16/10/2023
నెల్లూరు నగరానికి చెందిన నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు, జాతీయ బి.సి. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరు రాము, వారి మిత్రబృందం దాదాపు 3000 మంది నగరంలోని నర్తకి సెంటర్‌లో నగర శాసనసభ్యులు డా॥ పి.అనీల్కుమార్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బిసి ఉద్యమాల్లో పాల్గొంటూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి, తనదైన శైలిలో సేవాకార్యక్రమాలు నిర్వహించిన తాళ్ళూరు రాము లాంటి మంచి వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం శుభపరిణామమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మాకు మద్దతుగా పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. పార్టీలో చేరినవారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో తాళ్ళూరు రాము, ఉడతా రాజశేఖర్ యాదవ్, తాళ్ళూరు రవి, రేష్మ, నల్లగల్ల ధర్మేంద్ర, మదన్, సుమన్, రంజిత్, కిషోర్, కొండారెడ్డి, విజయ్, తదితరులు వున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి బోర్డు మెంబర్ సిద్ధవరం యానాదయ్య, డిప్యూటీ మేయర్ ఎండి.ఖలీల్‌అహ్మద్, కార్పొరేటర్ వేలూరు మహేష్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు సూరిశెట్టి నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.