జనసేన పార్టీ నెల్లూరు జిల్లా

  • Home
  • India
  • Nellore
  • జనసేన పార్టీ నెల్లూరు జిల్లా

జనసేన పార్టీ నెల్లూరు జిల్లా JSPNLRDIST

04/09/2026

“వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మనం ఎవరూ కనిపించే పరిస్థితి ఉండదు” అని పవన్ కళ్యాణ్ గారు ముందుగానే హెచ్చరించారు. ఆ దూరదృష్టితో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమే కూటమి విజయానికి బాటలు వేసింది.

కేవలం ప్రెస్‌మీట్లు పెట్టి కూటమి నాయకులను విమర్శించినంత మాత్రాన ప్రజల విశ్వాసం పొందలేరు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజల్లోకి వెళ్లాలి, వారి సమస్యలపై పోరాడాలి, అభివృద్ధి చేసి చూపించాలి.

ప్రజలు మాటలను కాదు… పనితీరును నమ్ముతారు.

అనిల్ కుమార్ యాదవ్ గారూ… ప్రెస్‌మీట్లకంటే ప్రజల మధ్యకు రండి.


04/09/2026

మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు…

“నువ్వు మాటగాడివే” — అసెంబ్లీ సాక్షిగా దేశం మొత్తం మాట్లాడుకున్న మాట!

మీ మాటలతోనే ప్రజలు మీకు మంచి తీర్పు ఇచ్చారు. అయినా ఇప్పటికీ మీ మాటతీరు మారినట్లు కనిపించడం లేదు.

ప్రెస్ మీట్లలో మాటలు కాదు… ప్రజల్లో నమ్మకం కావాలి.
మాటల రాజకీయాలు కాదు… ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, బాధ్యతాయుతమైన నాయకత్వం.


04/09/2026

“Nil Desperandum” అంటే — నిరాశ చెందొద్దు! కానీ మాజీ వైసీపీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాలనలో ‘అనిల్’ అంటే A “Nil” — అభివృద్ధి మాత్రం ‘Nil’ అయిందా? 😄

ప్రెస్ మీట్లు కాదు… ప్రజలకు కావాల్సింది అభివృద్ధి! నెల్లూరు ప్రజలు కోరుకునేది మాటలు కాదు, మార్పు.


04/09/2026

అనీల్ కుమార్ యాదవ్ గారూ...
మంత్రి పదవి పోయింది…
ఎమ్మెల్యే పదవి పోయింది…
సిటీ ఇన్‌చార్జ్ బాధ్యత కూడా పోయింది…

ఇప్పుడు మిగిలింది ప్రెస్ మీట్లేనా?

ప్రజలకు కావాల్సింది మైకుల ముందు మాటలు కాదు…
నియోజకవర్గంలో కనిపించే అభివృద్ధి.

ప్రజల సమస్యలపై పోరాటం చేయండి…
ప్రజల మధ్య తిరగండి…
నియోజకవర్గ అభివృద్ధికి మీ వంతు కృషి చేయండి.

మాటలు కాదు… అభివృద్ధి కావాలి.
ప్రెస్ మీట్లు కాదు… ప్రజలకు పనులు కావాలి.

04/09/2026

నమ్మకం అంటే నారాయణ… 70 ఏళ్ల నిరీక్షణకు ముగింపు..!

సర్వేపల్లి కాలువకట్ట నిర్వాసితుల 70 ఏళ్ల నిరీక్షణకు తెర...

1,206 పేద కుటుంబాలకు శాశ్వత పట్టాల మంజూరుకు కేబినెట్ ఆమోదం – చారిత్రాత్మక ఘట్టం:

Kishore Gunukula - JanaSena Party


దాదాపు 70 సంవత్సరాలుగా సర్వేపల్లి కాలువకట్టపై నివసిస్తూ తమ ఇళ్లకు పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కల నేడు సాకారమైంది. సర్వేపల్లి కాలువకట్ట నిర్వాసితులకు శాశ్వత పట్టాలు అందించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించిన సందర్భంగా కాలువకట్టపై కూటమి నాయకులు, స్థానికులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు కిషోర్ గునుకుల, ఆయన సతీమణి విజయలక్ష్మి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, కాలువకట్ట ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ —
“సర్వేపల్లి కాలువకట్టపై నివసిస్తున్న పేద ప్రజలకు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఏడు దశాబ్దాలుగా తమ ఇళ్లకు పట్టాలు వస్తాయని ఎదురుచూస్తున్న కుటుంబాల్లో ఈరోజు కొత్త వెలుగు నిండింది. ఒకే విడతలో 1,206 పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పించే దిశగా కేబినెట్ ఆమోదం రావడం పేదల జీవితాల్లో మరచిపోలేని మైలురాయి.

పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేసిన మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ Dr. Ponguru Narayana గారికి హృదయపూర్వక అభినందనలు. కేబినెట్ ఆమోదం పొందే వరకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయం. ‘నమ్మకం అంటే నారాయణ’ అనే విధంగా ఈ సమస్య పరిష్కారానికి ఆయన పట్టుదలతో పనిచేశారు.

‘దాదాపు 70 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. నేను చనిపోయేలోపు మా పట్టా మా చేతికి వస్తుందని అనుకోలేదు’ అని ఒక వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇలాంటి ఎన్నో కుటుంబాల కళ్లలో ఆనందం చూడటం ఈ నిర్ణయానికి ఉన్న విలువను తెలియజేస్తోంది.

పేదల సంక్షేమం, వారి జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. పేదల జీవితాలను మెరుగుపరచాలనే Deputy CMO, Andhra Pradesh శ్రీ Pawan Kalyan గారి నిబద్ధతకు, ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి నాయకత్వానికి ఈ నిర్ణయం ఒక చక్కటి నిదర్శనం.”

కేబినెట్ ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సర్వేపల్లి కాలువకట్టపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు, మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గార్లకు కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.

70 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికి 1,206 పేద కుటుంబాలకు శాశ్వత హక్కుల దిశగా అడుగు పడటం నెల్లూరు సిటీ చరిత్రలో ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు అనురాధ,16వ డివిజన్ ఇన్‌చార్జ్ సాయి తదితరుల తో జనసేన వీరమహిళ,విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకుడు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, నరిహరి, మల్లిరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, ప్రవల్లిక, కళ్యాణి రెడ్డి, లత, నందిని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Nadendla Manohar Naga Babu
Nara Lokesh JanaSena Shatagni

నెల్లూరు సిటీలో  పేదల 70 ఏళ్ల నిరీక్షణకు తెర.. 1,200 మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు చారిత్రాత్మకం....మంత్రి Dr. Ponguru...
04/09/2026

నెల్లూరు సిటీలో పేదల 70 ఏళ్ల నిరీక్షణకు తెర.. 1,200 మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు చారిత్రాత్మకం....

మంత్రి Dr. Ponguru Narayana గారి చొరవతో ఇళ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం గుర్రాలమడుగులో పండగ వాతావరణంలో సంబరాలు

నెల్లూరు: నెల్లూరు సిటీలో గుర్రాల మడుగు సంఘం ప్రజలు దాదాపు 70 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికంగా పండగ వాతావరణం నెలకొంది. 1,200 మందికి పైగా పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందించే దిశగా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం పేద ప్రజలకు ఎంతో ఊరటనిచ్చిందని జనసేన నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా గుర్రాల మడుగు సంఘంలోని స్థానికులతో కలిసి JanaSena Party నాయకులు Kishore Gunukula , Vijayalakshmi Gunukula పాల్గొని ప్రజల ఆనందాన్ని పంచుకున్నారు. BJP Andhra Pradesh , జనసేన, Telugu Desam Party (TDP) నాయకులు, కార్యకర్తలు సైతం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా గునుకుల విజయలక్ష్మి మాట్లాడుతూ, దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

గత వారం మంత్రి పొంగూరు నారాయణ గారు గుర్రాల మడుగు సంఘానికి వచ్చినప్పుడు దాదాపు మూడు గంటల పాటు స్థానికులతో గడిపి, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని తెలిపారు. ప్రతి ఇంటి సమస్యను పరిశీలించి ఇళ్ల పట్టాల సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడారు.

“నారాయణ గారు మాటల మనిషి కాదు.. చేతల మనిషి. పేదల సమస్యను స్వయంగా తెలుసుకుని, కేబినెట్‌లో పరిష్కారం చూపించారు. నెల్లూరు సిటీలో దాదాపు 70 ఏళ్లుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న 1,200 మందికి పైగా పేదలకు ఇది ఎంతో గొప్ప శుభవార్త” అని విజయలక్ష్మి అన్నారు.

కేబినెట్ నిర్ణయం వెలువడిన అనంతరం స్థానిక ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

పేదలకు ఇల్లు మాత్రమే కాదు.. ఆ ఇంటిపై హక్కు, భద్రత, గౌరవం కల్పించడమే నిజమైన ప్రజా పాలన అని విజయలక్ష్మి పేర్కొన్నారు. నెల్లూరు సిటీలోని

గుర్రాల మడుగు ప్రజల దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి స్థానిక ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు అనురాధ, సిరి శ్రీనివాసులు, సాయి,16వ డివిజన్ ఇన్‌చార్జ్ సాయి తదితరుల తో జనసేన వీరమహిళ,విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకుడు కిషోర్ గునుకుల, ప్రశాంత్ గౌడ్, నరిహరి, మల్లిరెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, ప్రవల్లిక, కళ్యాణి రెడ్డి, లత, నందిని తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Shatagni Nara Lokesh Naga Babu Nadendla Manohar

04/09/2026

నిల్ డెస్పరాండం...(“Nil Desperandum”) అంటే — నిరాశ చెందొద్దు!
కానీ అనిల్ అన్నా పాలనలో

అనిల్ (అ“Nil) అంటే అ నిల్ డెవలప్మెంట్ (Development — అభివృద్ధి అడగొద్డు! 😄

కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే —
“అభివృద్ధి ఎక్కడ అనీల్ అన్నా?”

Kishore Gunukula గారు - JanaSena Party

మంత్రి పదవి పోయింది…
ఎమ్మెల్యే పదవి పోయింది…
సిటీ ఇన్‌చార్జ్ బాధ్యత కూడా పోయింది…

ఇప్పుడు మిగిలింది ప్రెస్ మీట్లేనా?

ప్రజలకు కావాల్సింది మైకుల ముందు మాటలు కాదు…
నియోజకవర్గం లో కనిపించే అభివృద్ధి.

నెల్లూరులో వరుస ప్రెస్‌మీట్లు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వంపై, కూటమి నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైఖరిని జనసేన నాయకుడు కిషోర్ గునుకుల తీవ్రంగా ఖండించారు.

అనిల్ కుమార్ యాదవ్ గారూ… ప్రెస్ మీట్లు కాదు, అభివృద్ధి కావాలి!

కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ… గత వారం రోజులుగా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు.
కానీ ప్రజల ప్రశ్న ఒక్కటే — పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా, రెండు సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన మీరు… చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏంటి?

బీసీ నాయకుడిగా అత్యున్నత స్థాయికి ఎదిగిన మీరు, ఇన్ని పదవులు అనుభవించిన తర్వాత కూడా “నేను ఇది చేశాను” అని చెప్పుకునే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేకపోవడం బాధాకరం.

“నువ్వు మాటగాడివే” — అసెంబ్లీ సాక్షిగా దేశం మొత్తం మాట్లాడుకున్న మాట!

మీ మాటలతో ప్రజలు మీకు మంచి తీర్పు ఇచ్చారు. అయినా ఇప్పటికీ మీ మాటతీరు మారినట్లు కనిపించడం లేదు.

కార్పొరేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని వరుసగా ప్రెస్‌మీట్లు పెడితే ప్రజలు నమ్ముతారని అనుకోవడం కేవలం భ్రమే!

ప్రజల్లో నమ్మకం సంపాదించాలంటే ప్రెస్‌మీట్లలో కనిపించడం కాదు… ప్రజల్లో తిరగాలి.
ప్రజల సమస్యలు తెలుసుకోవాలి.
వాటి పరిష్కారానికి కృషి చేయాలి.
మీ హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపించాలి.

కానీ దురదృష్టం ఏమిటంటే… చూపించడానికి అభివృద్ధి లేదు, చెప్పుకోవడానికి పని లేదు.

అందుకే ప్రెస్‌మీట్లతో ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తే అది సాధ్యం కాదు.

మైక్ ముందు మాటలు కాదు… ప్రజల మధ్య చేసిన పనులే ఎన్నికల్లో మాట్లాడతాయి!

Pawan Kalyan Deputy CMO, Andhra Pradesh JanaSena Shatagni Vemireddy Prashanthi Reddy Vemireddy Prabhakar Reddy

03/09/2026

తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించు గణనాధా..🙏

– Kishore Gunukula

ఫ్లెక్సీల విషయంలో గందరగోళానికి తెరదించుతూ చిల్డ్రన్స్ పార్క్ వద్ద విద్యా గణపతికి పాలాభిషేకం చేసి, చెవులు పట్టుకుని గుంజీలు తీసి, సాష్టాంగ నమస్కారం చేసి ఫ్లెక్సీల విషయంలో అపసృతి జరిగుంటే గణనాథుడిని మన్నింపు కోరిన జనసేన నాయకుడు కిషోర్ గునుకుల.

ఈ విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే అది పూర్తిగా తన వ్యక్తిగత తప్పేనని, తన నాయకుడు శ్రీ Pawan Kalyan గారికి గానీ, JanaSena Party కి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే, దానికి నా నాయకుడు శ్రీ గారికి గానీ, జనసేన పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదు. సనాతన ధర్మాన్ని ఆచరించే కుటుంబాల్లో పూజ అనంతరం బిడ్డకు దిష్టి తీయడం సాధారణ ఆచారం. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆ ఫ్లెక్సీ ద్వారా ఆ సంప్రదాయాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో ఏదైనా తప్పు జరిగి ఉంటే అది పూర్తిగా నా వ్యక్తిగత తప్పుగానే భావించాలని ఘననాధుడిని ప్రార్థించాను.

హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించే కుటుంబాలలో మా కుటుంబం కూడా ఒకటి. మా మామగారి ద్వారా చిన్ననాటి నుంచే భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక భావనలు నాకు మరింతగా అలవడ్డాయి. ఆయన భజనల్లో తరచూ చెప్పే “నేను గాని, నా తోటి వారు గాని తెలిసి తెలియక చేసిన తప్పులను మన్నించి, క్షమించి మమ్మల్ని కాపాడవయ్యా” అనే వాక్యం ఇప్పటికీ నా మనసులో నిలిచిపోయింది.

ఈరోజు ఘననాధునికి పాలాభిషేకం నిర్వహించి,గుంజిల్లు తీసి సాష్టాంగ ప్రణామం చేసి, తెలిసి తెలియక నేను చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించి కాపాడాలని ప్రార్థించాను. నా వల్ల ఏదైనా హిందూ దేవతల పట్ల, హిందూ బంధువుల మనోభావాల పట్ల అపార్థం లేదా బాధ కలిగితే వాటిని కూడా మన్నించమని విఘ్నేశ్వరుడిని వేడుకున్నాను.

గత ఐదేళ్లుగా దేవాలయాలపై దాడులు జరిగిన సందర్భాల్లో జనసేన పార్టీ తరఫున రోడ్లపైకి వచ్చి హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడాం. అదే విధంగా ఈ ఆలయంలో మా సతీమణి ప్రతి నెల సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. మూడు రోజుల క్రితం కూడా ఇక్కడే పూజల్లో పాల్గొని, ప్రజలందరూ విఘ్నాలు, సంకటాలు తొలగి సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించాం.

ముఖ్యంగా, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అది నా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి, నా తోటి జనసేన కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేకుండా, ఆ తప్పును నా వ్యక్తిగత బాధ్యతగా పరిగణించి నన్ను క్షమించి కాపాడాలని ఘననాధుడిని కోరుకున్నాను.

గతంలో దేవాలయాలపై జరిగిన దాడులను, హిందూ దేవతల విగ్రహాల అపవిత్రతను, రథాల దహన ఘటనలను ఖండిస్తూ పోరాడిన ప్రతి హిందూ బంధువును నేను గౌరవిస్తున్నాను. ఈరోజు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వివిధ వర్గాలు, పార్టీలు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకు రావడం అభినందనీయం.

ఇకపై చిన్నచిన్న పొరపాట్లు కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని స్పష్టం చేస్తున్నాను. మన మాట, మన చర్యలు ఇతరుల మనోభావాలను గౌరవించే విధంగా ఉండాలి. ధర్మాన్ని కాపాడుతూ, పరస్పర గౌరవంతో ముందుకు సాగడమే మనందరి బాధ్యత.

జై గణనాధా!
జై హిందూ ధర్మం!

Nadendla Manohar Naga Babu JanaSena Shatagni

02/09/2026

యువత బంగారు కలల సాకారం కోసం, వారి బంగారు భవితకు పునాదులు వేస్తూ, కొత్త తరాన్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జనసేనాని Pawan Kalyan గారి జన్మదినం రోజున జనసేన యువజన విభాగాన్ని ప్రారంభిస్తున్నారు.”

బైక్‌కు గమ్యం ఎంత ముఖ్యమో… యువత జీవితానికి లక్ష్యం అంతే ముఖ్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణానికి యువజన విభాగం నాంది కావాలి.”

“హ్యాపీ బర్త్‌డే జనసేనాని, Deputy CMO, Andhra Pradesh శ్రీ గారు — మీ ఆశయాలే మా గమ్యం, యువజన విబాగ ప్రారంభ బైక్ ర్యాలీ లో...

— - JanaSena Party

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో యువత భాగస్వామ్యం

నెల్లూరు: యువత కలలను సాకారం చేస్తూ, వారికి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ నిరంతరం కృషి చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా నెల్లూరులో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ యువజన విభాగం ప్రారంభ కార్యక్రమంలో భాగంగా, కొత్త తరాన్ని, యువతరాన్ని, నూతన శక్తిని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జవాబుదారీతనం కలిగిన సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన పార్టీ నాయకులు కిషోర్ గునుకుల తెలిపారు.

ర్యాలీ ప్రారంభానికి ముందు 16వ డివిజన్‌లోని చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఉన్న వినాయక స్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, ప్రజలకు మరింత సేవ చేసే శక్తి ప్రసాదించాలని ప్రార్థించారు.

పూజా కార్యక్రమాల అనంతరం దేశవ్యాప్తంగా ప్రజారంజకమైన, పారదర్శకమైన పాలన అందిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆశయస్ఫూర్తితో మరింత సమర్థవంతమైన ప్రజాపాలన సాగించాలని ఆకాంక్షిస్తూ, ఆయన చిత్రపటానికి దిష్టి తీశారు. ప్రజాసేవలో ఆయనకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమాల ఆశీర్వాదాలతో బైక్ ర్యాలీని ప్రారంభించారు.

“బైక్‌కు గమ్యం ఎంత ముఖ్యమో… యువత జీవితానికి లక్ష్యం అంతే ముఖ్యం”

యువతకు ఎంతో ఇష్టమైన బైక్ ర్యాలీని ఒక సందేశాత్మక కార్యక్రమంగా మలుస్తూ, మన బైక్ మనల్ని గమ్యస్థానానికి చేర్చినట్లే, జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానివైపు నిరంతరం ప్రయాణిస్తే విజయాన్ని సాధించవచ్చని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ గారు యువత కోసం తపిస్తున్న విధానాలకు అనుగుణంగా యువతను ప్రజాసేవలో భాగస్వాములను చేయడమే యువజన విభాగం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం రేపటి బంగారు భవిత నిర్మాణానికి నాంది కావాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా అసమానతలు లేని సమాజ నిర్మాణం, అభివృద్ధికి నోచుకోని వర్గాలు లేకుండా చేయడం, పరస్పర స్నేహబంధాన్ని బలోపేతం చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి పవన్ కళ్యాణ్ గారి సంకల్పాల సాధనకు యువత తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నెల్లూరు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏవీఎం కాంపౌండ్ వద్దకు చేరుకుని, జిల్లా స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతతో కలిసి ముందుకు సాగింది.

ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు యోజనా విభాగం, జనశ్రీన యోజనా విభాగం లోగోలను ఆవిష్కరించి, ఆ విభాగాల విధివిధానాలను జనసేన పార్టీ నాయకులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు వివరించనున్నారు. అనంతరం యువజన విభాగాన్ని అధికారికంగా ప్రారంభించనున్నాము అని నిర్వాహకులు తెలిపారు. యువతను సంఘటితం చేసి, ప్రజాసేవ, సామాజిక బాధ్యత, అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములను చేయడమే ఈ విభాగాల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కిషోర్ గునుకుల సందేశం

“యువత కలలు కనే తరం మాత్రమే కాదు… ఆ కలలను నిజం చేసే శక్తి. ఆ శక్తిని ప్రజాసేవలో భాగస్వామ్యం చేస్తూ, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో యువతను ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా రేపటి బంగారు భవిష్యత్తుకు యువత పునాదిగా నిలవాలి.”

జనసేనాని, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కిషోర్ గునుకుల మరియు జనసేన కుటుంబం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Naga Babu Nadendla Manohar
JanaSena Shatagni



Address

27-1-1086, Balaji Nagar, Lakshmi Nagarext
Nellore
524002

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919494852971

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పార్టీ నెల్లూరు జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జనసేన పార్టీ నెల్లూరు జిల్లా:

Shortcuts

Share