07/10/2017
ఢిల్లీలో జరిగిన 22వ GST మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూడు నెలల అనంతరం పరిస్థితిని సమీక్షించి విసృత మార్పులు చేసింది. 27 వస్తువులపై పన్ను తగ్గించడం ప్రధానాంశం. పన్నుల చెల్లింపు, రిటర్నుల దాఖలులో చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు వెసులుబాట్లు కల్పించింది. ఎగుమతుదారుల విషయంలో నిబంధనలు సడలించింది. శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి 22వ సమావేశంలో వీటన్నింటిపై చర్చ జరిగింది. పన్ను మదింపు, చెల్లింపుల్లో చిన్న, మధ్య తరహా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను తొలగించామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ . చిన్న వ్యాపారులకు పెద్ద వూరట.. రిటర్నుల దాఖలులో వెసులుబాటు కల్పించింది. వస్త్ర పరిశ్రమపై భారం తగ్గింది. రెస్టారెంట్లపై పన్నుల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేయాలని, ఎగుమతిదార్లు 0.1% పన్ను చెల్లిస్తే చాలునని నిర్ణయించింది GST మండలి సమావేశం .నాన్ బ్రాండెడ్ ఆయుర్వేద మందులు, నాన్ బ్రాండెడ్ నమ్ కీన్ పై GST 12 నుంచి 5 శాతానికి తగ్గించారు. చేతితో వడికిన నూలుపై GST ని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. మార్బుల్, గ్రానైట్ కాకుండా… ఫ్లోరింగ్ పై పరిచే రాళ్లతో పాటు స్టేషనరీ ఐటమ్స్, డిజిల్ ఇంజిన్ విడిభాగాలు, పంపు విడిభాగాలపై భారాన్ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ICDS లో భాగంగా పిల్లలకు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్లపై పన్ను భారాన్ని 12 నుంచి 5 శాతంగా మార్చారు. బంగారు ఆభరణాల కొనుగోళ్లకు పాన్ కార్డు, ఆధార్ తప్పని సరి నిబంధనపై GST నోటిఫికేషన్ ను రద్దు చేసింది. 2 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న జెమ్స్, జ్యువెలరీ వ్యాపారులను మనీ లాండరింగ్ నిరోదక చట్టం పరిధిలోకి తీసుకురావద్దని GST కౌన్సిల్ నిర్ణయించింది.