్రమంలో వాహనాల పైన తప్పనిసరిగా వలలను కప్పి ఉంచి వ్యర్ధాలు రోడ్లపై పడకుండా తగిన జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని సిబ్బందికి మేయర్ సూచించారు.

డంపింగ్ యార్డ్ ప్రవేశంలో వాహనాలు ప్రణాళికబద్ధంగా రవాణా అయ్యేలా జాగ్రత్తలు తీసుకొని, ట్రాఫిక్ అంతరాయాలు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని మేయర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ రూపకల్పన - మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజను...
25/02/2025

నగరాభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ రూపకల్పన

- మేయర్ స్రవంతి జయవర్ధన్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించేలా నూతన బడ్జెట్ ను రూపొందించేందుకు కృషి చేస్తున్నామని కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ పేర్కొన్నారు.

నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులతో బడ్జెట్ రూపకల్పన సమావేశాన్ని మేయర్ చాంబర్లో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నగరపాలక సంస్థకు బడ్జెట్ కేటాయింపులో భాగంగా అన్ని విభాగాల అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని తుది మెరుగులు దిద్దుతున్నామని తెలిపారు.

నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు నూతన బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించనున్నామని తెలిపారు.

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నగర పాలక సంస్థ బడ్జెట్ కేటాయింపులు చేపట్టామని, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధిని చూపేందుకు ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ ను రూపొందించనున్నామని మేయర్ ప్రకటించారు.

విభాగాల వారీగా రూపొందించిన బడ్జెట్లో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనులకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ కేటాయింపులు జరపనున్నామని, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ను ప్రతిష్టాత్మకంగా రూపొందించి, అమలు చేస్తామని మేయర్ వెల్లడించారు.

ఈ సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నెల్లూరు నగర కార్పొరేషన్ లో బడ్జెట్ కు తుది మెరుగులు. మేయర్ ఛాంబర్ లో వివిధ విభాగాల అధిపతులతో చర్చిస్తున్న మేయర్ పొట్లూర...
25/02/2025

నెల్లూరు నగర కార్పొరేషన్ లో బడ్జెట్ కు తుది మెరుగులు
. మేయర్ ఛాంబర్ లో వివిధ విభాగాల అధిపతులతో చర్చిస్తున్న మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్
నెల్లూరు నగర పాలక సంస్థ మరింత అభివృద్ధి చెందేలా బడ్జెట్ రూపకల్పన
.. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి పెద్ద పీట
.. వివిధ విభాగాల అధికారుల సూచనలు సలహాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన
.

అకౌంట్స్ విభాగంతో సమీక్ష నిర్వహించిన- మేయర్ స్రవంతి జయవర్ధన్నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు నగరపాలక స...
20/12/2024

అకౌంట్స్ విభాగంతో సమీక్ష నిర్వహించిన

- మేయర్ స్రవంతి జయవర్ధన్

నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు నగరపాలక సంస్థకు సంబంధించిన అకౌంట్స్ విభాగంతో గౌరవ మేయర్ స్రవంతి జయవర్ధన్ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా మేయర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ సమీక్ష సమావేశంలో అకౌంట్స్ సుపరిండెంట్ పద్మజా, విశ్వరత్నం తదితరులు పాల్గొన్నారు.

గాయపడిన కార్మికుడి కి అండగా ఉంటా -- మేయర్ స్రవంతిజయవర్ధన్  నగరంలోని వాహబ్ పేట ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ గాయపడి  నారాయ...
12/12/2024

గాయపడిన కార్మికుడి కి అండగా ఉంటా -- మేయర్ స్రవంతిజయవర్ధన్

నగరంలోని వాహబ్ పేట ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ గాయపడి నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న డ్రైనేజీ కార్మికుడు జి.పెంచలయ్య ను మేయర్ స్రవంతిజయవర్ధన్ గురువారం పరామర్శించారు.

వాహబ్ పేట ప్రాంతంలో బుధవారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తూ మున్సిపల్ కార్మికుడు జి.పెంచలయ్య ప్రమాదవశాతు గాయపడి తన చేతి రెండు వేళ్ళు బాగా గాయపడడం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్నమేయర్ స్రవంతిజయవర్ధన్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అతని కి కావలసిన వైద్య సహాయనికి కావలసిన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మేయర్ స్రవంతిజయవర్ధన్ స్వయంగా నారాయణ హాస్పిటల్ కు చేరుకొని గాయపడిన కార్మికుడు జి.పెంచలయ్య ను పరామర్శించారు.గాయపడిన కార్మికుడికి పూర్తిగా అండగా ఉంటామని వైద్యానికి కావాల్సిన సహాయం నగరపాలక సంస్థ ద్వారా అందిస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో మేయర్ వెంట నగరపాలక సంస్థ అధికారులు ఉన్నారు.

*సీజనల్ వ్యాధులపట్ల అప్రమతం గా ఉండాలి*- మేయర్ స్రవంతిజయవర్ధన్ ఈ రోజు మంగళవారం ఉదయం 13 వ డివిజన్ లోని గ్యాస్ గోడౌన్, గౌడ్...
10/12/2024

*సీజనల్ వ్యాధులపట్ల అప్రమతం గా ఉండాలి*

- మేయర్ స్రవంతిజయవర్ధన్

ఈ రోజు మంగళవారం ఉదయం 13 వ డివిజన్ లోని గ్యాస్ గోడౌన్, గౌడ్ హాస్టల్ సెంటర్ పరిధిలోని ప్రాంతాలలో మేయర్ స్రవంతిజయవర్దన్ స్థానిక 13వ డివిజన్ కార్పొరేటర్ నాగార్జునతో కలిసి పారిశుధ్య పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా మేయర్ స్రవంతిజయవర్ధన్ మాట్లాడుతూ 13వ డివిజన్ లో పారిశుధ్య మరియు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రావడం జరిగిందని, వర్షాకాలం లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ, డివిజన్లలో కూడా ఎక్కడా పారిశుద్యం లోపం లేకుండా నిర్వహించాలి అని అన్నారు. వర్షాకాలంలో మురికినీరు నిల్వ లేకుండా చూసుకోవడం తో పాటు అవసరం అయినా ప్రాంతాల్లలో ఆయిల్ బాల్స్, వర్కర్స్ వెళ్లలేని ప్రదేశాలలో డ్రోన్స్ తో కూడా పిచికారీ చేసేవిధంగ పారిశుద్య పనులు నిర్వహిస్తున్నామన్నారు. గతం లో వచ్చిన వర్షానికి రోడ్ కుంగిపోయిందని స్థానికులు అడగడం జరిగింది. వెంటనే ఆ రోడ్డు పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది అన్నారు. కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ స్థానికంగా రెండు పార్కులలో వాకింగ్ ట్రాక్,గ్రీనరి పనులు అసంపూర్తి గా ఉన్నాయి వాటిని మేయర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, మేయర్ గారు ఆ పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు అన్ని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు శేషయ్య, శంకర్ రెడ్డి, ఊటుకూరు చైతన్య, నిలిమ్ కుమార్, కృష్ణ, ప్రతాప్, మనోజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

09/12/2024
*బిర్సా ముండా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను సాధించండి*తుఫాన్ ను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన విద్యార్థిని, ...
01/12/2024

*బిర్సా ముండా జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలను సాధించండి*

తుఫాన్ ను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు

గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిర్సాముండా గారి జీవిత చరిత్ర పై వ్యాస రచన పోటీలకు విశేష స్పందన.

- విద్యార్థులకు బహుమతులు అందించిన మేయర్ స్రవంతిజయవర్ధన్

గిరిజన యోధుడు బిర్సా ముండా పోరాట పఠిమను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిజయవర్ధన్ పిలుపునిచ్చారు. గిరిపుత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్పగుడి సమీపంలోని గుర్రం బాబయ్య కళ్యాణ మండపంలో వ్యాస రచన పోటీల విజేతలకు ఆదివారం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి, బిర్సా ముండా, వెన్నెలకంటి రాఘవయ్య ల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేయర్ స్రవంతి జయవర్ధన్, EX-పీ.వో ఐ.టి.డి.ఏ ,స్టేట్ ఆడిట్ జాయింట్ డైరెక్టర్ యాకసిరి వెంకటేశ్వర్లు, ఉలవపాడు జెడ్పీటీసీ అరుణ, ఎన్. టి.ఎఫ్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య లు పాల్గొన్నారు. అతిథులను కార్యక్రమ నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుపాన్ ను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు మేయర్ అభినందనలు తెలియజేశారు.విద్యార్తలలో పోటీ తత్వాన్ని పెంపొందించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన గిరి పుత్రా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి శాలువాతో సన్మానించారు.పోటీలో పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు డిక్షనరీ, అభినందన పత్రం అతిథులతో కాలిసి అందజేశారు.

నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ స్రవంతి జయవర్ధన్ దంపతులు కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మెట్ల మా...
25/11/2024

నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ స్రవంతి జయవర్ధన్ దంపతులు కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అలిపిరి మెట్ల మార్గం నుంచి సోమవారం కాలినడకన బయలుదేరారు. నెల్లూరు నగర ప్రజలందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఉండాలని మేయర్ ఆకాంక్షించారు

Address

Nellore
524003

Telephone

+918885500057

Website

Alerts

Be the first to know and let us send you an email when MAYOR SRAVANTHIJAYAVARDHAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to MAYOR SRAVANTHIJAYAVARDHAN:

Share